ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MPDO DISMISSED : ఉరవకొండ ఎంపీడీఓ డిస్మిస్‌

ABN, Publish Date - May 04 , 2024 | 12:33 AM

ఉరవకొండ ఎంపీడీఓ అమృతరాజ్‌ను ఉద్యోగం నుంచి డిస్మిస్‌ చేశారు. పంచాయతీరాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌ నుంచి ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో ఆయన కర్నూలు జిల్లాలో ప్యాపిలి ఎంపీడీఓగా పనిచేశారు. ఆ సమయంలో ఉపాధి పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహించడం, నిధులను దుర్వినియోగం చేయడంతో ఆయనను డిస్మిస్‌ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి కలెక్టరేట్‌కు సమాచారం వచ్చింది. పంచాయతీరాజ్‌ ...

అనంతపురం విద్య, మే 3: ఉరవకొండ ఎంపీడీఓ అమృతరాజ్‌ను ఉద్యోగం నుంచి డిస్మిస్‌ చేశారు. పంచాయతీరాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌ నుంచి ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో ఆయన కర్నూలు జిల్లాలో ప్యాపిలి ఎంపీడీఓగా పనిచేశారు. ఆ సమయంలో ఉపాధి పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహించడం, నిధులను దుర్వినియోగం చేయడంతో ఆయనను డిస్మిస్‌ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి కలెక్టరేట్‌కు సమాచారం వచ్చింది. పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నుంచి జడ్పీకి ఉత్తర్వులు రావాల్సి ఉంది. జడ్పీ డిప్యూటీ సీఈఓగా పనిచేస్తున్న ఆయనపై గత ఏడాది సైతం ఉన్నఫలంగా సస్పెన్షన వేటు వేశారు. ఆయన కోర్టును ఆశ్రయించడంతో సస్పెన్షన ఎత్తివేశారు. మరోసారి ఆయనపై కక్షగట్టి వేటు వేసినట్టు జడ్పీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అమృత రాజ్‌ అనారోగ్య కారణాలతో ప్రస్తుతం సెలవులో ఉన్నారు. ఇప్పటి వరకూ ఆయనకు ఉత్తర్వులు అందలేదని సమాచారం.

Updated Date - May 04 , 2024 | 12:33 AM

Advertising
Advertising