PENSION PROBLEMS : పాపం వృద్ధులు.. పింఛన కోసం పాట్లు
ABN, Publish Date - Jun 02 , 2024 | 12:32 AM
పింఛన విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వృద్ధులకు శాపంగా మారింది. ఇంటింటికీ పంపిణీ చేసే వెసులుబాటు ఉన్నా.. ఈ నెల కూడా బ్యాంకుల్లోనే జమ చేశారు. దీంతో పింఛన సొమ్ము తీసుకునేందుకు శనివారం ఉదయం నుంచే బ్యాంకుల వద్ద మండుటెండలో పడిగాపులు కాశారు. బ్యాంకు ఖాతాల్లో సొమ్ము మధ్యాహ్నం నుంచి జమ చేయడం మొదలు పెట్టారు.
అనంతపురం క్లాక్‌టవర్, జూన 1: పింఛన విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వృద్ధులకు శాపంగా మారింది. ఇంటింటికీ పంపిణీ చేసే వెసులుబాటు ఉన్నా.. ఈ నెల కూడా బ్యాంకుల్లోనే జమ చేశారు. దీంతో పింఛన సొమ్ము తీసుకునేందుకు శనివారం ఉదయం నుంచే బ్యాంకుల వద్ద మండుటెండలో పడిగాపులు కాశారు. బ్యాంకు ఖాతాల్లో సొమ్ము మధ్యాహ్నం నుంచి జమ చేయడం మొదలు పెట్టారు.
దీంతో బ్యాంకులు వృద్ధులతో కిక్కిరిసిపోయాయి. ఏప్రిల్, మే నెలల తరహాలోనే ఈ నెలా ఇబ్బందులు ఎదర్కొన్నారు. నగదు జమకాలేదని చెప్పడంతో చాలామంది వెళ్లిపోయారు. మే 31వ తేదీ సాయంత్రానికే బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమచేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. శనివారం సాయంత్రానికి గానీ వేయలేదు. కొందరికి ఇంటి వద్దే ఇస్తామన్నారేగాని.. సాయంత్రం వరకూ ఇవ్వలేదు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jun 02 , 2024 | 12:33 AM