AUTO NAGAR : గుంతల రోడ్లు - వెలగని వీధి లైట్లు
ABN, Publish Date - Dec 09 , 2024 | 12:00 AM
మండల కేంద్రం సమీపంలో ఉన్న ఆటో నగర్‌లో సమస్యలు తిష్ట వేశాయి. ప్రధాన రోడ్లు, లింక్ రోడ్లు అద్వానంగా ఉన్నాయి. భారీ గుంతలు ఏర్పడటంతో వర్షపు నీరు ఎక్కువగా నిలిచి బురదమయంగా మారుతున్నాయి. ద్విచక్రవాహనాలతో పాటూ ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆటో నగర్‌లో చాలా వరకు వీధిలైట్లు కూడా లేకపోవడంతో చీకటి మయం గా ఉంది.
ఆటో నగర్‌లో తిష్ట వేసిన సమస్యలు
ఇబ్బందులు పడుతున్న మెకానిక్‌లు
రాప్తాడు, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం సమీపంలో ఉన్న ఆటో నగర్‌లో సమస్యలు తిష్ట వేశాయి. ప్రధాన రోడ్లు, లింక్ రోడ్లు అద్వానంగా ఉన్నాయి. భారీ గుంతలు ఏర్పడటంతో వర్షపు నీరు ఎక్కువగా నిలిచి బురదమయంగా మారుతున్నాయి. ద్విచక్రవాహనాలతో పాటూ ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆటో నగర్‌లో చాలా వరకు వీధిలైట్లు కూడా లేకపోవడంతో చీకటి మయం గా ఉంది. 2011లో రాప్తాడులో ఆటో నగర్ ఏర్పా టయింది. ఏపీఐఐసీ సంస్థ రాప్తాడులోని సర్వే నెంబర్ 554-2లో 33 ఎకరాల దేవదా యశాఖ భూమిని లీజుకు తీసుకుంది. ఆ భూమిని నబ్ లీజుకు ఆటోనగర్‌కు కేటా యించారు. ఏపీఐఐసీ నిబంధ నల ప్రకారం రాప్తాడులో ఏ ర్పాటు చేశారు. అందులో దా దాపు 375 మెకానిక్ షాపులు నెలకొల్పారు. గతంలో అనంత పురం నగరంలోనే వాహనాల రిపేరీ షాపులు ఉండటం వ లన ట్రాఫిక్ సమస్యలు ఎక్కు వ కావడంతో అప్పట్లో అధికా రులు, ప్రజాప్రతినిధులు నగరానికి దూరంగా మెకానిక్ షాపులు ఉండాలని రాప్తాడులో ఆటో నగర్ ఏర్పాటు చేశారు. ద్విచక్రవాహనం మినహా అన్ని వాహనాల రిపేరీకి మెకానిక్ షాపులు ఉన్నాయి. జిల్లా నలు మూలల నుంచి వాహనాల రిపేరి కోసం ఆటో నగర్‌కు వస్తుంటారు. అయితే ఆటో నగర్‌లో రోడ్లు సక్రమంగా లేకపోవడంతో వాహనదారులు, మె కానిక్ షాపుల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత టీడీపీ హయాంలోనే బోర్లు, మట్టి రోడ్లు...
గత టీడీపీ ప్రభుత్వంలో 2014నుంచి 2019 వరకూ కొంత వరకు అభివృద్ధి పనులు చేపట్టారు. అప్పట్లో ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాల మేరకు స్థానిక నాయకులు 2015లో ఆటో నగర్‌లోని ప్రధాన రోడ్లు, లింక్ రోడ్లకు మట్టి తొలించి వాహనాల రాకపోకలను సులభతరం చేశారు. ఎంపీ నిఽధులు రూ. 5 లక్షలుతో ఆటో నగర్‌లో తాగు నీటి బోర్లు వేయించారు. మినీ ట్యాంకులు నిర్మించి పైపులైన్లు వేశారు. వీధిలైట్లు ఏర్పాటు చేశారు. 2019లో వైసీపీ అధికారంలో వచ్చిన తరువాత ఆటో నగర్‌లో అభివృద్ధి మూలనపడింది. కనీసం మట్టి కూడా తోలించకపోవడంతో రోడ్లు అధ్వా నంగా మారాయి. వీధిలైట్ల మరమ్మత్తులు చేపట్టకపో వడంతో పాడైపోయాయు. చాలా వరకు వీధిలైట్లు లేక కపోవడంతో దొంగతనాలు ఎక్కువ అయ్యాయని మెకానిక్‌లు వాపోతున్నారు.
కూటమి ప్రభుత్వంపైనే ఆశలు
టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఆటో నగర్‌లో అభివృద్ది కార్యక్రమాలు జరుగుతాయని ఇక్క డి మెకానిక్‌లు ఆశిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో నూ ఆటో నగర్‌లో రోడ్లు, వీధిలైట్లు, పైపు లైను, ఇతర అభివృద్ది పనులు చేపట్టారు కావున అభివృద్ధి పనులు జరుగుతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Dec 09 , 2024 | 12:01 AM