THEFTS : రైతులకు దొంగల పోటు
ABN, Publish Date - Sep 28 , 2024 | 12:10 AM
పంటలు సాగు చేసిన రైతులు ప్రకృతి వైపరీత్యాలతో ప్రతి ఏటా నష్టాలను చవిచూస్తున్నారు. ఇ లాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న రైతులను ట్రాన్సఫా ర్మర్లు, స్టార్టర్‌ల దొంగలు మరింత కష్టాల్లోకి నెడుతున్నారు. వ్యవసా య తోటల్లో బోరుబావులకు అనుసంధానం చేసిన విద్యుత ట్రాన్సఫార్మర్లను, స్టార్టర్ పెట్టెలను ధ్వంసం చేసి అందులోని విలువైన సామగ్రిని ఎత్తుకెళుతున్నారు.
ట్రాన్సఫార్మర్ల ధ్వంసం
కాపర్ వైరు, స్టార్టర్ పెట్టెలు, కేబుల్ ఎత్తుకెళుతున్న వైనం
గార్లదిన్నె, సెప్టెంబరు 27 : పంటలు సాగు చేసిన రైతులు ప్రకృతి వైపరీత్యాలతో ప్రతి ఏటా నష్టాలను చవిచూస్తున్నారు. ఇ లాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న రైతులను ట్రాన్సఫా ర్మర్లు, స్టార్టర్‌ల దొంగలు మరింత కష్టాల్లోకి నెడుతున్నారు. వ్యవసా య తోటల్లో బోరుబావులకు అనుసంధానం చేసిన విద్యుత ట్రాన్సఫార్మర్లను, స్టార్టర్ పెట్టెలను ధ్వంసం చేసి అందులోని విలువైన సామగ్రిని ఎత్తుకెళుతున్నారు. అంతేకాకుండా విద్యుత కేబుల్‌ను, నీటి పైపులను, బోరుబావులకు వినియోగించే సామగ్రిని దొంగలిస్తూ రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ కారణంగా రైతులు మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. దీంతో రైతుల పరిస్థితి గోరుచుట్టుపై రోకలి పోటు అన్నచందంగా తయారైంది. అలాగే గ్రామాల్లో ప్రజలకు తాగునీరు సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన స్టార్టర్ పెట్టెల చోరీకి సైతం ఎత్తుకెళ్లేందుకు వెనుకాడడంలేదు. అదేవిధంగా వ్యవసాయ తోటల్లోని బోరుబావులకు వినియోగించే విద్యుత పరికరాలతో పాటు గ్రామాల్లోని దేవాలయాల్లోకి చోరబడి హుండీలను ఎత్తుకెళ్ళుతున్నారు. గత రెండు నెలల్లో మండలంలోని గార్లదిన్నెతో పాటు బూదేడు, యర్రగుంట్ల, ముకుందాపురం, పాఫినేపాల్యం, జంబులదిన్నె తదితర గ్రామాల్లోని వ్య వసాయ తోటల్లో బోరుబావులకు రైతులు అమర్చిన విద్యుత స్టార్టర్ పెట్టేలు చోరికి గురవైయ్యాయి. అదేవిధంగా ట్రాన్సఫార్మర్, విద్యుత కేబులు వైరు, పైపులు ఇలా విద్యుత సామాగ్రిని దొంగలు ఎత్తుకెళ్లారు. బోరుబావులకు అ మర్చిన విద్యుత స్టార్టర్ పెట్టేలు, వైర్లు, పైపులు చోరికి గురవడంతో రైతులు సాగుచేసిన పంటలకు నీరు సరఫరా చేసేందుకు అప్పులు చేసి కొత్తవి కొనుగోలు చేసుకోవాలి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు స్టార్టర్ పెట్టెలు ఎత్తుకెళ్లారు - రామన్నచౌదరి, మాజీ సర్పంచు, బూదేడు
తోటల్లో బోరుబావులకు అమర్చిన స్టార్టర్ పెట్టేలను దొంగ లు రెండు సార్లు ఎత్తుకెళ్లారు. ఒక్కక్కటి రూ. 10వేలు. స్టార్టర్ పెట్టేలతో పాటు 10 విద్యుత స్తంబాల పొడవు కేబులు వైరు ఎత్తుకెళ్లారు. దీంతో సుమారు రూ. 40వేల వరకు నష్టం జరి గింది. ఇలా వ్యవసాయ తోటల్లో విద్యుత పరికరాలను ఎత్తుకె ళ్లుతూ రైతులకు నష్టం చేస్తున్నారు. తోటల్లో విద్యుత పరికరాల చోరీకి పాల్పడుతున్న దొంగలను పట్టుకుని తగిన గుణపాఠం చెప్పాలి. ఒక వైపు పంటలు పండక రైతులు నష్టపోతుంటే మరో పక్క దొంగల పోటు ఎక్కు వైంది. చోరికి పాల్పడుతున్న దొంగలపై పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది.
మూడుసార్లు చోరీ- రామాంజినేయులు, రైతు బూదేడు
వ్యవసాయ తోటలో బోరుబావికి ఏర్పా టు చేసిన విద్యుత స్టార్టర్, కేబుల్ వైర్ ను మూడుసార్లు దుండగులు ఎత్తుకె ళ్లారు. దీంతో సుమారు రూ. 35 వేలు నష్టం వాటిల్లింది. మా తోటలో మాదిరిగా గ్రామంలో పలువురి రైతుల పొలాల్లో కూ డా విద్యుత స్టార్టర్లు, కేబులు వైర్లు ఎత్తుకెళ్లారు. వ్యవసాయ తోటల్లో విద్యుత పరికరాలు చోరికి గురవుతున్న విషయాన్ని గార్లదిన్నె పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేశాం.
త్వరలోనే దొంగలను పట్టుకుంటాం - సీఐ కౌలుట్లయ్య, ఎస్‌ఐ మహమ్మద్‌గౌస్
వ్యవసాయ తోటల్లో విద్యుత పరికరాలు చోరికి గురవుతున్న విషయం వాస్తవమే. వ్యవసాయ తోటల్లో విద్యుత స్టార్టర్లు, ట్రాన్సఫార్మర్లు చోరికి గురై నట్లు రైతుల నుంచి ఫిర్యాదులు కూడా వచ్చాయి. ప్రతి గ్రామంలో పో లీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. దొంగలను పట్టుకునేందుకు ఇప్పటికే ప్రత్యేక నిఘా ఉంచాం. త్వరలోనే దొంగలను పట్టుకుని విద్యుత పరికరాలు చోరి గురైన రైతులందరికి న్యాయం చేస్తాం. చోరికి పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. ముఖ్యంగా గ్రామాల్లో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అదే విధంగా మండలంలో ఎక్కడైనా పేకాట, మటక్కా తదితర జూదాలు నిర్వహిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ కౌలుట్లయ్య తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Sep 28 , 2024 | 12:10 AM