PROBLEMS : సమస్యల స్టేషన
ABN, Publish Date - Nov 25 , 2024 | 12:10 AM
అనంత రైల్వే స్టేషన సమస్యలకు నిలయంగా తయారైంది. చాలా అసౌకర్యాలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, వికలాంగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక ప్లాట్ ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు చేరాలంటే నరకప్రాయంగా మారింది. మెట్లు ఎక్కాలంటే చేతకా దు. ట్రాక్‌పై వెళ్లాలంటే ప్రమాదకరం. లిఫ్ట్ నిర్మాణ ప నులు నత్తనడకే నయం అన్న చందంగా సాగుతు న్నాయి.
నత్తనడకన లిఫ్ట్ పనులు
ప్లాట్‌ఫామ్స్‌లో మరుగుదొడ్లు కరువు
కొళాయిల వద్ద అపరిశుభ్రత
ఇబ్బందులు పడుతున్న రైలు ప్రయాణికులు
అనంతపురం న్యూటౌన, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): అనంత రైల్వే స్టేషన సమస్యలకు నిలయంగా తయారైంది. చాలా అసౌకర్యాలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, వికలాంగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక ప్లాట్ ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు చేరాలంటే నరకప్రాయంగా మారింది. మెట్లు ఎక్కాలంటే చేతకా దు. ట్రాక్‌పై వెళ్లాలంటే ప్రమాదకరం. లిఫ్ట్ నిర్మాణ ప నులు నత్తనడకే నయం అన్న చందంగా సాగుతు న్నాయి. వీల్‌చైర్‌లో వెళ్లడా నికి కూడా కాజ్‌వే అను కూ లంగా లేదనే విమర్శలు వి నిపిస్తున్నాయి. రామ చంద్ర నగర్ గేట్ వైపు మాత్రం కాలి బాట ఏర్పాటు చేశారు. అయితే ప్రయాణికు లు ఎక్కువ శాతం పీటీసీ వైపు నుంచి నగరంలోకి వెళుతుంటారు. ఈ మార్గం వికలాంగులు, వృద్దులు వెళ్లడం సవాల్‌గా మారింది.
మరుగుదొడ్లు కరువు
అనంతపురం రైల్వే స్టేషనలోని నాలుగో ప్లాట్ ఫామ్ వైపు నూతన స్టేషన నిర్మాణం జరుగుతోంది. దీం తో ఆ ప్లాట్‌ఫామ్ మీదుగా రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలి చిపోయాయి. దీంతో 4వ ప్లా ట్‌ఫామ్ మీదుగా బెం గళూరు వైపు వెల్లాల్సిన రైళ్ల ను మూడో ప్లాట్‌ఫామ్ మీదుగా పంపుతున్నారు. ఇక గుత్తి వైపు వెళ్ల్లే రైళ్లు దాదాపు ఒకటో ప్లాట్‌ఫామ్ నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే సాయం త్రం సమయంలో ఒకే సారి రెండు రైళ్లు వచ్చినప్పుడు రెండో ప్లాట్‌ఫామ్ మీదుగా రాకపోకలు మళ్లిస్తున్నారు. దీంతో రెండు, మూడు ప్లాట్‌ఫామ్స్‌లో ఒక్కసారిగా రద్దీ పెరిగిపోతోం ది. ఈ ప్లాట్‌పామ్స్‌లో కనీసం మరుగదొడ్లు లేకపో వడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. అదే విధంగా రైల్వే స్టేషనలోని 2, 3వ ప్లాట్‌ఫామ్స్‌లో నిర్వాహణ దారణంగా తయారైంది. అక్కడి నీటి కొళా యిల వద్ద మురుగు పేరుకుపోయి ప్రయాణికులు వినియోగించు కోలేని స్థితి నెలకొంది.
పత్తాలేని సీసీ కెమరాలు
రైల్వే స్టేషన అంటే మొత్తం సీసీ కెమరాల నిఘా లో ఉండటం సర్వ సాధారణం. ఎలాంటి పొరపాటు జరగిన అందులో పట్టుకోవచ్చు. అయితే అనంత రైల్వే స్టేషనలోను పాతభవనం ఉన్న సమయంలో సీసీ కెమరాలు ఉండేవి. పలు సందర్భాల్లో సీసీ పుటేజీల ద్వారానే నిందితులను సకాలంలో పట్టుకున్నారు. అయితే పునర్నిర్మాణంలో భాగంగా పాత స్టేషన ను తొలగించారు. అయితే ప్రస్తుతం రద్దీ ఉన్న ప్రాంతాల్లో అయినా సీసీ కెమరాలు ఏర్పాటు చేస్తే ప్రయాణికుల భద్రతకు కొద్దిగా అయిన దోహదపడే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Nov 25 , 2024 | 12:11 AM