ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sub-Registrar Office : సీటుకో రేటు

ABN, Publish Date - Sep 21 , 2024 | 12:43 AM

స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖలో అక్రమాదాయానికి కొదవ ఉండదనేది బహిరంగ రహస్యమే. అలాంటి శాఖలో బదిలీలు అంటే మామూలు విషయం కాదు. కొన్ని సీట్లు భారీగా విలువ పలుకుతున్నట్లు ఆ శాఖలో చర్చ సాగుతోంది. ఎంతైనా ఇచ్చుకునేందుకు పలువురు అధికారులు కూడా సిద్ధమైనట్లు సమాచారం. ఆ శాఖలో ప్రస్తుతం బదిలీల గోల సాగుతోంది. ముందు క్యాష్‌ కొట్టు... పోస్టు పట్టు అనే నినాదం వినిపిస్తోంది. ఆ శాఖలో సబ్‌రిజిస్ర్టార్లదే హవా. ఆ తరువాత ఇనచార్జిగా పనిచేసే...

Anantapur Rural Sub-Registrar Office

రిజిస్ర్టేషన్ల శాఖలో బదిలీల హీట్‌

ఆఫీసును బట్టి సబ్‌ రిజిస్ర్టార్‌ సీట్లకు డిమాండ్‌

చక్రం తిప్పుతున్న అసోసియేషన నాయకులు

రామ్‌నగర్‌ అంతా నేనే ఉంటా

జాయింట్‌-2 రానివ్వకుండా ఓ సబ్‌రిజిస్ర్టార్‌ పట్టు

అనంతపురం రూరల్‌కు రూ.40లక్షల పైమాటే..

అనంతపురం క్రైం, సెప్టెంబరు 20: స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖలో అక్రమాదాయానికి కొదవ ఉండదనేది బహిరంగ రహస్యమే. అలాంటి శాఖలో బదిలీలు అంటే మామూలు విషయం కాదు. కొన్ని సీట్లు భారీగా విలువ పలుకుతున్నట్లు ఆ శాఖలో చర్చ సాగుతోంది. ఎంతైనా ఇచ్చుకునేందుకు పలువురు అధికారులు కూడా సిద్ధమైనట్లు సమాచారం. ఆ శాఖలో ప్రస్తుతం బదిలీల గోల సాగుతోంది. ముందు క్యాష్‌ కొట్టు... పోస్టు పట్టు అనే నినాదం వినిపిస్తోంది. ఆ శాఖలో సబ్‌రిజిస్ర్టార్లదే హవా. ఆ తరువాత ఇనచార్జిగా పనిచేసే సీనియర్‌ అసిస్టెంట్ల వ్యవహారం కూడా బాగానే ఉంటుంది. ఆదాయం వచ్చే సీట్లపైనే సబ్‌ రిజిస్ర్టార్లు, సీనియర్‌ అసిస్టెంట్లు ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు. గతేడాదిలాగే ఈసారి కూడా బదిలీల్లో అసోసియేషన నాయకులే ముందుండి


నడిపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా అసోసియేషనలో కీలకంగా ఉంటూ జిల్లాలో సబ్‌రిజిస్ర్టార్‌గా పనిచేసే ఓ అధికారి చక్రం తిప్పుతున్నారని సమాచారం. గతేడాది బుక్కపట్నంలో ఏసీబీకి దొరికిన సబ్‌రిజిస్ర్టార్‌, ఈయనా కలిసి బదిలీల వ్యవహారం నడిపారు. ఉన్నతాధికారులకు ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి వీరే అంతా వసూలు చేస్తారని సమాచారం.

ఆ సీట్లకు ఫుల్‌ డిమాండ్‌...

