ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

STU : షెడ్యూల్‌ మేరకు పదోన్నతులు ఇవ్వాలి : ఎస్టీయూ

ABN, Publish Date - Nov 07 , 2024 | 12:10 AM

విద్యాశాఖ ఇచ్చిన షెడ్యూల్‌ మేరకు మున్సిపల్‌ టీచర్ల పదోన్నతులు చేపట్టాలని ఎస్టీయూ నా యకులు డిమాండ్‌ చేశారు. ఆ సంఘం నాయకులు బుధవారం డీఈఓ ప్రసాద్‌బాబును ఆయన చాంబర్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామాంజినేయులు మాట్లా డుతూ... మున్సిపల్‌, నగర పాలక ఉపాధ్యాయుల పదోన్నతులు షెడ్యూల్‌ మేరకు చేపట్టాలన్నారు.

STU leaders giving petition to DEO

అనంతపురం విద్య, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : విద్యాశాఖ ఇచ్చిన షెడ్యూల్‌ మేరకు మున్సిపల్‌ టీచర్ల పదోన్నతులు చేపట్టాలని ఎస్టీయూ నా యకులు డిమాండ్‌ చేశారు. ఆ సంఘం నాయకులు బుధవారం డీఈఓ ప్రసాద్‌బాబును ఆయన చాంబర్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామాంజినేయులు మాట్లా డుతూ... మున్సిపల్‌, నగర పాలక ఉపాధ్యాయుల పదోన్నతులు షెడ్యూల్‌ మేరకు చేపట్టాలన్నారు. ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని కోరారు. మొత్తం ఉపాధ్యాయ ఖాళీలను ప్రమోషన్ల ద్వారానే భర్తీ చేయాలని డిమాం డ్‌ చేశారు. గతంలో మున్సిపల్‌ రీజనల్‌ డైరెక్టర్‌ అధికారులు నిర్వహించిన పదోన్నతుల్లో ఎక్కడ రోస్టర్‌ ఆగిందో అక్కడి నుంచే రికార్డులను పరిశీలించి కొనసాగించాలని కోరారు. డీఈఓకు వినతిపత్రం అందించారు. సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి సూర్యుడు, కార్యదర్శి చంద్రశేఖర్‌, ఇతర నేతలు ప్రభాకర్‌, అజయ్‌కుమార్‌, వన్నూరప్ప, మల్లికార్జున, యుగంధర్‌, మురళీ కృష్ణ, విరూపాక్షి, రామకృష్ణ, నౌషద్‌, ఖలిముల్లాఖాన తదితరులు పాల్గొన్నారు.


రెసిడెన్షియల్‌ ట్రైనింగ్స్‌ రద్దు చేయాలి : ఏపీటీఎఫ్‌

అనంతపురం విద్య, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో నిర్వహిస్తున్న లీడర్‌షిప్‌, ఎఫ్‌ఎల్‌ఎన శిక్షనా కార్యక్రమాలను వెంటనే రద్దు చేయాలని ఏపీటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆ సంఘం నాయకులు బుధవా రం డీఈఓ ప్రసాద్‌బాబును ఆయన చాంబర్‌లో కలిశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌, ప్రధానకార్యదర్శి సిరాజుద్దీన ఇతర నేతలు మాట్లాడు తూ...రెసిడెన్షియల్‌ శిక్షణను వెంటనే ఆపాలన్నారు. ఓ ప్రధానోపాధ్యాయుడు పశ్చిమగోదావరి జిల్లాలో ఒత్తిడికి తట్టుకోలేక...గుండెపోటుతో మరణించాడ న్నారు. ఇది చాలా బాధాకరమని, దీన్ని ఏపీటీఎఫ్‌ ఖండిస్తోందన్నారు. టీచర్లకు ఆరు రోజులు రెసిడెన్షియల్‌ ట్రైనింగ్‌ ఇవ్వడం వల్ల అనేక ఇబ్బం దులు పడుతున్నారన్నారు. వీటిని ఆపాలని కోరారు. ఈ మేరకు డీఈఓను వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు సతీష్‌కుమార్‌, సరాఽ్ధర్‌వలి, వెంకటరమణ, కలీముల్లా, హనుమంతు, సోహెల్‌, ఇమ్దాద్‌, ఉల్లా బాబ్జాన, మన్సూర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 07 , 2024 | 12:10 AM