ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

HIV : చికిత్స లేదు..

ABN, Publish Date - Aug 28 , 2024 | 12:27 AM

అప్పట్లో ఆ పేరు వింటే వణికిపోయేవారు. ప్రచారం కూడా హోరెత్తిపోయేది. వాల్‌ పోస్టర్లు, కరపత్రాలు, ర్యాలీలు, అవగాహన సదస్సులు, టీవీలు, రేడియోలు, సినిమా హాళ్లలో ప్రకటనలు..! ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ. ఫలితంగా హెచఐవీ, ఎయిడ్స్‌ పట్ల జనంలో అవగాహన పెరిగింది. వ్యాధి సోకకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేవారు. సురక్షిత లైంగిక పద్ధతులను ప్రారంభించారు. రక్త మార్పిడి, ఒకసారి వాడిన సిరంజిలు పడేయడం, సెలూనలలో పరికరాల శుభ్రత, బ్లేడ్‌ మార్చారో లేదో పరిశీలించడం.. ఇలా అన్ని జాగ్రత్తలు ...

A counter that provides medicines to HIV victims in the district hospital

నివారణ ఒక్కటే మార్గం..!

గుర్తుంది కదా.. మరచిపోయారా..?

ఎయిడ్స్‌.. ఇంకా వెంటాడుతూనే ఉంది

రాష్ట్రస్థాయిలో జిల్లాకు ఎనిమిదో స్థానం

31 మండలాల్లోనూ హెచఐవీ బాధితులు

అప్పట్లో ఆ పేరు వింటే వణికిపోయేవారు. ప్రచారం కూడా హోరెత్తిపోయేది. వాల్‌ పోస్టర్లు, కరపత్రాలు, ర్యాలీలు, అవగాహన సదస్సులు, టీవీలు, రేడియోలు, సినిమా హాళ్లలో ప్రకటనలు..! ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ. ఫలితంగా హెచఐవీ, ఎయిడ్స్‌ పట్ల జనంలో అవగాహన పెరిగింది. వ్యాధి సోకకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేవారు. సురక్షిత లైంగిక పద్ధతులను ప్రారంభించారు. రక్త మార్పిడి, ఒకసారి వాడిన సిరంజిలు పడేయడం, సెలూనలలో పరికరాల శుభ్రత, బ్లేడ్‌ మార్చారో లేదో పరిశీలించడం.. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. హైవేలలో సుదూర ప్రయాణాలు చేసే డ్రైవర్లు సెక్స్‌ వర్కర్లతో


గడుపుతున్న కారణంగా వైరస్‌ వ్యాపిస్తోందని గుర్తించి.. దాన్నీ కట్టడి చేశారు. మునుపటితో పోలిస్తే.. దీని గురించి ఇప్పుడు పెద్దగా చర్చ జరగడం లేదు. కానీ, విపత్తు తొలగి పోలేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా హెచఐవీ సోకుతుందని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికీ హెచఐవీ, ఎయిడ్స్‌కు చికిత్స లేదని, నివారణ ఒక్కటే మార్గమని అంటున్నారు.

-అనంతపురం టౌన

ఎక్కడికీ పోలేదు..

అభివృద్ధిచెందిన సమాజంలో ఉంటున్నాం. సాంకేతికపరంగానూ దూసుకుపోతున్నాం. ఇలాంటి తరుణంలోనూ నిర్లక్ష్యం కొనసాగుతోంది. ‘ఏమౌతుందిలే..’ అనుకుని.. క్షణికావేశానికి.. క్షణికానందానికి పోతున్నారు. ఫలితంగా హెచఐవీ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తమ జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు. ఆధారపడిన భార్య, బిడ్డల జీవితాల్లో అంధకారం నింపుతున్నారు. జిల్లాలో హెచఐవీ కేసుల గణాంకాలు ప్రమాదం ఏమాత్రం తగ్గలేదని స్పష్టంగా చెబుతున్నాయి. జిల్లాలోని 31 మండలాలల్లోనూ హెచఐవీ కేసులు ఉన్నాయి. మూడు ప్రాంతాలలో కేసులు సంఖ్య మరీ ఎక్కువగా ఉంది.

తరిమేద్దాం..

అధికారిక గణాంకాలు ప్రకారం జిల్లాలో గడిచిన మూడేళ్లలో 1,129 హెచఐవీ కేసులు నమోదయ్యాయి. 2022-23లో జిల్లాలో 498 కేసులు, 2023-24లో 519 కేసులు నమోద య్యాయి. 2024-25లో ఏడాదికి సంబంధించి.. ఇప్పటివరకు 112 కేసులు నమోదయ్యాయి. హెచఐవీ బాధితులలో ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు, ఉపా ధ్యాయులు.. చివరకు కొందరు వైద్యులు కూడా ఉండటం గమనార్హం. వీరిలో కొందరికి తల్లిదండ్రుల నుంచి వైరస్‌ సోకింది. ఇందులో వారి పొరపాటు ఏమీ లేదు. బాధితులు చికిత్స చేయించుకుంటూ ఆత్మస్థైర్యంతో జీవిస్తున్నారు.

