ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ycp : దారి దోపిడీ..!

ABN, Publish Date - Oct 09 , 2024 | 12:08 AM

వైసీపీ ఓటమికి ప్రధాన కారణాల్లో ‘దారులు’ ఒకటి. గుంతలమయమైన రోడ్ల గురించి ఎన్నడూ పట్టించుకోలేదు. దీంతో పల్లె ప్రాంతాల్లో రైతులు స్వచ్ఛందంగా మట్టి వేసి దారులను బాగు చేసుకున్నారు. విడపనకల్లు మండలంలోనూ ఇదే తరహాలో రైతులు చందాలు వేసుకుని పనులు చేసుకున్నారు. కానీ ఈ పనులు తామే చేసినట్లు చూపించుకుని.. కొందరు వైసీపీ ...

Havaligi-Kalavalli Tippa Road (Dam Road)

పొలం దారులను బాగు చేసుకున్న రైతులు

ఎకరానికి రూ.500 తగ్గకుండా విరాళాలు

దొంగ బిల్లులు చేసుకున్న వైసీపీ నాయకులు

వైసీపీ ఓటమికి ప్రధాన కారణాల్లో ‘దారులు’ ఒకటి. గుంతలమయమైన రోడ్ల గురించి ఎన్నడూ పట్టించుకోలేదు. దీంతో పల్లె ప్రాంతాల్లో రైతులు స్వచ్ఛందంగా మట్టి వేసి దారులను బాగు చేసుకున్నారు. విడపనకల్లు మండలంలోనూ ఇదే తరహాలో రైతులు చందాలు వేసుకుని పనులు చేసుకున్నారు. కానీ ఈ పనులు తామే చేసినట్లు చూపించుకుని.. కొందరు వైసీపీ నాయకులు ఉపాధి బిల్లులు పెట్టుకుని రూ.లక్షలు కాజేశారు. విషయం తెలుసుకున్న రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. - విడపనకల్లు

హావళిగి నుంచి కలవళ్లి తిప్ప (డ్యాం) రోడ్డు గుంతలు పడి.. నడవడానికి కూడా వీలు లేని పరిస్థితి ఉండేది. వైసీపీ హయాంలో ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో ఆ దారికి ఇరువైపులా పొలాలు ఉండే రైతులు ఎకరానికి రూ.500 నుంచి రూ.వెయ్యి ప్రకారం చందాలు వేసుకుని.. రోడ్డు వేసుకున్నారు. ఈ మార్గంలో హావళాగి నుంచి చివరి వరకూ ఆరు వేల


ఎకరాలకు పైగా సాగు భూమి ఉంది. పెద్ద రైతులు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకూ ఇచ్చారు. చిన్న రైతులు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ ఇచ్చారు. ఈ సొమ్ముతో హావళిగి నుంచి రాయాపురం వెళ్లే, జగనన్న కాలనీకి వెళ్లే దారిని బాగు చేసుకున్నారు. పార్టీలకు అతీతంగా రైతులందరూ ఇందులో భాగమయ్యారు. ఇంత వరకూ బాగానే ఉన్నా, రైతులు వేసుకున్న ఈ రోడ్డును తామే వేసినట్లు చూపించి.. వైసీపీ నాయకులు ఉపాధి బిల్లులు చేసుకుని స్వాహా చేశారు. గత ఏడాది సెప్టెంబరు 21న ఒక్కో రోడ్డుకు రూ.34 వేల నుంచి రూ.1.40 లక్షలు బిల్లులు చేయించారు. డ్యాం రోడ్డు, రాయాపురం రోడ్డు, కలవళ్లితిప్ప రోడ్డు, వేల్పుమడుగు తిప్ప రోడ్డు, పొలాలకు వెళ్లే దారులకు రైతులు మట్టి తోలించుకుని బాగు చేసుకోగా.. వైసీపీ నాయకులు బిల్లులు కాజేశారు. సుమారు రూ.15 లక్షలు కాజేశారని రైతులు అంటున్నారు.

ఒక్క రోడ్డూ వేయలేదు..

పొలాలకు వెళ్లే మట్టి రోడ్లు అధ్వానంగా ఉంటే మేమే చందాలు వేసుకుని బాగు చేసుకున్నాం. ఒక్కొక్క రైతు ఎకరానికి రూ.500 తగ్గకుండా విరాళాలు ఇచ్చారు. మేము చేయించుకున్న పనులకు వైసీపీ నాయకులు బిల్లులు చేయించుకున్నారు.

- వన్నూరుస్వామి, రైతు

దొంగ బిల్లులు..

ఆ దారిలో నాకు మూడు ఎకరాలు పొలం ఉంది. నా వంతుగా ఎకరానికి రూ.700 ప్రకారం రూ.2100 ఇచ్చాను. పొలాలకు వేళ్లే దారి భయంకరంగా ఉండేది. ఎద్దుల బండ్లు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం. పోయిన ఏడాదే మట్టి రోడ్లు వేయించుకున్నాము. పనులు మేము చేయించుకుంటే.. వైసీపీ నాయకులు దొంగ బిల్లులు పెట్టుకున్నారు.

- భూమా, రైతు

మా డబ్బులు..

డ్యాం రోడ్డులో నాకు ఎనిమిది ఎకరాల పొలం ఉంది. ఎకరానికి వెయ్యి ప్రకారం రూ.8 వేలు నా వంతుగా విరాళం ఇచ్చాను. రైతులందరం కలిసి పొలాలకు వెళ్లేదారిని బాగు చేయిం చుకున్నాము. రోడ్లు వేయించామని ఎవడో బిల్లులు తీసుకుంటే ఎలా ఊరుకుంటాము..? డబ్బులు మావి.. బిల్లులు వారికా..?

- షన్ముఖ, రైతు

మట్టి వేయించాము..

రోడ్డుకు ట్రాక్టర్లతో మట్టి వేయించాము. వైసీపీ నాయకులు చేసిన పనులకు తక్కువ బిల్లులు చేశాము. ఒక్కొక్క రోడ్డుకు రూ.లక్ష నష్టానికి బిల్లులు పెట్టాము. రోడ్లు వేయించిన తరువాతనే బిల్లులు చేశాము. వేల్పుమడుగు రోడ్డు వేశారా లేదా అనే విషయం నాకు తెలియదు. ఎక్కడా దొంగ బిల్లులు పెట్టలేదు.

- రామ్మోహన, టీఏ


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 09 , 2024 | 12:09 AM