JC : భూసమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
ABN, Publish Date - Dec 11 , 2024 | 12:23 AM
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులందరు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ శివనారాయణ్‌శర్మ తెలిపారు. మండల పరిధి లోని కేశవాపురంలో మంగళవారం నిర్వహించిన రెవె న్యూ సదస్సులో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు.
జేసీ శివనారాయణ్ శర్మ
గార్లదిన్నె, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులందరు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ శివనారాయణ్‌శర్మ తెలిపారు. మండల పరిధి లోని కేశవాపురంలో మంగళవారం నిర్వహించిన రెవె న్యూ సదస్సులో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఏళ్ల తరబడి భూ సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని, ముఖ్యంగా రీసర్వేతో మరింత ఇబ్బందులు పడుతున్నారు. భూసమస్యలను సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించిందన్నారు. అనంతరం భూ స మస్యలపై పలు ఆర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ బండా రు ఈరమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచు రామాంజినే యులు, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్ నాయక్, తహసీల్దార్ బండారు ఈరమ్మ, ఎంపీడీఓ యోగానందరెడ్డి, రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ దివా కర్‌రెడ్డి, ఎండోమెంట్ ఈఓ బాబు, మాజీ సర్పంచు శ్రీరాములు, అంజినేయులు, కిష్టయ్య పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Dec 11 , 2024 | 12:23 AM