ఎలా సోకుతుందంటే..

హ్యూమన ఇమ్యూనో డెఫీసియెన్సీ వైరస్‌ (హెచఐవీ) మానవ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పూర్తిగా దెబ్బతీస్తుంది. అంటువ్యాధులు, రోగాలతో పోరాడే సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. ఈ స్థితిని ఎయిడ్స్‌(అక్వైర్డ్‌ ఇమ్యూన డెఫీసియెన్సీ సిండ్రోమ్‌) అంటారు. హెచఐవీ సోకినంతమాత్రాన ఎయిడ్స్‌ ఉన్నట్లు కాదు. సకాలంలో గుర్తించి, సరైన వైద్యం తీసుకుంటే ఈ స్థితిలో కొన్నేళ్లపాటు జీవించవచ్చు. కానీ నిర్లక్ష్యం చేస్తే తీవ్రత పెరిగి ఎయిడ్స్‌ సంక్రమిస్తుంది. ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. ఎలాంటి రక్షణ లేకుండా లైంగిక ప్రక్రియలో పాల్గొనడం ద్వారా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. హెచఐవీ ఉన్నవారికి వాడిన సూదులు, సిరంజిలను ఇతరులకు వాడినా వైరస్‌ సోకుతుంది. హెచఐవీ బాధితుల రక్తాన్ని మరొకరికి ఎక్కించినా వైరస్‌ సోకుతుంది. గతంలో తల్లి నుంచి గర్భస్థ శిశువుకు వైరస్‌ సోకేది. కానీ ఆ ప్రమాదం నుంచి బిడ్డను బయట పడేసే ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా తల్లికి వైరస్‌ ఉన్నా.. బిడ్డకు సోకుండా వైద్యులు కాపాడగలుగుతున్నారు.

మూడు ప్రాంతాల్లో ఎక్కువ

అధికారిక గణాంకాల ప్రకారం హెచఐవీ కేసులు అనంతపురం నగరంలో అత్యధికంగా ఉన్నాయి. రెండో స్థానంలో గుంతకల్లు, మూడో స్థానంలో తాడిపత్రి ఉన్నాయి. కేసుల సంఖ్య కూడా ఎక్కడే ఎక్కువగా పెరుగుతోంది.

అనంతపురం నగరంలో 2022-23లో 107 కేసులు, 2023-24 లో 112 కేసులు 2024-25లో ఇప్పటి వరకూ 33 కేసులు నమోదయ్యాయి. గుంతకల్లులో 2022-23లో 53 కేసులు, 2023-24లో 59 కేసులు, 2024-25లో ఇప్పటి వరకూ 15 కేసులు నమోదయ్యాయి. తాడిపత్రిలో 2022-23లో 57 కేసులు, 2023-24లో 56 కేసులు, 2024-25లో ఇప్పటి వరకూ 11 కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన గడిచిన మూడేళ్లలో అనంతపురం నగరంలో 252, గుంతకల్లులో 127, తాడిపత్రిలో 124 కేసులు నమోదయ్యాయి.

గడిచిన మూడేళ్లలో గుత్తిలో 60, బుక్కరాయసముద్రంలో 58, కణేకల్లులో 37, ఉరవకొండలో 37, గార్లదిన్నె 36, కల్యాణదుర్గం 27, నార్పల 26, వజ్రకరూరు 22, డి.హీరేహాళ్‌ 21, పెద్దవడుగూరు 20, పామిడి 20, ఆత్మకూరు 19, కుందిర్పి 19, విడపనకల్లు 17, శెట్టూరు 16, పెద్దపప్పూరు 15, పుట్లూరు 14, బొమ్మనహాళ్‌ 13, బ్రహ్మసముద్రం 13, రాప్తాడు 11, ఎల్లనూరు 09, బెళుగుప్ప మండలంలో 08 కేసులు నమోదయ్యాయి.

చికిత్స లేదు..

