AP Politics: ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణకు రాజకీయ నేతల పరామర్శ
ABN, Publish Date - Feb 19 , 2024 | 11:35 AM
Andhrapradesh: వైఎస్సార్సీపీ మూకల దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణను పలువురు రాజకీయ నేతలు, విద్యార్థి సంఘాలు, జర్నలిస్టులు పరామర్శించారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌పై వైసీపీ మూకల దాడిని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు.
అనంతపురం, ఫిబ్రవరి 19: వైఎస్సార్సీపీ మూకల దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణను పలువురు రాజకీయ నేతలు, విద్యార్థి సంఘాలు, జర్నలిస్టులు పరామర్శించారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌పై వైసీపీ మూకల దాడిని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకృష్ణను సోమవారం ఉదయం మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, సత్య సాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బికే పార్థసారథి, సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాంభూపాల్ పరామర్శించారు. కాగా.. శ్రీకృష్ణకు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
అసలేం జరిగిందంటే..
జిల్లాలోని రాప్తాడులో ఆదివారం వైసీపీ ‘‘సిద్ధం’’ సభ ఆ పార్టీ నేతలు రెచ్చిపోయారు. ఈ సభలో ఆంధ్రజ్యోతి ఫొటో గ్రాఫర్‌పై వైసీపీ శ్రేణులు విచక్షణ రహితంగా దాడి చేశాయి. జగన్మోహన్ రెడ్డి ప్రసంగించే సమయంలో ప్రజలు, వైసీపీ నేతలు వెళ్లిపోతున్నారని ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణ ఫొటోలు తీశారు. ఈ ఫొటోలను తీయడమే నేరం అన్నట్లుగా వైసీపీ నేతలు మూకుమ్మడిగా దాడి చేశారు. వైసీపీ కార్యకర్తల దాడిలో ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. రాప్తాడు పోలీస్ స్టేషన్‌లో ఈ దాడిపై బాధితుడు ఫిర్యాదు చేశాడు. చికిత్స నిమిత్తం ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై టీడీపీ - జనసేన పార్టీల్లోని నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Feb 19 , 2024 | 11:41 AM