DEVOTION : పాహిమాం... పరమేశ్వరా..!
ABN, Publish Date - Nov 05 , 2024 | 12:26 AM
కార్తీకమాసం తొలి సోమవారం ఆధ్యాత్మికశోభతో అనంత అలరారింది. శైవక్షేత్రాలన్నీ భక్తుల శివనామస్మరణతో మార్మోగాయి. సాయంత్రం మహిళలు పెద్దఎత్తున ఆలయాలకు తరలివచ్చి కార్తీ కదీపాలు వెలిగించారు. ఈ నేపథ్యంలో జిల్లా అంత టా కార్తీక దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగింది.
ఘనంగా కార్తీక దీపోత్సవాలు
కిటకిటలాడిన ముక్కంటి ఆలయాలు
అనంతపురం కల్చరల్, నవంబరు 4(ఆంధ్రజ్యోతి) : కార్తీకమాసం తొలి సోమవారం ఆధ్యాత్మికశోభతో అనంత అలరారింది. శైవక్షేత్రాలన్నీ భక్తుల శివనామస్మరణతో మార్మోగాయి. సాయంత్రం మహిళలు పెద్దఎత్తున ఆలయాలకు తరలివచ్చి కార్తీ కదీపాలు వెలిగించారు. ఈ నేపథ్యంలో జిల్లా అంత టా కార్తీక దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగింది. ముక్కంటికి ప్రీతికరమైన కార్తీకమాస పూజలతో జిల్లాకేంద్రంలోని పలు ఆలయాలు ఆధ్యాత్మికశోభను సంతరించుకున్నాయి. పరమశివుడికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, గణపతిహోమాలతో శివాలయాలన్నీ భక్తిపారవశ్యానికి వేదికలుగా మారాయి. మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయం భక్తుల తో పోటెత్తింది. కాశీవిశ్వేశ్వర స్వామికి రుద్రాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. వందలాదిమంది మ హిళలు ఆలయ ఆవరణలో కార్తీకదీపాలు వెలిగించా రు. హెచ్చెల్సీ కాలనీలోని మంజునాథస్వామికి బిల్వా ర్చన, రుద్రాభి షేకం చేశారు. పాతూరులోని విరూపా క్షేశ్వరాలయం, ఉమానగర్‌లోని దత్తాత్రేయ ఆలయం, హెచ్చెల్సీ కాలనీ చాముండేశ్వరి ఆలయం, ఆరో రోడ్డు శివాలయం, నగరశివారులోని శివకోటి దేవాలయం, శారదానగర్‌లోని శృంగేరి శంకరమఠం, జడ్పీ ఎ దురుగా ఉన్న గీతామందిరం, అరవిందనగర్ సర్వేశ్వ రాలయం, చెరువుకట్ట వద్ద ఉన్న కాశీవిశ్వేశ్వరాలయం పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న ముక్కంటి ఆలయాలన్నీ కార్తీకశోభతో సందడిగా మారాయి.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Nov 05 , 2024 | 12:26 AM