RATION : ఎలాగూ మార్చేస్తారు... బియ్యం అమ్మేద్దాం..!
ABN, Publish Date - Sep 29 , 2024 | 11:53 PM
టీడీపీ ప్రభుత్వం వచ్చింది... మనల్ని ఎప్పుడు మారుస్తారో తెలియ దు... ఉన్నన్ని నెలల్లో ఏదో కొంత మందికి రేషన బియ్యం ఇచ్చి మిగితా వారికి ఇవ్వకుండా పక్కదా రి పట్టించినా పట్టించుకునేవా లేరు అన్న ధోరణి లో పలువురు రేషన డీలర్లు వ్యవహరిస్తున్నారు. నార్పల మండల వ్యాప్తంగా 52మంది రేషన డీల ర్లు ఉన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అవుతోంది.
పలువురు రేషన డీలర్ల తీరు
ఆవేదన వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
నార్పల, సెప్టెంబరు29: టీడీపీ ప్రభుత్వం వచ్చింది... మనల్ని ఎప్పుడు మారుస్తారో తెలియ దు... ఉన్నన్ని నెలల్లో ఏదో కొంత మందికి రేషన బియ్యం ఇచ్చి మిగితా వారికి ఇవ్వకుండా పక్కదా రి పట్టించినా పట్టించుకునేవా లేరు అన్న ధోరణి లో పలువురు రేషన డీలర్లు వ్యవహరిస్తున్నారు. నార్పల మండల వ్యాప్తంగా 52మంది రేషన డీల ర్లు ఉన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అవుతోంది. కానీ ఇప్పటికీ వైసీపీకి చెందిన రేషన డీలర్లే కొనసాగుతున్నారు. అయితే వారు మమ్మల్ని ఎలాగూ తొలగి స్తారు అన్న ఉద్దేశంతో ప్రతి నెల బియ్యం సగం మందికి పైగా ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొంత మంది డీలర్లు అయితే తమ వద్ద బియ్యం లేవని వేరే డీలర్ వద్దకు వెళ్లమని చెబుతున్నారు. అక్కడికి వెళ్తే తమ వద్ద కూడా స్టాక్ లేదని చెబుతూ తమను కాళ్లు అరిగేలా తిప్పుతున్నా రని పలువురు లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొ కొంత మం ది లబ్ధిదారులు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ ఒక రెవెన్యూ అధికారి మాత్రం ఎలాగూ ఈనెల నుంచి ఆ డీలర్లు ఉండరు ఈ నెల ఒకటి సర్దుకోమని ఉచిత సలహాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే కొందరు డీలర్లు లబ్ధిదారులకు బియ్యం ఇవ్వకుండా బ్లాక్ మా ర్కెట్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. మండలంలో నిరుపేదలకు అందాల్సిన బియ్యాన్ని కొందరు డీలర్లు మూడు నెలల నుంచి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నా ప్రజా ప్రతినిధులు, అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా రేషన బియ్యాన్ని ఇంటింటికీ సరఫరా చేయడంలేదు. ఎండీయూ వాహనాల్లో గ్రామాల్లోకి తీసుకొచ్చి బస్టాండ్, తదితర ప్రాంతాల్లో కొంతసేపు కాలంగడిపి అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. ఇలా లబ్ధిదారులకు బియ్యం అందక పో వడంపై సీపీఐ మండల నాయకుడు ప్రవీణ్ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినప్పటికీ అధికారులు ఏమాత్రం స్పందించకపోవడం గమనా ర్హమని ఆయన అంటున్నాడు. ఇప్పటికైనా ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, సంబంధిత ఉన్నత స్థాయి అధికారులు చొరవ తీసుకొని రేషన బియ్యం సక్రమంగా పంపిణీ చేయించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాం- గంగాధర్, సీపీఐ మండల కార్యదర్శి, నార్పల
రేషన బియ్యాన్ని సక్రమంగా ఇవ్వడం లేదని గత నెలలోనే లబ్ధిదారులతో కలసి రెవెన్యూ అధి కారులకు ఫిర్యాదు చేశాను. ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదు. కానీ నేనే దగ్గరుండి చా లామంది డీలర్లతో వాగ్వాదం చేసి కొంత మంది నిరుపేదలకు బియ్యం ఇప్పించాను. అయినా చాలా మంది లబ్ధిదారులకు రేషన బియ్యం అంద డం లేదు. అలా మిగిలిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారు.
రేషన ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటాం - అరుణకుమారి, తహసీల్దారు
నార్పల మండలంలో ఏ డీలర్ అయినా రేషన బియ్యం ఇవ్వకపోతే వెంటనే మాకు ఫిర్యాదు చేయాలి. బియ్యం వేయని డీలర్‌పై విచారణ చేసి చర్యలు చేపడతాం.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Sep 29 , 2024 | 11:53 PM