Share News

SAVITA: పెనుకొండను ఆదర్శంగా తీర్చిదిద్దుతా: సవిత

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:58 AM

రాష్ట్రంలోనే పెనుకొండ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె శుక్రవారం సోమందేపల్లి మండలంలోని పోలేపల్లి, నడింపల్లి, పూలేపల్లి, పెద్ద బాబ య్యపల్లి, చాలకూరు, గుడ్డంపల్లి తదితర గ్రామాల్లో పెద్దఎత్తున ఎన్నికల ప్రచారం ని ర్వహించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్‌ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. దారిపొడ వునా మహిళలు హారతులలిచ్చి ఆశీర్వదించారు.

SAVITA: పెనుకొండను ఆదర్శంగా తీర్చిదిద్దుతా: సవిత
MLA candidate Savitha's women offering sacrifices

పెనుకొండ టౌన, ఏప్రిల్‌ 26: రాష్ట్రంలోనే పెనుకొండ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె శుక్రవారం సోమందేపల్లి మండలంలోని పోలేపల్లి, నడింపల్లి, పూలేపల్లి, పెద్ద బాబ య్యపల్లి, చాలకూరు, గుడ్డంపల్లి తదితర గ్రామాల్లో పెద్దఎత్తున ఎన్నికల ప్రచారం ని ర్వహించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్‌ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. దారిపొడ వునా మహిళలు హారతులలిచ్చి ఆశీర్వదించారు. అలాగే సూపర్‌సిక్స్‌ పథ కాలు, వాటి లబ్ధిగురించి సవిత వివరించారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... చంద్రబాబు హయాంలో ఏర్పాటు చేసిన పరిశ్రమలే తప్ప నియోజక వర్గంలో వైసీపీ పాలనలో నెలకొల్పినవేవీ లేవన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే వేల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పనతోపాటు ఆరునెలల్లో అర్హులను గుర్తించి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మే 13న జరుగనున్న ఎన్నికల్లో టీడీపీ విజయ పతాకాన్ని ఎగురవేయడం ఖాయమన్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే ప్రజలు ఉరి వేసుకున్నట్లేనన్నారు. చంద్రబాబు బీసీలకు ప్రత్యేక ప్రాధాన్య మిచ్చారని, టీడీపీ ప్ర భుత్వం వచ్చిన వెంటనే అర్హులైన ప్రతి బీసీకి రూ.4వేలు పింఛన, చదువుకునే ప్రతి విద్యార్థికి తల్లికివందనం కింద రూ.15వేలు అమలవుతుందన్నారు.


ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా అమలు చేసే సత్తా చంద్రబాబుకే ఉందన్నారు. జగన్మోహనరెడ్డికి ఇలాంటి సత్తాలేదన్నారు. అలా సత్తా ఉంటే రూ.10లక్షల కోట్లు అప్పుచేసి ఉండేవా డుకాదన్నారు. జగన అసమర్థపాలనతో రాష్ట్రం వెనుకబడి పోయిందన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనుడు ఈ సైకో సీఎం అన్నారు. రాజాధాని అమరావతి ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవమ న్నారు. దాన్ని సీఎం జగన మూడు ముక్కలాటతో చెరిపేశార న్నారు. ఏది ఏమైనా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం, రాష్ట్రం అభివృద్ధి బాటలో నడ వడం ఖాయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నీరుగంటి చంద్ర, కొత్త పల్లి శ్రీధర్‌, భానుకీర్తి, డీవీ ఆంజనేయులు, కిష్ట, జనసేన నాయకులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 27 , 2024 | 12:58 AM