CHAIRMAIN JCPR: తాడిపత్రి అభివృద్ధే నా లక్ష్యం
ABN, Publish Date - Dec 26 , 2024 | 12:09 AM
నా ప్రాణం ఉన్నంతవరకు తాడిపత్రి అభివృద్ధే లక్ష్యమని మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. స్థానిక బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయంలో బుధవారం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
తాడిపత్రి, డిసెంబరు25(ఆంధ్రజ్యోతి): నా ప్రాణం ఉన్నంతవరకు తాడిపత్రి అభివృద్ధే లక్ష్యమని మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. స్థానిక బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయంలో బుధవారం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి తాను శక్తివంచన లేకుండా కృషిచేస్తానన్నారు. తాడిపత్రిని అధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయంలో ఉన్న కల్యాణమండపం శిథిలిమైందన్నారు. ఆర్కియాలజీ అధికారులు బాలకృష్ణారెడ్డి, శివకుమార్, యోగి కల్యాణమండపాన్ని పరిశీలించారన్నారు. కల్యాణమండపం పునఃనిర్మాణానికి అధికారులు అనుమతి కూడా ఇచ్చారని తెలిపారు. వీరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. ఐదేళ్లక్రితం తనకు కొంచెం అహంభావం, ప్రిస్టేజీ ఉండడంతో మూల్యం చెల్లించుకున్నానన్నారు. ప్రస్తుతం ఎలాంటి పనిలేదని అభివృద్ధి పనులే ప్రధానమన్నారు. తాడిపత్రి ప్రజల కోసం నా అహం, ప్రిస్జేజీ పక్కనపెడతానని, వారికోసం ఎంతటికైనా తలవంచుతానని తెలిపారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంతవరకు ఎవరికి భయపడనని నిస్వార్థంగా పనిచేస్తానన్నారు. ఆలయాలతోపాటు మసీదులు, చర్చీలను కూడా అభివృద్ధిచేస్తానని ఆయన తెలిపారు.
Updated Date - Dec 26 , 2024 | 12:09 AM