ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

GAUTAMI SHALI : భద్రతలపరిరక్షణే లక్ష్యం

ABN, Publish Date - May 19 , 2024 | 11:31 PM

జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే తన లక్ష్యమని జిల్లా నూతన ఎస్పీ గౌతమి శాలి స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీగా ఆమె తన చాంబర్‌లో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు జిల్ల్లా ఎస్పీగా ఉన్న అమితబర్దర్‌పై ఎన్నికల సంఘం సస్పెన్షన వేటు వేసి, విశాఖపట్నం ఏపీఎస్పీ 16వ బెటాలియన కమాండెంట్‌గా ఉన్న గౌతమి శాలిని జిల్లా ఎస్పీగా నియమించడం తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్‌ కాన్ఫరెన్స హాల్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి కార్యాచరణ ప్రణాళికలతో ముందుకెళ్తామన్నారు. అన్ని వర్గాల ...

Gautami Shali is the new SP of the district

కౌంటింగ్‌ ప్రశాంతంగా ముగిసేలా చర్యలు

నూతన ఎస్పీ గౌతమి శాలి

అనంతపురం క్రైం, మే 19: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే తన లక్ష్యమని జిల్లా నూతన ఎస్పీ గౌతమి శాలి స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీగా ఆమె తన చాంబర్‌లో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు జిల్ల్లా ఎస్పీగా ఉన్న అమితబర్దర్‌పై ఎన్నికల సంఘం సస్పెన్షన వేటు వేసి, విశాఖపట్నం ఏపీఎస్పీ 16వ బెటాలియన కమాండెంట్‌గా ఉన్న గౌతమి శాలిని జిల్లా ఎస్పీగా నియమించడం తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్‌ కాన్ఫరెన్స హాల్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి కార్యాచరణ ప్రణాళికలతో ముందుకెళ్తామన్నారు. అన్ని వర్గాల ప్రజల సహకారం తీసుకుంటామన్నారు. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో మాట్లాడి మెరుగైన పోలీసింగ్‌కు కృషి చేస్తామన్నారు. సెన్సిటివ్‌ గ్రామాలు,


బైండోవర్లు ఏదైనా సరే చట్టపరంగా ముందుకెళ్తామన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు స్ర్టాంగ్‌ రూంల వద్ద పటిష్టంగా మూడంచెల భద్రత కొనసాగుతోందన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియ సందర్భంగా ఎలాంటి హింస, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

మూడంచెల భద్రతను మరింత బలోపేతం చేయండి

జేఎనటీయూ స్ర్టాంగ్‌ రూంల భద్రతను జిల్లా ఎస్పీ గౌతమి శాలి పరిశీలించారు. కేరళ సాయుధ స్పెషల్‌ పోలీసులు, ఏఆర్‌ సాయుధ పోలీసులు మూడంచెల భద్రత నిర్వహిస్తుండటాన్ని సమీక్షించి మరింత బలోపేతం చేయా లని ఆదేశించారు. పార్కింగ్‌ స్థలాన్ని స్ర్టాంగ్‌ రూంలకు దూరంగా ఏర్పాటు చేయాలని, అన్ని గేట్లలోను సిబ్బందిని బందోబస్తుకు నియమించాలని సూచించారు. కౌంటింగ్‌ రోజున తీసుకోవాల్సిన బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలు, హింసకు తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు ఎస్పీలు విజయభాస్కర్‌రెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, అనంతపురం డీఎస్పీ టీవీవీ ప్రతాప్‌, ఏఆర్‌ డీఎస్పీ మునిరాజ, సీఐలు జాకీర్‌ హుస్సేన, ఇందిర, రెడ్డప్ప, ప్రతా్‌పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 19 , 2024 | 11:31 PM

Advertising
Advertising