ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA MS Raju : టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎంఎస్‌ రాజు

ABN, Publish Date - Oct 30 , 2024 | 11:51 PM

మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిగా అవకాశం దక్కింది. ఈ మేరకు బుధవారం టీటీడీ బోర్డు కార్యవర్గాన్ని ప్రభుత్వం ప్రకటించింది. చైర్మనతోపాటు 23 మందికి సభ్యులుగా అవకాశం కల్పించారు.

నియోజకవర్గానికి రెండోసారి..

మడకశిర/టౌన, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిగా అవకాశం దక్కింది. ఈ మేరకు బుధవారం టీటీడీ బోర్డు కార్యవర్గాన్ని ప్రభుత్వం ప్రకటించింది. చైర్మనతోపాటు 23 మందికి సభ్యులుగా అవకాశం కల్పించారు. అందులో ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజును బోర్డు సభ్యుడిగా ఎంపిక చేశారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈయన టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో చివరి నిమిషంలో మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్నారు. విజయం సాధించారు. ఈ నేపథ్యంలో తాజాగా టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎంఎస్‌ రాజును ఎంపిక చేయడం గమనార్హం.

మడకశిరకు టీటీడీ భాగ్యం

మడకశిర నియోజకవర్గానికి టీటీడీ భాగ్యం దక్కుతోంది. గత వైసీపీ పాలనలో నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన తిప్పేస్వామి సైతం టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. తాజాగా ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజును సైతం బోర్డు సభ్యుడిగా ఎంపిక చేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Oct 30 , 2024 | 11:51 PM