SOCIETY : ప్రభుత్వాల చొరవతో సహకారానికి జవసత్వాలు
ABN, Publish Date - Nov 15 , 2024 | 12:41 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకార వ్యవస్థకు జవసత్వాలు నింపుతున్నాయని... దీంతో సొసైటీలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నాయని ది అనంతపురం కోఆపరేటివ్ అర్బన బ్యాంకు చైర్మన జేఎల్ మురళీధర్ పేర్కొన్నారు. స్థానిక సుభాష్ రోడ్డు లోని శ్రీకృష్ణదేవరాయభవనలో గురువారం ఆయన సహకార జెండాను ఆవిష్కరించి, 71వ అఖిల భారత జాతీయ సహకార వారోత్సవాలను ప్రారంభించారు.
అర్బన బ్యాంకు చైర్మన జేఎల్ మురళీధర్
అనంతపురం క్లాక్‌టవర్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకార వ్యవస్థకు జవసత్వాలు నింపుతున్నాయని... దీంతో సొసైటీలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నాయని ది అనంతపురం కోఆపరేటివ్ అర్బన బ్యాంకు చైర్మన జేఎల్ మురళీధర్ పేర్కొన్నారు. స్థానిక సుభాష్ రోడ్డు లోని శ్రీకృష్ణదేవరాయభవనలో గురువారం ఆయన సహకార జెండాను ఆవిష్కరించి, 71వ అఖిల భారత జాతీయ సహకార వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన మాట్లాడుతూ దేశ మొట్ట మొదటి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ సహకార వ్యవస్థకు చేయూతనిచ్చి, గ్రామీణ ప్రాంతాల్లో పేదలు, రైతులకు అండగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. ఇందుకు స్ఫూర్తిగా నెహ్రూ జయంతి రోజున సహకార వారోత్సవాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వారోత్స వాలలో భాగంగా ఆదివారం ఆర్డీటీ స్టేడియంలో ఉద్యోగుల క్రికెట్ పోటీలు, 19న అర్బన బ్యాంకులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు వైస్‌చైర్మన వెంకటాద్రి, పాలకవర్గసభ్యులు కృష్ణకుమార్, సుంకర రమేష్, మాగిశెట్టి చంద్రశేఖర్, రొళ్ల భాస్కర్, చింతా భాస్కర్, సీఈఓ విజయభాస్కర్, ఖాతాదారులు, ఉద్యో గులు తదితరులు పాల్గొన్నారు. అలాగే నగరంలోని రామ్‌నగర్‌లో ఉన్న రాయలసీమ సహకార శిక్షణ కేంద్రంలో సీనియర్ డిప్యూటీ రిజిసా్ట్రర్ నారాయణ స్వామి చేతుల మీదుగా సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. అర్బనబ్యాంకు చైర్మన జేఎల్ మురళీఽ దర్ ముఖ్య అతిథిగా హాజరై సహకార వారోత్సవాల ప్రాధాన్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌సీటీసీ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Nov 15 , 2024 | 12:41 AM