RAINS : బత్తలపల్లిలో చిత్తడే చిత్తడి
ABN, Publish Date - Sep 01 , 2024 | 11:57 PM
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో మండలకేంద్రంలో ఎక్కడ చూసినా చిత్తడి చిత్తడిగా మారింది. ప్రధాన రహదారులైన ధర్మవరంరోడ్డు, తాడిపత్రిరోడ్డుతో పాటు వీధులన్నీ నీరు నిలిచి బరదమయంగా మారాయి. నీరు నిలిచినచోట దుర్వాసన వెద జల్లుతోంది. ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు.
బత్తలపలి,్ల సెప్టెంబరు 1: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో మండలకేంద్రంలో ఎక్కడ చూసినా చిత్తడి చిత్తడిగా మారింది. ప్రధాన రహదారులైన ధర్మవరంరోడ్డు, తాడిపత్రిరోడ్డుతో పాటు వీధులన్నీ నీరు నిలిచి బరదమయంగా మారాయి. నీరు నిలిచినచోట దుర్వాసన వెద జల్లుతోంది. ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వ్యాప్తి చెంది ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో అక్కడక్కడ డయేరియా, విష జ్వరాలు ఉందని, ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, బ్లీచింగ్, ఫాగింగ్ వంటివి చేయాలని కోరారు.
ఇలా ఉంటే నీరు కలుషితం కాదా?
ఓబుళదేవరచెరువు: ఒక పక్క ప్రభుత్వ మంచినీటి పథకం, మరో పక్క సత్యసాయి నీటి ట్యాంక్ ఉన్నాయి. వాటి చెంతనే మురుగునీరు నిలువ ఉంది. దీంతో నీరు కలుషితమై పోతుందని మండలంలోని మామిళ్లకుంట్లపల్లి గ్రామ స్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని పలుమార్లు అఽధికారులకు విన్నవిం చినా ఫలితం లేదంటున్నారు. నీరు కలుషితమై అతిసారం, ప్రబలకుండానే ఉన్న తాధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Sep 01 , 2024 | 11:57 PM