ఎయిడ్స్‌కు చికిత్స లేదు. నివారణ ఒక్కటే మార్గం. వైరస్‌ను అదుపులో ఉంచుకుని దీర్ఘకాలం జీవించడానికి అవకాశాలు ఉన్నాయి. యాంటీ రెట్రోవైరల్‌ థెరఫీ(ఏఆర్‌టీ) మందులు వాడడం వల్ల వైరస్‌ లక్షణాలను తగ్గిం చవచ్చు. ఈ మందులు తీసుకున్నా.. హెచఐవీని పూర్తిగా నిర్మూలించలేము. లక్షణాలను తగ్గించి, రోగ నిరోధక శక్తిని మెరుగు పరిచేందుకు మాత్రమే ఈ మందులు ఉపయోగపడతాయి. హెచఐవీ బాధితులు క్రమం తప్పకుండా మందులు వాడాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ఏఆర్‌టీ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఉచితంగా మందులు, పౌష్ఠికాహారాన్ని అందజేస్తోంది.

- డాక్టర్‌ అనుపమ జేమ్స్‌, జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ పోగ్రామ్‌ అధికారి

రోజూ మందులు ఇస్తున్నాం

ఎయిడ్స్‌ మందులకు కొరత లేదు. జిల్లా ఆస్పత్రిలోని ఏఆర్‌టీ సెంటర్‌లో రోజుకు 300 మందికి పైగానే ఉచితంగా మందులు తీసుకుపోతున్నారు. కర్నూలు జిల్లావారు కూడా మన జిల్లాకు వచ్చి మందులు తీసుకుపోతున్నారు. తమ ప్రాంతంలో మందులు తీసుకుంటే విషయం అందరికీ తెలుస్తుందని వారు దిగులు పడుతున్నారు. అందుకే వారికి ఇక్కడ మందులు ఇస్తున్నాం. ఈ మందులను సక్రమంగా వాడాలి. నిర్లక్ష్యం చేస్తే వ్యాధి తీవ్రత పెరుగుతుంది. తొందరగా క్షీణించిపోతారు. ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. ఎయిడ్స్‌ బాధితులు ఇతర జబ్బులకు ఏ మాత్రలు పడితే అవి ప్రైవేటుగా కొని వాడకూడదు. ఏ సమస్య ఉన్నా ఏఆర్‌టీ సెంటర్‌కు రావాలి. ఇక్కడ పరీక్షించి ఆ వ్యాధులకు సరిపడా మందులు ఇస్తాం.

- డాక్టర్‌ సత్యనారాయణ, ఏఆర్‌టీ సెంటర్‌, జిల్లా ఆస్పత్రి

చైతన్యం నింపుతున్నాం..

హెచఐవీ సోకకుండా వైద్య ఆరోగ్యశాఖ ప్రజ లలో చైతన్యం నింపుతోంది. ప్రత్యేక ఎయిడ్స్‌ నియంత్రణ విభాగం ఏర్పాటు చేయించి, ఎయిడ్స్‌ ఎలా సంక్రమిస్తుందో వివరిస్తున్నాం. హెచఐవీ బారిన పడితే మనిషి జీవితం ఎలా మారిపోతుందో, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అవగాహన కల్పిస్తున్నాం. జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ విభాగానికి రాష్ట్ర స్థాయిలో పురస్కారాలు వచ్చాయి. అదే స్ఫూర్తితోనే జిల్లాలో హెచఐవీ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు సహకరించాలి.

- డాక్టర్‌ ఈబీ దేవి, డీఎంహెచఓ

రేపు 5కే రన

ఎయిడ్స్‌ పట్ల చైతన్యం కలిగించడానికే : డాక్టర్‌ అనుపమజేమ్స్‌

అనంతపురం టౌన, ఆగస్టు 27: ఎయిడ్స్‌ నియంత్రణలో భాగంగా ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి గురువారం చేపట్టిన 5కే రన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణాధికారి డాక్టర్‌ అనుపమజేమ్స్‌ పిలుపునిచ్చారు. జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆమె సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ కాలేజ్‌నుంచి ఉదయం 6-30 గంటలకు రన మొదలై టవర్‌క్లాక్‌, సప్తగిరిసర్కిల్‌, ఆస్పత్రి మీదుగా కోర్టురోడ్డు నుంచి తిరిగి కాలేజ్‌ వద్దకు చేరుకుంటుందన్నారు. ఈరనలో విజేతలకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేస్తామన్నారు. 17నుంచి 25ఏళ్లు వయసు వారంతా ఈరనలో పాల్గొనవచ్చన్నారు. కుష్ఠు బాధితుల గుర్తింపు కూడా పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. గత నెల నుంచి జరుగుతున్న సర్వేలో ఇప్పటికి 63 కొత్తకేసులు వచ్చాయని, అందరికి మందులు అందించి వాడేలా చూడాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డాక్టర్‌ శివారెడ్డి, పారామెడికల్‌ ఆపీసర్‌ నాగన్న,హెచఈఓ సత్యనారాయణతదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 28 , 2024 | 12:27 AM

Advertising
Advertising
<