NSS DAY : దేశసేవలో భాగస్వామ్యమే ఎనఎస్‌ఎస్ లక్ష్యం
ABN, Publish Date - Sep 25 , 2024 | 12:10 AM
విద్యార్థులను దేశసేవలో భాగ స్వామ్యం చేయడమే జాతీయ సేవా పథకం(ఎనఎస్‌ఎస్) ఏర్పాటు లక్ష్యమని సెంట్రల్ యూనివర్సీటీ వీసీ ప్రొఫెసర్ ఎస్‌ఏ కోరి పేర్కొన్నారు. ఎనఎస్‌ఎస్ డేను పురష్కరించుకుని జిల్లాలోని పలు విద్యాసంస్థల్లో మంగళ వారం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతపురం సెంట్రల్, సెప్టెంబరు 24 : విద్యార్థులను దేశసేవలో భాగ స్వామ్యం చేయడమే జాతీయ సేవా పథకం(ఎనఎస్‌ఎస్) ఏర్పాటు లక్ష్యమని సెంట్రల్ యూనివర్సీటీ వీసీ ప్రొఫెసర్ ఎస్‌ఏ కోరి పేర్కొన్నారు. ఎనఎస్‌ఎస్ డేను పురష్కరించుకుని జిల్లాలోని పలు విద్యాసంస్థల్లో మంగళ వారం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆవర ణంలో ఎనఎస్‌ఎస్ వలంటీర్లు చెత్తాచెదారాన్ని తొలగించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఎనఎస్‌ఎస్ వలంటీర్ల ద్వారా ఉచిత సేవలందిస్తున్నట్లు తెలిపారు.
జేఎనటీయూలో... ఎనఎస్‌ఎస్ వేడుకల్లో రక్త నిర్ధాణ పరీక్షల శిబిరాన్ని ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ వసుంధర, ప్రోగ్రామ్ ఆఫీసర్ మమత పాల్గొన్నారు.
అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో... ఎనఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ఉత్తమ సేవలందించిన వాలంటీర్లను అభినందించి సత్కరించారు. అనంత రం మొక్కలునాటారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రామమూర్తి, నైపుణ్యశిక్షణ విభాగాధిపతి సురేంద్రనాయుడు, ప్రోగ్రాం ఆఫీసర్ ఖలీల్‌బాష పాల్గొన్నారు.
ఎస్కేయూలో... ఎనఎస్‌ఎస్ ఆధ్వర్యంలో కందుకూరు ప్రభుత్వ పాఠశాల లో ప్లాస్టిక్ నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ అంశాలపై విద్యార్థులకు అవగా హన కల్పించారు. అనంతరం విద్యార్థులతో ఎనఎస్‌ఎస్ అక్షరాల వలయం ప్రదర్శించారు. ప్రిన్సిపాల్ సోమశేఖర్, ప్రోగ్రాం ఆఫీసర్ జ్యోష్ణ పాల్గొన్నారు.
ఐటీఐలో... స్థానిక ప్రభుత్వ బాలుర ఐటీఐలో హెచఐవీ నిర్మూలనపై అవగాహన కల్పించారు. ’సంపూర్ణ ఆరోగ్య ఆంధ్రను సాధిద్దాం’ అంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞచేయించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రామమూర్తి, హెచఐవీ నివారణ సంస్థ ప్రతినిధులు షంషాద్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Sep 25 , 2024 | 12:10 AM