GRIEVANCE : కలెక్టరేట్‌కే బాధితుల క్యూ
ABN, Publish Date - Oct 08 , 2024 | 12:23 AM
సమస్యలను పరిష్కరించాలని బా ధతులు కలెక్టరేట్‌కే క్యూకట్టారు. గతవారం జిల్లాకేంద్రంలోని డీఆర్‌డీఏ కార్యా లయంలో అనంత రెవెన్యూ డివిజన గ్రీవెన్స మొదలు పెట్టి, కలెక్టరుతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. దీంతో గత సోమ వారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి గ్రీవెన్సకు కేవలం112అర్జీలు మా త్రమే వచ్చాయి.డివిజన స్థాయి గ్రీవెన్సకు 290వరకు వచ్చాయి.
జిల్లాస్థాయి ప్రజావేదికకు 422 అర్జీలు
అనంతపురం టౌన, అక్టోబరు7: సమస్యలను పరిష్కరించాలని బా ధతులు కలెక్టరేట్‌కే క్యూకట్టారు. గతవారం జిల్లాకేంద్రంలోని డీఆర్‌డీఏ కార్యా లయంలో అనంత రెవెన్యూ డివిజన గ్రీవెన్స మొదలు పెట్టి, కలెక్టరుతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. దీంతో గత సోమ వారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి గ్రీవెన్సకు కేవలం112అర్జీలు మా త్రమే వచ్చాయి.డివిజన స్థాయి గ్రీవెన్సకు 290వరకు వచ్చాయి. అయితే ఈ సోమవారం జిల్లా స్థాయి గ్రీవెన్సకు కలెక్టరు వినోద్‌కుమార్ హాజరు కావ డంతో జిల్లా వ్యాప్తంగా బాధితులు పెద్దఎత్తున తరలివచ్చారు. మొత్తం 422 అర్జీలను కలెక్టరుతో పాటు ఇనచార్జ్ డీఆర్‌ఓ రమేష్‌రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ తదితరులు తీసుకున్నారు. అదే ఆర్డీఓ స్థాయి లో జరిగిన గ్రీవెన్సకు జేసీ శివనారాయణశర్మ హాజరై అర్జీలు స్వీకరించారు. ఇక్కడ కేవలం 40 అర్జీలు వచ్చాయి.
సకాలంలో పరిష్కరించాలి: కలెక్టరు
ప్రజా సమస్యల ఫిర్యాదుల వేదికలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు సకాలంలో పరిష్కరించాలని కలెక్టరు వినోద్‌కుమార్ ఆదేశించా రు. గ్రీవెన్స అనంతరం కలెక్టరు వినోద్‌కుమార్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టరు మాట్లాడుతూ... జిల్లాలో అసైన్డ, ప్రీహోల్డ్ భూముల పరిశీలనను పూర్తిచేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా 34వేల ఎకరాలకు సంబంధించి వెరిఫికేషన పూర్తి చేశారని మిగిలిన భూ ముల పరిశీలన త్వరగా పూర్తిచేయాలన్నారు. ఒక్క కళ్యాణదుర్గం డివిజన లోనే 9,338ఎకరాలు పెండింగ్‌లో ఉందన్నారు. ప్రజలకు అవసరమైన ముఖ్య మైన సేవలకు సంబందించిన బోర్డులను తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాల యాల వద్ద ఏర్పాటుచేయాలన్నారు. ప్రభుత్వ పథకాల పంపిణీ, అబివృద్ధి పనులు వేగంగా జరిగేలా చూడాలని కలెక్టరు ఆదేశించారు. వెల్పేర్ అసిస్టెం ట్లు ప్రతి సోమ, గురువారాల్లో పాఠశాలలు విజిట్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీపీఓ నాగరాజు నాయుడు, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, డీఎం హెచఓ డాక్టర్ ఈబీ దేవి, సీపీఓ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Oct 08 , 2024 | 12:23 AM