ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ICDS : కేసు సరే.. చర్యలేవీ?

ABN, Publish Date - Sep 02 , 2024 | 12:13 AM

పోస్టు ఇప్పిస్తానంటూ అక్రమ వసూళ్లకు దిగిన అంగనవాడీ టీచర్‌పై సాక్షాత్తు ఐసీడీఎస్‌ జిల్లా అధికారులే వెనకడుగువేస్తున్నారు. పాతూరులోని ఓ అంగనవాడీ టీచర్‌ ఏకంగా రూ.2.80 లక్షలు వసూలు చేయడంపై బాధితురాలు ఇటీవల ఉన్నతాధికారులను ఆశ్రయించింది. కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేసినా, పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినా, ఐసీడీఎస్‌ అధికారులు ...

ICDS Office

ఐసీడీఎ్‌సలో అధికారుల ఉదాసీనత

అక్రమ వసూళ్లకు తెగబడిన అంగనవాడీ టీచర్‌

వనటౌన పోలీస్‌స్టేషనలో కేసు నమోదు

అనంతపురం విద్య, సెప్టెంబరు 1: పోస్టు ఇప్పిస్తానంటూ అక్రమ వసూళ్లకు దిగిన అంగనవాడీ టీచర్‌పై సాక్షాత్తు ఐసీడీఎస్‌ జిల్లా అధికారులే వెనకడుగువేస్తున్నారు. పాతూరులోని ఓ అంగనవాడీ టీచర్‌ ఏకంగా రూ.2.80 లక్షలు వసూలు చేయడంపై బాధితురాలు ఇటీవల ఉన్నతాధికారులను ఆశ్రయించింది. కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేసినా, పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినా, ఐసీడీఎస్‌ అధికారులు మాత్రం చర్యలకు దూరంగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. ఐసీడీఎస్‌ సీడీపీఓ, పీడీ ఆఫీస్‌ అధికారులు మౌనంగా ఉండటంపై ఆరోపణలకు తావిస్తోంది.


వనటౌన స్టేషనలో కేసు నమోదు

నగరంలోని పాతూరులో ఓ అంగనవాడీ కేంద్రం టీచర్‌పై బాధితురాలి ఫిర్యాదు మేరకు 20వ తేదీన వనటౌనలో కేసు నమోదైంది. సెక్షన 318(2)బీఎనఎ్‌స యాక్ట్‌ కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా పోలీసులు కేసు నమోదు చేయరు. అంగనవాడీ టీచర్‌ పోస్టు ఇప్పిస్తానంటూ తనతో విడతలవారీగా రూ.2.80 లక్షలు వసూలు చేసిందని బాధితురాలు లిఖిత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇతర ఆధారాలను పోలీసుల ఎదుట ఉంచింది. ధ్రువీకరించుకున్న పోలీసులు సదరు టీచర్‌పై కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదైనా....ఐసీడీఎస్‌ అధికారులకు మాత్రం యూనియన లీడర్‌గా చెప్పుకునే ఆమె చేసిన అక్రమాలు, తప్పులు కనిపించడం లేదు. కలెక్టరేట్‌ వరకు ఫిర్యాదు వెళ్లిందన్న నెపంతో అంగనవాడీ టీచర్‌కు చిన్న మెమో ఇచ్చి...సంజాయిషీ రాయించుకుని అంతా తూచ అన్నట్టు హైడ్రామా ఆడినట్టు విమర్శలు వస్తున్నాయి. అధికారుల ఊదాసీనతపై కలెక్టర్‌, ఐసీడీఎస్‌ రాష్ట్ర స్థాయి అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - Sep 02 , 2024 | 12:13 AM

Advertising
Advertising