ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

FARMERS : రైతులకు ట్రాన్సఫార్మర్ల కష్టాలు

ABN, Publish Date - Nov 11 , 2024 | 12:03 AM

అన్న దాతలను ట్రాన్సఫార్మర్ల కష్టాలు నిత్యం వెంటా డుతున్నాయి. కొత్త సర్వీసుల కోసం దరఖాస్తు చేసు కుని డీడీలు చెల్లించిన వారికి సకాలంలో ట్రాన్స ఫార్మర్లు అందడం లేదు. అలాగే పొలాల్లోని పాత ట్రాన్సఫార్మర్లు పలు కారణాల వలన పాడైనా సకాలం లో కొత్తవి అందడం లేదు.

transformer in field

ఇటీవల కురిసిన భారీ వర్షానికి పాడైపోయిన వైనం

సకాలంలో కొత్తవి అందక ఇబ్బందులు

రాప్తాడు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): అన్న దాతలను ట్రాన్సఫార్మర్ల కష్టాలు నిత్యం వెంటా డుతున్నాయి. కొత్త సర్వీసుల కోసం దరఖాస్తు చేసు కుని డీడీలు చెల్లించిన వారికి సకాలంలో ట్రాన్స ఫార్మర్లు అందడం లేదు. అలాగే పొలాల్లోని పాత ట్రాన్సఫార్మర్లు పలు కారణాల వలన పాడైనా సకాలం లో కొత్తవి అందడం లేదు. దీంతో రైతులు విద్యుత శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ట్రాన్స ఫార్మర్లు సకాలంలో అందకపోవడంతో పంటలకు సకాలంలో నీరు సరఫరా చేయలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో హెచవీడీఎస్‌ ఫథకం ద్వారా రెండు లేదా మూడు మోటార్లకు కలిపి రైతుల పొలం లోనే మినీ ట్రాన్సఫా ర్మర్లు ఏర్పాటు చేశారు. ఇలాంటివి వేల సంఖ్యలో ట్రాన్సఫార్మర్లు ఉన్నాయి. నియోజకవర్గం వ్యాప్తంగా ఇటీవల భారీ వర్షం కురి సింది. ఈ వర్షానికి కనగానపల్లి చెరువు కట్ట తెగిపో గా, బండమీదపల్లి చెరువు కట్ట మరువ వద్ద కోతకు గురైంది. ఇతర గ్రామాల్లోని చెరువులు, చెక్‌డ్యాంలు మరువ పారాయి.


భారీ వర్షాలు కురిసినప్పుడు పెద్ద పెద్ద ఉరుముల శబ్దాలకు, మెరుపులకు పలు గ్రామా ల్లోని రైతుల పొలాల్లో ట్రాన్సఫార్మర్లు అధిక సంఖ్యలో పాడైపోయాయి. అలాగే వ్యవసాయ మోటా ర్లు చెడిపోయాయి. విద్యుత శాఖ అధికారులు వర్షాల కు పాడైన ట్రాన్షఫార్మర్లను తొలగించి వాటి స్థానంలో కొత్తమి అమర్చాలి. అయితే ట్రాన్సఫార్మర్లు స్టాక్‌ లేక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోంది. ట్రాన్సఫార్మర్ల కోసం విద్యుతశాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదని రైతులు వాపోతు న్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా దాదాపు 150 వరకూ ట్రాన్స ఫార్మర్లు భారీ వర్షాలకు పాడైపోయా యి. అందులో సగం మంది రైతులకు ఉపయోగంలో ఉన్న ట్రాన్సఫార్మర్లను అందచేశారు. మిగతా వారికి స్టాక్‌ లేకపోవడంతో అందజేయలేదు.

మూడు రోజుల్లో అందజేస్తాం - శివప్రసాద్‌, విద్యుత శాఖ ఏఈ, రాప్తాడు

ఇటీవల భారీ వర్షాలకు రాప్తాడు మండలంలో దాదాపు 35 ట్రాన్సఫార్మర్లు పాడైపోయాయి. అందులో 18 మంది రైతులకు ఉపయోగంలో ఉండే ట్రాన్స ఫార్మర్లు అందజేశాం. మిగతా వారికి మూడు రోజుల్లో అందజేస్తాం.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 11 , 2024 | 12:03 AM