ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Farmer :మురిపించి.. ముంచిన మిరప

ABN, Publish Date - Aug 28 , 2024 | 12:19 AM

ధర బానే ఉంది. దిగుబడి కూడా బాగా వచ్చింది. పెట్టుబడులు పోగా వచ్చిన సొమ్ముతో అప్పులు, ఇంటి అవసరాలు తీర్చుకోవచ్చని ఆశించిన పచ్చిమిరప రైతులకు నిరాశే ఎదురవుతోంది. వారం కిందటి వరకు ఉన్న ధర ప్రస్తుతం భారీగా పడిపోవడంతో మరిన్ని అప్పులు మూటగట్టుకోవాల్సిందేనని పంట సాగు చేసిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరా మిరప సాగుకు రూ.60వేల వరకు పెట్టుబడి పెట్టారు. పంటకోత సమయంలో ధరలు పూర్తిగా పతనమయ్యాయి. దీంతో కోతకు వచ్చిన ...

Cracked chilies

భారీగా పడిపోయిన ధర వారం కిందట

కిలో రూ.28 ప్రస్తుతం రూ.5

కూలీల ఖర్చు కూడా రాదంటున్న రైతులు

యాడికి, ఆగస్టు 27: ధర బానే ఉంది. దిగుబడి కూడా బాగా వచ్చింది. పెట్టుబడులు పోగా వచ్చిన సొమ్ముతో అప్పులు, ఇంటి అవసరాలు తీర్చుకోవచ్చని ఆశించిన పచ్చిమిరప రైతులకు నిరాశే ఎదురవుతోంది. వారం కిందటి వరకు ఉన్న ధర ప్రస్తుతం భారీగా పడిపోవడంతో మరిన్ని అప్పులు మూటగట్టుకోవాల్సిందేనని పంట సాగు చేసిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరా మిరప సాగుకు రూ.60వేల వరకు పెట్టుబడి పెట్టారు. పంటకోత సమయంలో ధరలు పూర్తిగా పతనమయ్యాయి. దీంతో కోతకు వచ్చిన పంటను కోయాలా లేక అలాగే వదిలేయాలో అర్థం కాని పరిస్థితిలో రైతుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మండలంలో పండిన పచ్చి మిర్చిని గుత్తి, తాడిపత్రి,


ప్యాపిలి, అనంతపురం మార్కెట్‌లకు తరలిస్తుంటారు. వారంరోజుల క్రితం వరకు కిలో పచ్చి మిరప రూ.28 పలికింది. ఇదే ధర కొనసాగితే లాభాలు పొందవచ్చు అనుకున్న రైతులకు హఠాత్తుగా తగ్గిన ధరలు నిరాశను మిగిల్చాయి. మండలంలోని ఒకరైతు ఇటీవల ప్యాపిలి మార్కెట్‌కు 50కిలోల మిరప విక్రయానికి తీసుకువెళ్లాడు. అక్కడ వ్యాపారి రూ.300కు అడిగాడు. మా రేటు ఇదే.. ఇష్టం ఉంటే అమ్మవచ్చు లేదంటే వెనుకకు తీసుకువెళ్లవచ్చుఅని చెప్పాడంట. మిరప కాయలు కోత కోసిన కూలి డబ్బులు రవాణా చార్జీలు కూడా దక్కవని రైతు ఆవేదన వ్యక్తం చేసినా మారేటు ఇంతే అని వ్యాపారులు తెగేసి చెప్పడంతో చేసేదేమిలేక రూ.300కే విక్రయించి తిరిగి వచ్చినట్లు రైతు తెలిపాడు.

రూ.1.2లక్షలు ఖర్చుచేశా: సురేష్‌, రాయలచెరువు

రెండెకరాల్లో మిరప సాగు చేశా. రూ.1.2లక్షలు పెట్టుబడి పెట్టా. వారం కిందట కిలో మిరప రూ.28 పలికింది. మొదటికోతలో రూ.30వేలు వచ్చింది. ఇప్పుడు రెండో కోత కోయాలి. ధరలు పూర్తిగా పతనమయ్యాయి. కిలో మిరప రూ.5ల నుంచి 8రూపాయల వరకు మాత్రమే అడుగుతున్నారు. ధరలు ఇలాగే కొనసాగితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. మార్కెట్‌కు మిరప దిగుబడి అధికంగా రావడంతోనే ఈ పరిస్థితులు నెలకొన్నాయి.

అధిక దిగుబడులవల్లే: శేఖర్‌, రాయలచెరువు

రైతుల వద్ద కిలో మిర్చి ధర రూ.5 నుంచి రూ.6 వరకు మాత్రమే కొంటున్నారు. మిరప ధరలు పూర్తిగా పడిపోయాయి. వారం రోజుల కిందట కిలో మిర్చి రూ.28 ధర పలికింది. ప్రస్తుతం రూ.5 ధర పలుకుతుండటానికి అధిక దిగుబడులే ప్రధాన కారణం. పంట సాగుకు అయ్యే పెట్టుబడులను పక్కన పెడితే మిరపకాయల విక్రయ రవాణా ఖర్చు, కూలీల డబ్బులకు వచ్చిన రైతు సంతోషపడాల్సి వస్తోంది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 28 , 2024 | 12:20 AM

Advertising
Advertising
<