ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

WITHOUT PERMITS : అడ్డదిడ్డమైన కట్టడాలు

ABN, Publish Date - Dec 02 , 2024 | 12:13 AM

నగరంలో అడ్డదిడ్డమైన కట్టడాలు అధిక మవుతున్నా యి. దీంతో కనీసం మురుగు తీయడానికి కాలువలు కూడా అందుబాటులో ఉండటం లేదు. భారీ వర్షాలు వచ్చినప్పుడల్లా ఈ సమస్య కనిపిస్తోంది. ఇది ఒక ఎత్తయితే అక్రమ కట్టడాల వల్ల నగరపాలిక ఆదా యానికి భారీగా గండిపడుతోంది. ప్రతి ఏటా ఆ నష్టం రూ.5కోట్ల పైమాటే ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

4th floor construction in Ferrer Nagar area

ఒకే భవనానికి సంబంధించి రూ. 60 లక్షలు హాంఫట్‌

నగరపాలిక ఆదాయానికి గండి

ఇతర భవనాల సెల్లార్ల నిర్మాణంలోనూ రాజకీయ జోక్యం

అనంతపురం క్రైం, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి) : నగరంలో అడ్డదిడ్డమైన కట్టడాలు అధిక మవుతున్నా యి. దీంతో కనీసం మురుగు తీయడానికి కాలువలు కూడా అందుబాటులో ఉండటం లేదు. భారీ వర్షాలు వచ్చినప్పుడల్లా ఈ సమస్య కనిపిస్తోంది. ఇది ఒక ఎత్తయితే అక్రమ కట్టడాల వల్ల నగరపాలిక ఆదా యానికి భారీగా గండిపడుతోంది. ప్రతి ఏటా ఆ నష్టం రూ.5కోట్ల పైమాటే ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో అధికారులకు మా మూళ్లు ముడుతుంటాయని, ఎల్‌టీపీల నుంచి కార్పొ రేషన టౌనప్లానింగ్‌ అధికారుల మధ్యలోనే ఈ తతం గం జరిగిపోతుంటుందనే విమర్శలున్నాయి. తాజాగా ఓ భవనం నుంచే నగరపాలిక ఆదాయానికి రూ. అర కోటిపైగా గండిపడింది. మరో భవనం సెల్లార్‌ విషయంలో అధికారులకు కాకుండా కేవలం రాజకీ యనాయకులకే సొమ్ము వెళ్లినట్లు సమాచారం.

రూ. 60లక్షలు హాంఫట్‌

అనంతపురం నగరంలోని ఫెర్రర్‌నగర్‌ పరిధిలోని బెంగళూరురోడ్డు ప్రధాన రహదారిలో ఆర్డీటీ కార్యాల యం ఎదుట ఓ భవనం నిర్మిస్తున్నారు. ఆ ప్రాంతం నాన అప్రూవల్‌ లేఅవుట్‌. అంటే ఆ ఏరియాలో ఏదై నా భవనం నిర్మించాలంటే అనంతపురం నగరపాలి కకు 14శాతం బెటర్‌మెంట్‌ చార్జెస్‌ చెల్లించాలి. ఆర్డీటీ కార్యాలయం ఎదుట నిర్మిస్తున్న భవనం బాగా కమర్షి యల్‌కు వాడేలా ఉంది. అందులో ప్రైవేట్‌ ఆసుపత్రి ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నాలుగో అంతస్తు నిర్మాణం జరుగుతోంది. దాదాపు 20 సెంట్లలో నిర్మిస్తున్న ఈ భవనానికి రూ.14శాతం చా ర్జెస్‌ కింద రూ.60లక్షలు చెల్లించాల్పి ఉంది. కానీ ఒక్క రూపాయి చెల్లించలేదని సమాచారం. ఇదే విషయం పై టౌనప్లానింగ్‌ విభాగం అధికారులను అడిగితే.. అలాంటిదేమీ లేదు... బెటర్‌మెంట్‌ చార్జెస్‌ కట్టేసి ఉం టారని చెబుతున్న్నారు. కానీ లేఅవుట్‌ ప్లాన (ఎల్‌పీ) నెంబరు అడిగితే పక్క చూపులు చూస్తున్నారు.


పెద్ద తిమింగలం సహకారం

ఈ భవనం వెనుక ఆ శాఖకు చెందిన ఓ పెద్ద తిమింగలం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాయల సీమ పరిధిలోని నగరపాలికలు, మున్సిపాలిటీల్లోని టౌన ప్లానింగ్‌ విభాగాలను పర్యవేక్షించే విభాగంలో పనిచేసే ఓ అధికారి ఈ వ్యవహారంలో పనిచేసినట్లు సమాచారం. ఆ బిల్డింగ్‌కు అప్రూవల్స్‌ విషయంలో ఆ బిల్డర్‌, ఎల్‌టీపీ నుంచి రూ.40లక్షల వరకు ఈ బి ల్డింగ్‌ విషయంలో ముడుపుల బాగోతం నడిచినట్లు తెలిసింది. టౌనప్లానింగ్‌ అధికారులు సైతం ఉన్నతా ధికారి కావడంతో కిక్కురుమనకుండా ఉంటున్నారట. కాగా ఆయన ఈ ఒక్క బిల్డింగే కాదు చాలా భవనాల విషయంలో ఇలా 14శాతం, జీప్లస్‌ 2కు అనుమతి తీసుకుని నాలుగంతస్తుల భవనం నిర్మించిన వాటిల్లో తలదూర్చినట్లు నగరపాలికలో కోడై కూస్తోంది.

సెల్లార్‌లో రాజకీయం

అరవిందనగర్‌లో కొత్తగా ఓ భవనం నిర్మిస్తున్నారు. ఆ భవనానికి వాస్తవానికి సెల్లార్‌ అనుమతి లేదు. కానీ సెల్లార్‌ తవ్వేసి, భవనం నిర్మించడానికి సిద్ధమవు తున్నారు. ప్రధాన రహదారిలోనే ఈ వింతచోద్యం చోటుచేకుంటోంది. ఈ బిల్డింగ్‌ విషయంలో అధికారు లు తల దూర్చకముందే రాజకీయనాయకులు జోక్యం చేసుకున్నారట. పాలకవర్గం ఉండటంతో వైసీపీ నాయకులు, అధికారంలో ఉండటంతో టీడీపీ నాయకు లు జోక్యం చేసుకున్నట్లు సమాచారం. వారికి పైసలు ముట్టడంతో... ఏమీ అనవద్దంటూ అధికారులకు సూచనలు వెళ్లినట్లు సమాచారం ఆ బిల్డింగ్‌ నుంచి రూ.లకారాల్లోనే లబ్ధి పొందినట్లు తెలిసింది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 02 , 2024 | 12:14 AM