ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PROBLEMS : జగనన్న కాలనీల్లో సమస్యల రాజ్యం

ABN, Publish Date - Oct 25 , 2024 | 11:55 PM

గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతో ఆర్భాటంగా కాలనీలు కాదు... ఊ ర్లు నిర్మిస్తున్నామంటూ గొప్పలు చెప్పి జగనన్న కాలనీ లు ఏర్పాటు చేశారు. అయితే ఆ కాలనీల్లో పూర్తి స్థా యిలో ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. ఆయా కాలనీల్లో మౌలిక కల్పించకపోవడంతో నివాసముంటున్న లబ్ధి దారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మండల పరిధిలో గార్లదిన్నె, కల్లూరు, ఇల్లూరు, మర్తాడు, యర్రగుంట్ల తదితర గ్రామాల్లో జగనన్న కాలనీలు ఏ ర్పాటు చేశారు.

Colony of Garladinne Jagananna with wild plants

ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు

గార్లదిన్నె, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతో ఆర్భాటంగా కాలనీలు కాదు... ఊ ర్లు నిర్మిస్తున్నామంటూ గొప్పలు చెప్పి జగనన్న కాలనీ లు ఏర్పాటు చేశారు. అయితే ఆ కాలనీల్లో పూర్తి స్థా యిలో ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. ఆయా కాలనీల్లో మౌలిక కల్పించకపోవడంతో నివాసముంటున్న లబ్ధి దారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మండల పరిధిలో గార్లదిన్నె, కల్లూరు, ఇల్లూరు, మర్తాడు, యర్రగుంట్ల తదితర గ్రామాల్లో జగనన్న కాలనీలు ఏ ర్పాటు చేశారు. ఆయా కలనీల్లో మండల వ్యాప్తంగా సుమారు 989 మందికి పక్కా గృహాలు మంజూరు చేశారు. ప్రభుత్వమే ఇళ్లు కట్టిస్తుందని చెప్పడంతో లబ్ధిదారులు ఎంతో సంతోష పడ్డారు. అయితే ఇళ్లు మీ రే నిర్మించుకోవాలని మాట మార్చ డంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపో యారు.


ఇళ్లు కట్టుకోకపోతే ఇళ్లు రద్దు చేస్తామని అధికారులు ఒత్తిడి చేయడంతో కొంత మంది అ ప్పులు చేసి నిర్మించుకున్నారు. అయితే విద్యుత్తు, రోడ్లు, డ్రైనేజీ సదుపాయా లు లేక జగనన్న కాలనీలు దర్శన మిస్తున్నాయి. కొన్ని కాలనీల్లో తాగు నీటి సౌకర్యం కల్పించారు. కొన్నింటి లో విద్యుత స్తంభాలు ఏర్పాటు చేసి లైట్లు వేశారు. కానీ అవి వెలగడం లేదని కాలనీ వాసులు ఆరోపి స్తున్నారు. పైగా నిర్వ హణ సరి గా లేకపోవడంతో కాలనీల్లో పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. దీంతో రాత్రిళ్లు ఇంటి నుంచి బయ టకు రావాలంటే భయపడుతున్నట్లు పలువురు వా పోతున్నారు. అలాగే రోడ్లు, డ్రైనేజీ నిర్మించలేదు. ఫలి తంగా వర్షం వస్తే రోడ్లన్నీ బురదతో దర్శనమిస్తాయి. కాలనీవాసులు, వాహనదారులు రోడ్లపై తిరగాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధి కారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి జగనన్న కా లనీల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు.


ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నాం - రమణమ్మ, కాలనీవాసి, గార్లదిన్నె

జగనన్న కాలనీల్లో రోడ్లు లేకపోవడంతో వర్షం వస్తే వరద నీరంతా రోడ్ల పైనే ప్రవహిస్తుం టుంది. దీంతో రోడ్లు బురదగా మారుతున్నాయి. వ ర్షాలు వస్తే రోడ్లపై తిరగలేం. రోడ్ల్లు, డ్రైనేజీ నిర్మిం చాలని గత ప్రభుత్వంలో అధికారులు, ప్రజాప్రతి నిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. ఈ ప్రభు త్వంలోనైనా కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి.

పాముల బెడద ఎక్కువైంది- లక్ష్మి, కాలనీ వాసి, గార్లదిన్నె

కాలనీల్లో వీఽఽధిలైట్లు వెలగడం లేదు. రాత్రిళ్లు పాముల బెడద ఎక్కువైంది. దీంతో భయం భయంగా జీవనం సాగిస్తున్నాం. అదేవిధంగా రోడ్లు నిర్మించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతు న్నాం. వర్షపు నీరు ఇళ్ల ఎదుట నిల్వ ఉండకుండా సొంత డబ్బుతో కాలనీవాసులే మట్టి తోలుకున్నారు. అధికారులు స్పందించి వీధిలైట్లు, రోడ్లు నిర్మించాలి.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 25 , 2024 | 11:55 PM