ROADS : గుంతల రోడ్లకు మహర్దశ
ABN, Publish Date - Nov 29 , 2024 | 11:58 PM
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామీణ రోడ్డు నిర్లక్ష్యాని గురయ్యా యి. కొన్నింటికి నిధులు మంజూరైనా ప్రజా ప్రతిని ధులు తారురోడ్లు వేయలేకపోయారు. దీంతో ఆ గ్రా మాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడా ్డరు. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే తారు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూ రు చేసి, పనులు ప్రారంభించడంతో గ్రామీణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిర్మాణ పనులు ప్రారంభం
రాప్తాడు, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామీణ రోడ్డు నిర్లక్ష్యాని గురయ్యా యి. కొన్నింటికి నిధులు మంజూరైనా ప్రజా ప్రతిని ధులు తారురోడ్లు వేయలేకపోయారు. దీంతో ఆ గ్రా మాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడా ్డరు. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే తారు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూ రు చేసి, పనులు ప్రారంభించడంతో గ్రామీణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని మరూరు 44వ జాతీయ రహదారి వద్ద నుంచి చాపట్ల గ్రామా నికి 3 కి.మీ తారు రోడ్డు నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వంలోనే నిధులు మంజూరయ్యాయి. అలాగే మరూరు 44వ జాతీయ రహ దారి వద్ద నుంచి ఎం. చెర్లోపల్లి, పాలబావి మీదుగా మారెమ్మ ఆలయం వరకు తారు రోడ్డు నిర్మాణంకు ని ధులు మంజూరయ్యాయి. శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. 2019లో ఎన్నికల్లో వైసీపీ అధికారం లోకి రావడంతో రోడ్డు పను లు నిలిపివేశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో నిర్మించలేక పోయారు. 2024 ఎన్నికల ప్రచారంలో పరిటాల సునీత చాపట్ల, ఎం చెర్లోపల్లి, పా లబావి గ్రామాలకు తా రురోడ్డు నిర్మిస్తామనని బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే పరిటాల సునీత పీఆర్ నిధులు మంజూరు చేయించారు. మ రూరు నుంచి చాపట్లకు 3 కి. మీ తారు రోడ్డు నిర్మా ణానికి రూ. 1.59 కోట్లు, మరూరు నుంచి ఎం. చెరో ్లపల్లి, పాలబావి మీదుగా మారెమ్మ ఆలయం వరకు 8 కి.మీ తారు రోడ్డు నిర్మాణానికి రూ.4.90 కోట్లు నిధు లు మంజూరు చేశారు. పనులు ప్రారంభిం చారు. ఈ నేపథ్యంలో రోడ్డుకు ఇరువైపులా మట్టి వేసి చదును చేశారు. మరో వారం రోజుల్లో తారు వేయనున్నారు. గ్రామాలకు తారురోడ్డు నిర్మిస్తున్నారని వాహనదారు లు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేకి ఆయా గ్రామస్థులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
గత ఐదేళ్లలో రోడ్డు వేయలేదు - కుమార్ చాపట్ల
మరూరు నుంచి చాపట్ల గ్రామానికి తారు రోడ్డు ని ర్మాణం కోసం గత టీడీపీ ప్రభుత్వంలోనే నిధులు మం జూరయ్యాయి. అయితే వైసీపీ ప్రజా ప్రతినిధులు ఐదేళ్లలో తారు రోడ్డు వేయ లేకపోయారు. రోడ్డు సక్ర మంగా లేకపోవడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బం దులు పడ్డారు. ఎన్నికల హామీ ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయించడం అభినందనీయం.
గుంతల రోడ్లతో ఇబ్బంది పడ్డారు - సూరి, మరూరు
మరూరు నుంచి ఎం చెర్లోపల్లి, పాలబావి గ్రామా లకు రోడ్డు సక్రమంగా లేదు. గుంతల రోడ్డులో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూటమి అధికారం లోకి వచ్చిన వెంటనే తారు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించింది. దీంతో ఎం చెర్లోపల్లి, పాలబావి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Nov 29 , 2024 | 11:58 PM