Works.. Money : ఉన్నంతలో దోచేద్దాం !
ABN, Publish Date - Aug 04 , 2024 | 11:23 PM
కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఒక్కరంటే ఒక్కరు తమ పని పెండింగ్‌లో ఉంద ని అడిగే వారే లేడు. దీనికి మామూళ్లే ప్రధాన కారణం. ఎందుకంటే ఇక్కడ పనిని బట్టి మామూళ్ల వసూలు చేస్తున్నారు. ఈ తతంగమంతా పుట్లూరు మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సాగుతోంది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎక్కడినుంచో అధికారులు బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం అధికారులను తమతమ స్థానాలకు ...
పలు ప్రభుత్వ కార్యాలయాల్లో చకచకా పనులు
పనిని బట్టి రూ.5వేల నుంచి 10వేలు వసూలు
దగ్గరుండి సెటిల్‌మెంట్లు చేస్తున్న వైనం
పుట్లూరు మండలంలో చెలరేగుతున్న అధికారులు
తాడిపత్రి, ఆగస్టు 4: కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఒక్కరంటే ఒక్కరు తమ పని పెండింగ్‌లో ఉంద ని అడిగే వారే లేడు. దీనికి మామూళ్లే ప్రధాన కారణం. ఎందుకంటే ఇక్కడ పనిని బట్టి మామూళ్ల వసూలు చేస్తున్నారు. ఈ తతంగమంతా పుట్లూరు మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సాగుతోంది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎక్కడినుంచో అధికారులు బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం అధికారులను తమతమ స్థానాలకు పంపుతోంది. దీంతో ఉన్నంతలో చక్కబెట్టుకోవాలని భావించిన అధికారులు సెటిల్‌మెంట్లకు పూనుకున్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అన్న చందంగా ఏ ఒక్క ఫైల్‌ను విడిచిపెట్టకుండా అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మండలంలో ఎక్కడ పెండింగ్ ఫైళ్లు ఉన్నాయో తెలుసుకొని మరీ అధికారులు సిబ్బందిని పంపించి పంచాయతీలకు పిలిపించి వాటాలు మాట్లాడుకొని పనులు చేసి పెడుతున్నారంటే అక్రమార్జనలో వారి నిబద్ధత అర్థమవుతోంది.
చకచకా పనులు
సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరగాలంటే నెలలు, సంవత్సరాలు పడుతుంటాయి. కానీ పుట్లూరు మండలంలో మాత్రం డబ్బులుంటే చాలు పనులు చకచకా సాగిపోతుంటాయి. దీనికి ఎవరూ అతీతులు కారు. సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకు అధికారులు ఎవరిని వదలడం లేదు. కొన్ని రోజుల్లో బదిలీపై వెళుతుండటంతో అక్రమార్జనను వేగవంతం చేశారు. ప్రజలు కార్యాలయాలకు వెళ్లడం కాదు అధికారులే సిబ్బంది చేత సమస్యలున్న వారిని గుర్తించి వారివద్దకు వెళ్లి మాట్లాడి పంచాయతీలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పనిని బట్టి రేట్ ఫిక్స్
ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిని బట్టి రేట్ ఫిక్స్ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఒక పనికి కనీసం రూ.2వేల నుంచి రూ. 10వేల వరకు వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిసింది. బదిలీ అయ్యేలోపే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రాజకీయ నాయకులను సైతం వీరు వదలడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారపక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అధికారులు విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న ప్రతి ఫైల్‌ను బయటకు తీసి సెటిల్‌మెంట్లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ఏ ఒక్కరిని వదలకుండా ప్రతి ఫిర్యాదుదారుడితో కూర్చొని మాట్లాడి నీ పని నేను చేయిస్తా నాకెంత ఇస్తావ్ అంటూ బహిరంగంగా మాట్లాడుకొని పనులు చేయించి పెడుతున్నట్లు సమాచారం.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Aug 04 , 2024 | 11:26 PM