ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rain Effect : రాశిలోనే మొలకలు

ABN, Publish Date - Dec 07 , 2024 | 12:30 AM

కోత కోసిన వరి వర్షానికి తడిసి ఎందుకూపనికి రాకుండాపోతోంది. తుఫాను ప్రభావాన్ని అంచనా వేయలేక కొందరు రైతులు వరి పంటను కోసి.. కుప్పలుగా వేశారు. మరికొందరు యంత్రాలతో నూర్పిడి చేయించి.. ధాన్యాన్ని ఆరబోశారు. వారం రోజుల నుంచి వర్షం కురుస్తుండటంతో రాశిగా పోసిన వరి ధాన్యానికి మొలకలు వస్తున్నాయి. దీంతో కొరివిపల్లి, జూలాకాల్వ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ రెండు గ్రామాల పరిధిలో సుమారు 500 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. ఐదు ...

Sprouting grain in Rashi

పాడైపోతున్న వరి ధాన్యం

వర్షాలకు తడిసి.. తీవ్రనష్టం

శింగనమల, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): కోత కోసిన వరి వర్షానికి తడిసి ఎందుకూపనికి రాకుండాపోతోంది. తుఫాను ప్రభావాన్ని అంచనా వేయలేక కొందరు రైతులు వరి పంటను కోసి.. కుప్పలుగా వేశారు. మరికొందరు యంత్రాలతో నూర్పిడి చేయించి.. ధాన్యాన్ని ఆరబోశారు. వారం రోజుల నుంచి వర్షం కురుస్తుండటంతో రాశిగా పోసిన వరి ధాన్యానికి మొలకలు వస్తున్నాయి. దీంతో కొరివిపల్లి, జూలాకాల్వ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ రెండు గ్రామాల పరిధిలో సుమారు 500 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. ఐదు


నెలాలు పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఎరువులు, పురుగు మందులకు రూ.లక్షలు వెచ్చించారు. తీరా దిగుబడి చేతికి వచ్చే సమయంలో తుఫాను దెబ్బకొట్టింది. వర్షం కురుస్తుండటంతో ఆరబోసిన ధాన్యాన్ని కుప్పలుగా చేశారు. రాశులకు టార్పాలిన కప్పారు. అయినా, మొలకలు వస్తుండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదని రైతులు వాపోతున్నారు. అధికారులు స్పందించి, ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

పొలంలోనే మొలకలు..

నేను ఐదు ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. వర్షాలు రావడంతో పంట కోత పది రోజులు ఆలస్యమైంది. దీంతో పొలంలోనే మొలకలు వస్తున్నాయి. దీంతో వర్షంలోనే కోత కోసి ధాన్యాన్ని రాశిగా పోశాము. పట్టలు కప్పి ఐదు రోజులు అవుతోంది. ఎండ కాయడం లేదు.. మబ్బులు వీడటం లేదు. శుక్రవారం కొద్దిగా ఎండకాయడంతో రాశులలో పంటను ఆరబోయాలని చూశాం. అప్పటికే ధాన్యం మొలకెత్తింది. ప్రాణం పోయేంత పని అయింది. పంట కోసం రూ.2.50 లక్షలు ఖర్చు చేశాను. కొనే నాథుడే లేడు. ఏం చేయాలో తోచడం లేదు. -ప్రభాకర్‌

కటింగ్‌ బియ్యమే..

నాలుగు ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. పంట కోశాక పూర్తి స్థాయిలో తడిసిపోయింది. కోనుగోలు చేయడానికి ఎవరు రాలేదు. బియ్యం అడించి అమ్ముకుందామన్నా విలువ లేకుండా పోయింది. తడిసిన వరి ధాన్యాన్ని ఆడిస్తే సగానికి పైగా కటింగ్‌ బియ్యం వస్తాయి. పెట్టబడి కూడా తిరిగి రాదు.

- కుళ్లాయప్ప

ప్రభుత్వమే కొనాలి..

మూడు ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. ఎకరానికి రూ.40 వేలకుపైగా పెట్టుబడి పెటాను. దిగుబడి బాగానే వచ్చింది. పంట పూర్తిగా తడసిపోవడంతో కొనడానికి ఒక్క వ్యాపారీ రాలేదు. ప్రభుత్వమే కొనుగోలు చేసి మమ్మల్ని ఆదుకోవాలి.

-నాగభూషణ

గిట్టుబాటు ధర ఇవ్వాలి..

వర్షంలో తడిసి పోయిన వరి ధాన్యాన్ని కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడంలేదు. అధికారులు స్పందించి ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలి. వరి ధాన్యాన్నిఇ గిట్టుబాటు ధర కల్పించి.. సేకరించాలి.

- చిన్నప్ప యాదవ్‌, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు

అనుమతి వస్తే కొంటాం..

వరి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. ఉన్నతాధికారులు ఆదేశిస్తే ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం.

- అన్వేష్‌ కూమార్‌, ఏఓ


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 07 , 2024 | 12:30 AM