POLICE : తాడిపత్రిలో సోదాలు
ABN, Publish Date - May 25 , 2024 | 12:36 AM
పట్టణంలోని నందలపాడులో డీఎస్పీ జనార్దననాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం కార్డెన సెర్చ్ నిర్వహించారు. రౌడీషీటర్లు, ట్రబుల్‌మాంగర్స్, పాతకేసుల్లో నిందితుల ఇళ్లు, పరిసరాలు, గడ్డివాముల్లో తనిఖీలు చేశారు. నందలపాడుప్రధాన వీధుల్లో పోలీసు బలగాలు కవాతు నిర్వహించాయి. కౌంటింగ్ రోజు, ఆ తరువాత గొడవలు, అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్థానికులను డీఎస్పీ హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో జీవించాలని సూచించారు. పట్టణంలో 144 సెక్షన ...
తాడిపత్రి టౌన, మే 24: పట్టణంలోని నందలపాడులో డీఎస్పీ జనార్దననాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం కార్డెన సెర్చ్ నిర్వహించారు. రౌడీషీటర్లు, ట్రబుల్‌మాంగర్స్, పాతకేసుల్లో నిందితుల ఇళ్లు, పరిసరాలు, గడ్డివాముల్లో తనిఖీలు చేశారు. నందలపాడుప్రధాన వీధుల్లో పోలీసు బలగాలు కవాతు నిర్వహించాయి. కౌంటింగ్ రోజు, ఆ తరువాత గొడవలు, అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్థానికులను డీఎస్పీ హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో జీవించాలని సూచించారు. పట్టణంలో 144 సెక్షన అమలులో ఉందని, ఐదుగురి కంటే ఎక్కువమంది గుమికూడవద్దని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
కార్యక్రమంలో సీఐ నాగేంద్రప్రసాద్, ర్యాపిడ్ యాక్షన ఫోర్స్, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.
మీరుండి ఏం ప్రయోజనం..? వెళ్లిపోండి..!
ఎస్‌ఓజీ టీంపై ఉన్నతాధికారుల అసంతృప్తి
అనంతపురం క్రైం, మే 24: ‘అన్నింటా విఫలమయ్యారు. మీరు చేసిన తప్పులకు ఎస్పీనే బలయ్యారు. మీరు ఉండి ఏం ప్రయోజనం..? ఎవరి విధుల్లోకి వారు వెళ్లండి’ అని స్పెషల్ ఆర్గనైజేషన గ్రూప్‌కు (ఎస్‌ఓజీ) జిల్లా పోలీసు శాఖ ఆదేశాలిచ్చింది. రహస్య విచారణ, ఎక్కడ ఏం జరుగుతోందనే సమాచార సేకరణ కోసం ఎస్‌ఓజీని ఏర్పాటు చేశారు. ఈ బృందంలోని సభ్యులు జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా పోలీసు శాఖ ఉన్నతాధికారులకు సమాచారం చేరవేస్తారు. తాడిపత్రి అల్లర్లు ఏకంగా ఎస్‌ఓజీని రద్దు చేసేదాకా వెళ్లాయి. తాడిపత్రి అల్లర్ల కారణంగా ఇప్పటికే ఎస్పీ అమిత బర్దర్, డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణ, ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ ఈశ్వర్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. స్పెషల్ బ్రాంచతోపాటు ఎస్‌ఓజీ వైఫల్యమే దీనికి
కారణమని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు భావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎస్‌ఓజీ బృందాన్ని పిలిపించి మాట్లాడారట. ‘మీరు చేసిన తప్పిదాలకు ఎవరెవరో బలి కావాల్సి వచ్చింది. సమాచారం అందించడంలో ఫెయిలయ్యారు’ అని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘ఇకపై మీరందరూ గతంలో ఏయే విధులు నిర్వర్తించారో.. ఆ విధులకు వెళ్లండి’ అని స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఎస్‌ఓజీ బృందంలో ఎక్కువగా ఏఆర్ సిబ్బందే ఉంటారు.
భోజనాలకు రూ.10 లక్షలు
తాడిపత్రి టౌన, మే 24: ఎన్నికల గొడవల కారణంగా తాడిపత్రి బందోబస్తుకు వచ్చిన పోలీసు బలగాల భోజనం కోసం అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి, ఎస్పీ గౌతమిశాలి రూ.10 లక్షలు ఇచ్చారని తెలిసింది. ఆంధ్రజ్యోతిలో వచ్చిన ‘పాపం పోలీసులు’ శీర్షికన రెండు రోజుల క్రితం ప్రచురితమైన కథనానికి వారు స్పందించినట్లు తెలిసింది. దీంతో పోలీసులకు ఆకలి బాధలు తగ్గుతాయని భావిస్తున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 25 , 2024 | 12:36 AM