రిజిస్ర్టేషన్ల శాఖలో బాగా ఆదాయమున్న సబ్‌రిజిస్ర్టార్‌ ఆఫీసులకు ఎప్పుడూ డిమాండే. అందులో ముందువరుసలో ఉండేది అనంతపురంలోని రామ్‌నగర్‌, రూరల్‌ ప్రధాన కార్యాలయాలు. పామిడి, గుంతకల్లు, శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో ధర్మవరం, పెనుకొండ, చిలమత్తూరు పేర్లు వినిపిస్తున్నాయి. ఇక తాడిపత్రి, కళ్యాణదుర్గం కార్యాలయాలకు వెళ్లడానికి సబ్‌రిజిస్ర్టార్లు ఆసక్తి చూపట్లేదని సమాచారం. కొంతకాలంగా సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ఇనచార్జిలుగా సీనియర్‌ అసిస్టెంట్లే వ్యవహరిస్తున్నారు. వారిలో కొందరు వివాదాస్పద, 08 తదితర భూములకు రిజిస్ర్టేషన్లు చేస్తుండటంతో సబ్‌రిజిస్ర్టార్లకు సైతం బలం వచ్చిందట. వారే చేస్తుంటే తాము చేయలేమా అంటూ ఎక్కడికైనా వచ్చి చేస్తామంటూ చెబుతున్నారట. ఆదాయం ఎక్కువగా ఉన్న కార్యాలయాలపైనే దృష్టి సారిస్తున్నారని సమాచారం.

రామ్‌నగర్‌ అంతా నేనే ఉంటా...

అనంతపురం నగరంలోని రామ్‌నగర్‌ ఆర్‌ఓ కార్యాలయం కీలకం. ఇక్కడ జాయింట్‌ సబ్‌ రిజిస్ర్టార్‌-1, జాయుంట్‌ సబ్‌ రిజిస్ర్టార్‌-2 పోస్టులున్నాయి. 8 నెలల ముందు ఇక్కడున్న జాయింట్‌-1 సబ్‌ రిజిసా్ట్రర్‌ సత్యనారాయణ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. అప్పటి నుంచి కొన్నిసార్లు ఇద్దరు, ఒక్కోసారి ఒక్కరే పనిచేస్తూ వస్తున్నారు. ఈనేపథ్యంలో రామ్‌నగర్‌ ఆఫీసుకు రావడానికి పలువురు సబ్‌రిజిస్ర్టార్లు ఆసక్తి చూపుతున్నారని తెలిసింది. దీంతో పోటీ పెరిగింది. అనంతపురం నగరానికి పాతిక కిలోమీటర్ల లోపు ఉన్న సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ సబ్‌రిజిస్ర్టార్‌ విపరీతంగా ప్రయత్నిస్తున్నారట. జాయింట్‌-1లో తాను కూర్చుంటాననీ, జాయింట్‌-2 ఎవరికీ ఇవ్వకుండా చూడాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో ఇప్పటికే ఆ సీటు కోసం ప్రయత్నిస్తున్న అధికారికి కుదరదని చెప్పడంతో మరోసీటు కోసం ప్రయత్నిస్తున్నారట. జాయింట్‌-1 సీటు కోసం ప్రయత్నిస్తున్న ఈ అధికారి నాలుగు నెలల క్రితం అనంతపురం రూరల్‌కు వచ్చారు. బేరాలు సరిగా కుదర్లేదే.. ఏమోగానీ మళ్లీ అదే సీటుకే వెళ్లిపోయారు. ఈసారి డబ్బునోట్లతో సంచులు నింపాలనే ఆలోచనలో ఆ అధికారి ఉన్నట్లు సమాచారం. ఈ సార్‌కు అసోసియేషన నాయకుడి అండ ఉండటంతో సీటు కన్ఫర్మ్‌ అయినట్లు సమాచారం. అనంతపురం రూరల్‌కు గత బదిలీల్లో ఓ అధికారి ఏకంగా రూ.35 లక్షలు ఇచ్చి మరీ ఆ సీటు తెచ్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాగానే ఆర్జించారన్న చర్చలు కూడా లేకపోలేదు. ఆయన మేనల్లుడు నగదుతో పట్టుబడి, ఈయన పేరు చెప్పడంతో అడ్రస్‌ గల్లంతైంది. ఖాళీ అయిన ఆ సీటు కోసం రూ.40లక్షలకుపైగా డిమాండ్‌ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. కొన్ని సీట్లు రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు పలుకుతున్నాయట.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 21 , 2024 | 12:43 AM