ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MANDALA MEET : ‘రీసర్వేలో భూములు మాయం’

ABN, Publish Date - Sep 20 , 2024 | 12:21 AM

గత వైసీపీ ప్రభుత్వం మండల వ్యాప్తంగా రీసర్వే చేపట్టిన తరువాత పలువురు రైతుల భూములు మా యం కావడంతో వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతు న్నారని ఎంపీటీసీ రఘునాథరెడ్డి రెవెన్యూ అఽధికారులను నిలదీశారు. స్థానిక మండల పరిషత కార్యాలయంలో గురువారం ఎంపీపీ యోగేశ్వరి అధ్యక్షతన ఎంపీడీఓ నిర్మ లకుమారి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

Public representatives who attended the meeting

శింగనమల, సెప్టెంబరు 19: గత వైసీపీ ప్రభుత్వం మండల వ్యాప్తంగా రీసర్వే చేపట్టిన తరువాత పలువురు రైతుల భూములు మా యం కావడంతో వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతు న్నారని ఎంపీటీసీ రఘునాథరెడ్డి రెవెన్యూ అఽధికారులను నిలదీశారు. స్థానిక మండల పరిషత కార్యాలయంలో గురువారం ఎంపీపీ యోగేశ్వరి అధ్యక్షతన ఎంపీడీఓ నిర్మ లకుమారి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అయితే కోరం కోసం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావలసిన సమావేశం 11.30కు ప్రారంభమైంది. అప్పటికీ... మండలంలో 13 మంది ఎంపీటీసీ సభ్యులు, 19 మంది సర్పంచలు, జడ్పీటీసీ ఉండగా కేవలం 10 మంది మాత్రమే హజరయ్యారు. అన్నిశాఖల అధికారులు హాజయ్యారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు మూడు నెలలకు ఒక సారి జరిగే సర్వ సభ్య సమావేశానికి ప్రజాప్రతినిధులు రాకపోకపోవడం ఏమిటనిని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా పలువురు సభ్యుల బదులు వారి బంధువులు సమావేశానికి వచ్చారు. నాయనవారిపల్లి సర్పంచ రమణమ్మ బదులు ఆమె తమ్ముడు రంగస్వామి సమావేశంలో కూర్చున్నా రు. అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నిర్మలాకూమారి, డిప్యూటీ తహసీల్దార్‌ రామకృష్ణ , సీడీపీఓ ఉమాశం కరమ్మ, ఎంఈఓ నరసింహ రాజు, ఏఓ అన్వేష్‌కూమార్‌, ఇతర శాఖల అధి కారులు, వైస్‌ ఎంపీపీలు విజయ, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 20 , 2024 | 12:21 AM