MLA : వ్యవసాయంలో సాంకేతికత చాలా అవసరం
ABN, Publish Date - Dec 30 , 2024 | 12:32 AM
వ్యవసాయంలో సాంకేతి కత చాలా అవసరమని ఎ మ్మెల్యే పరిటాల సునీత పే ర్కొన్నారు. నగరంలోని ఆమె క్యాంప్ కార్యాలయం వద్ద ఆదివారం రాప్తాడు నియోజకవర్గంలోని పలువురు రైతులకు సబ్సిడీపై మంజూరైన పంట కోత యంత్రాలను పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం అర్బన, డిసెంబరు 29 (ఆంధ్ర జ్యోతి) : వ్యవసాయంలో సాంకేతి కత చాలా అవసరమని ఎ మ్మెల్యే పరిటాల సునీత పే ర్కొన్నారు. నగరంలోని ఆమె క్యాంప్ కార్యాలయం వద్ద ఆదివారం రాప్తాడు నియోజకవర్గంలోని పలువురు రైతులకు సబ్సిడీపై మంజూరైన పంట కోత యంత్రాలను పంపిణీ చేశారు. కనగానపల్లి మండలం తూముచర్లకు చెందిన వసికేరప్ప, చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లికి చెందిన అశ్వత్థరెడ్డి, ప్యాదిండికి చెందిన నరసింహులుకు ఆమె పంపిణీ చేశారు. మరింత మంది రైతులకు అంద జేసేందుకు కృషి చేస్తామన్నారు. కాగా... గత కొన్నేళ్లుగా ఇలాంటి యంత్రాలు వస్తా యని ఆశించినా ఎవరూ ఇవ్వలేదని, తమకు యంత్రాలు ఇప్పించినందుకు ఎమ్మెల్యే పరిటాల సునీతకు రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
సీఎంఆర్‌ఫ్ చెక్కు పంపిణీ
ఆత్మకూరు డిసెంబరు29(ఆంధ్రజ్యోతి): మండలవలోని పి సిద్దరాంపురానికి చెందిన చెండ్రెడ్డి నరసింహులుకు రూ. 50వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే పరిటా ల సునీత అందజేశారు. నగరంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివా రం లబ్ధిదా రుడికి అందజేశారు. టీడీపీ నాయకుడు శశాంక చౌదరి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Dec 30 , 2024 | 12:33 AM