ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TDP LEADERS : మున్సిపల్‌ కమిషనర్‌.. మాకొద్దు

ABN, Publish Date - Sep 02 , 2024 | 12:08 AM

గతంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున తమకొద్దని టీడీపీ ఎస్సీసెల్‌ జిల్లా ఉపాధ్యక్షు డు కేశగాళ్ల శ్రీనివాసులు అన్నారు. గాంధీనగర్‌లోని టీడీపీ స్థానిక కార్యాలయం లో ఆదివారం ఆయన విలేకరుల సమావే శంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ధర్మవరం మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేసిన మల్లికార్జున గతంలో టీడీపీ శ్రేణులకు పూర్తిగా వ్యతిరేకంగా, వైసీపీ నాయకులకు అనుకూ

Keshagalla Srinivasulu, District Vice President of TDP SCCELL, is speaking

గతంలో ఆయన అవినీతి, అక్రమాలపై

విచారణ చేపట్టాలి: టీడీపీ నాయకులు

ధర్మవరం, సెప్టెంబరు 1: గతంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున తమకొద్దని టీడీపీ ఎస్సీసెల్‌ జిల్లా ఉపాధ్యక్షు డు కేశగాళ్ల శ్రీనివాసులు అన్నారు. గాంధీనగర్‌లోని టీడీపీ స్థానిక కార్యాలయం లో ఆదివారం ఆయన విలేకరుల సమావే శంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ధర్మవరం మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేసిన మల్లికార్జున గతంలో టీడీపీ శ్రేణులకు పూర్తిగా వ్యతిరేకంగా, వైసీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తూ అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అప్పట్లో మల్లేనిపల్లి వద్ద ఉన్న డంపింగ్‌ యార్డ్‌లో కూడా కోట్లాది రూపాయాలు స్వాహా అయినట్లు పట్టణంలో చర్చ జరుగుతోందన్నారు. అలాంటి వాటిపై విచారణ చేసి సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, తిరిగి ఽఆయనను ధర్మవరం మున్సిపల్‌ కమిషనర్‌గా నియమించడంలో అంతర్యమేమిటో అర్థం కావడంలేదన్నారు. ఆయనను ఇక్కడే ఉంచితే, బదిలీపై వెళ్లేంత వరకు ఎస్సీసెల్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ గజ్జల సుబ్రహ్మణ్యం, పట్టణ ప్రధానకార్యదర్శి మొండి శ్రీనివాసులు, మండల ప్రధానకార్యదర్శి ఎంజీ ఆదెప్ప, నాయకులు చిన్ననరసింహులు, విశ్వనాథ్‌, మురళి పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 02 , 2024 | 12:08 AM

Advertising
Advertising