HINDUPUR : నాలుగు నెలలుగా అందని జీతాలు
ABN, Publish Date - Sep 06 , 2024 | 12:10 AM
పురంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే పారిశుధ్య కార్మికులు నాలుగు నెలలుగా జీతాలు అందకపోవ డంతో తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. పనులు చేసి పస్తులుం డాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిందూపురం ప్రభు త్వాసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 26 మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు. వారు గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో పనులు బహష్కరించి ని రసన తెలిపారు.
విధులను బహష్కరించి పారిశుధ్య కార్మికుల నిరసన
హిందూపురం అర్బన, సెప్టెంబరు 5: పురంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే పారిశుధ్య కార్మికులు నాలుగు నెలలుగా జీతాలు అందకపోవ డంతో తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. పనులు చేసి పస్తులుం డాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిందూపురం ప్రభు త్వాసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 26 మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు. వారు గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో పనులు బహష్కరించి ని రసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నాలుగు నెలలుగా ఏజెన్సీ వారు జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబపోషణ భారంగా మారింద ని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల యూనిఫారం కుట్టుకూలీ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నామన్నారు.
పండగపూట కూడా పస్తులు ఇండాల్సి వస్తుందే మో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు కడుపునిండా భోజనం కూ డా పెట్టలేకపోతే ఎందుకు పనులు చేయాలని నిలదీస్తున్నారు. దీంతో రోజు వేయి మంది దాకా ఓపి ఉండే ప్రభుత్వ ఆసుపత్రి పారిశుధ్యం ఆస్తవ్యస్తంగా మారింది. టాయిలెట్లు, బాతరూంలు దుర్గందభరితమయ్యాయి. చెత్తాచెదా రం ఎక్కడిదక్కడ పేరుకుపోయింది. నాలుగు నెలల జీతాలు ఇస్తేనే కానీ విధుల్లోకి వెళ్లమని వారు ఖరాకండిగా చెబుతున్నారు. ఏజెన్సీ వారు ఈ రోజు, రేపు అని కాలం గడుపుతున్నారని దీంతో విసుగు చెంది పనులు నిలిపివేసి నిరసన చేస్తున్నట్లు పారిశుధ్య కార్మికులు అంటున్నారు.
నేడు జీతాలు ఇస్తామన్నారు- రోహిల్, ఆసుపత్రి సూపరింటెండెంట్
ఏజన్సీ వారితో మాట్లాడాము. పారిశుధ్య కార్మికులకు శుక్రవారం ఉదయానికల్లా జీతాలు వేస్తామని తెలిపారు. రోగులకు ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Sep 06 , 2024 | 12:10 AM