ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

JC Prabhakar Reddy : నేను దొంగనని నిరూపించండి..!

ABN, Publish Date - Jun 20 , 2024 | 12:31 AM

‘వైసీపీ ప్రభుత్వంలో మా కుటుంబాన్ని వేధించారు. దొంగ బస్సులు తెచ్చామని కేసులు పెట్టారు. అధికారులకు పది రోజులు గడువు ఇస్తున్నా. నేను దొంగనని నిరూపించాలి. లేదంటే ఎస్పీ ఆఫీస్‌ వద్ద నా కొడుకు, కోడలు.. డీటీసీ ఆఫీస్‌ వద్ద నేను, నా భార్య కూర్చుంటాం’ అని మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి హెచ్చరించారు. అనంతపురంలోని తన నివాసంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. వైసీపీ పాలనలో తన కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి ....

JC Prabhakar Reddy at the press conference

పది రోజులు టైం ఇస్తున్నా.. వదిలేది లేదు

ఎస్పీ, డీటీసీ ఆఫీస్‌ ఎదుట కూర్చుంటాం

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి వార్నింగ్‌

అనంతపురం, జూన 19(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ ప్రభుత్వంలో మా కుటుంబాన్ని వేధించారు. దొంగ బస్సులు తెచ్చామని కేసులు పెట్టారు. అధికారులకు పది రోజులు గడువు ఇస్తున్నా. నేను దొంగనని నిరూపించాలి. లేదంటే ఎస్పీ ఆఫీస్‌ వద్ద నా కొడుకు, కోడలు.. డీటీసీ ఆఫీస్‌ వద్ద నేను, నా భార్య కూర్చుంటాం’ అని మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి హెచ్చరించారు. అనంతపురంలోని తన నివాసంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. వైసీపీ పాలనలో తన కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి వివరిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పేర్నినానిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘వైౖసీపీ


ప్రభుత్వంలో నా కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగింది. మమ్మల్ని దొంగోళ్లను చేశారు. నాతోపాటు నా భార్య, కొడుకు, కోడళ్లపై కేసులు పెట్టారు. నన్ను, నా కొడుకును జైలుకు పంపించారు. మేము కొనుగోలు చేసిన వాహనాలకు చెక్కుల రూపంలో డబ్బులు చెల్లించాము. జీఎస్టీ కట్టాము. అయినా మాపై అక్రమ కేసులు పెట్టారు..’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పెద్ద ఒత్తిడితో అర్ధరాత్రి దొంగలను పట్టుకుపోయినట్లు తనను, తన కుమారుడిని అరెస్టు చేశారని, వారి పేర్లను ఆ రోజే రాసుకున్నానని అన్నారు. జరిమానాతో వదిలేయాల్సిన చోట కక్షపూరితంగా వ్యవహరించారని, అప్పటి ఐపీఎస్‌ అధికారి సీతారామాంజినేయులు, అప్పటి మంత్రి పేర్ని నాని, రాష్ట్ర ట్రాన్సపోర్టు అధికారి ప్రసాద్‌ రావు, అనంతపురం డీటీసీ శివరాంప్రసాద్‌ దీనికి కారణమని అన్నారు. తన బస్సులను సీజ్‌ చేసి ఆర్టీఏ ఇనస్పెక్టర్లను వదిలే ప్రసక్తే లేదని అన్నారు. సీజ్‌ చేసిన బస్సులన్నీ తుప్పుపట్టాయని, మరో మూడు బస్సులను వైసీపీ శ్రేణులు తగులబెట్టాయని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రోద్బలంతోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. పోలింగ్‌ తర్వాత తాడిపత్రిలో జరిగిన ఘటనలో టీడీపీ కార్యకర్తలపై రౌడీ షీట్‌ ఎలా ఓపెన చేస్తారని ఎస్పీని ప్రశ్నించారు. తుప్పుపట్టిన తన బస్సులను రిపేర్‌ చేయించాలని సీజ్‌ చేసిన అధికారులను హెచ్చరించారు. 2019 నుంచి తన నియోజకవర్గంలో ఏమేం జరిగాయో అన్నింటికీ జవాబు చెబుతానని అన్నారు. తాను మున్సిపల్‌ చైర్మనగా ఉన్నా.. మున్సిపల్‌ ఆఫీ్‌సలోనే తాను భోజనం చేసేలా.. స్నానం చేసేలా.. బాత రూంకు వెళ్లేలా చేసింది మర్చిపోలేదని అన్నారు. అప్పుడు పనిచేసిన కమిషనర్లను ఏ ఒక్కరినీ వదిలేది లేదని అన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 20 , 2024 | 12:31 AM

Advertising
Advertising