DHARNA : దోషులను అరెస్టు చేయాలి
ABN, Publish Date - Sep 01 , 2024 | 12:29 AM
మండలంలోని లింగారెడ్డిపల్లికి చెందిన గొర్రెల కాపరి శ్రీరాములు ఆత్మహత్యకు కారుకులను వెంటనే అరెస్టు చేయాలని మృతుడి భార్య భారతి, కుటుంబసభ్యులు, కురుబసంఘం నాయకులు డిమాండ్ చేశారు. శ్రీరాములు ఆత్మహత్య చేసుకుని మూడురోజులు అవుతున్నా బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో పోలీసుల జాప్యం చేస్తున్నారంటూ వారు శనివారం మండలకేం ద్రంలోని రోడ్ల కూడలిలో రోడ్డు పై బైఠాయించి ఆందోళనకు దిగారు.
గొర్రెల కాపరి కుటుంబ సభ్యుల డిమాండ్
రోడ్డుపై బైఠాయించి ఆందోళన
కొత్తచెరువు, ఆగస్టు 31: మండలంలోని లింగారెడ్డిపల్లికి చెందిన గొర్రెల కాపరి శ్రీరాములు ఆత్మహత్యకు కారుకులను వెంటనే అరెస్టు చేయాలని మృతుడి భార్య భారతి, కుటుంబసభ్యులు, కురుబసంఘం నాయకులు డిమాండ్ చేశారు. శ్రీరాములు ఆత్మహత్య చేసుకుని మూడురోజులు అవుతున్నా బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో పోలీసుల జాప్యం చేస్తున్నారంటూ వారు శనివారం మండలకేం ద్రంలోని రోడ్ల కూడలిలో రోడ్డు పై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ... తమకు న్యాయం చేయాలంటూ స్థానిక సీఐ ఇందిరకు పిర్యాదు చేశామన్నారు.
అయినా ఇప్పటి వరకు శ్రీరాములు హత్యకు కారణమైన కాంతమ్మ, నాగభూషణ, నరసింహుడు, నారాయణప్ప, ఆంజనేయులును అదుపు లోకి తీసుకోకపోవడం ఏమిటని బందోబస్తుకు వచ్చిన పుట్టపర్తి సీఐ అశోక్ కుమార్‌ను ప్రశ్నించారు. తన సామాజిక వర్గం వారిని కాపాడాలన్న ఉద్దేశ్యంతోనే సీఐ ఇందిర ఇలా చేస్తున్నారని కురుబ సంఘం నాయకులు మండిపడ్డారు. తమ కు న్యాయం చేయకపోతే పూడ్చిన శవాన్ని తీసుకొచ్చి ఎస్పీ కార్యాలయం ఎదుటే ధర్నా చేపడుతామన్నారు. ఇప్పటికైనా తన భర్త మృతికి కారకులైన వారిని అరెస్టు చేయకపోతే పురుగుల మందు తాగి ఆత్మ హత్య చేసుకుంటానని మృతుడి భార్య భారతి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగడానికి ప్రయత్నించగా పోలీసులు, బంధువులు అడ్డుకున్నారు. వారిని 24 గంటల్లోగా అరెస్టు చేసి రి మాండ్‌కు పంపుతామని సీఐ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Sep 01 , 2024 | 12:29 AM