Ap Elections : వాడుకుని వదిలేశారు..!
ABN, Publish Date - Sep 06 , 2024 | 12:12 AM
: సార్వత్రిక ఎన్నికలకు వినియోగించిన జేఎనటీయూ ఇంజనీరింగ్ విభాగం గదులు తరగతుల బోధనకు పనికిరాని విధంగా తయారయ్యాయి. ఎన్నికల సమయంలో సా్ట్రంగ్ రూమ్‌లు, కౌంటింగ్ రూమ్‌లకు అవసరమైన విధంగా గదులను మార్చుకున్నారు. ఈ క్రమంలో కొన్ని గదుల అడ్డగోడలను కూల్చి.. విశాలంగా మార్చుకున్నారు. అవసరమైనచోట గోడలను నిర్మించుకున్నారు. తరగతి గదులు, ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, సెమినార్ హాల్ తదితరాలను ఎన్నికల అవసరాలకు అనుగుణంగా ...
జేఎనటీయూలో తరగతులకు పనికిరాని గదులు
ఎన్నికల అవసరాలకు మార్పులు.. చేర్పులు
నష్టపోతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు
అనంతపురం సెంట్రల్, సెప్టెంబరు 5: సార్వత్రిక ఎన్నికలకు వినియోగించిన జేఎనటీయూ ఇంజనీరింగ్ విభాగం గదులు తరగతుల బోధనకు పనికిరాని విధంగా తయారయ్యాయి. ఎన్నికల సమయంలో సా్ట్రంగ్ రూమ్‌లు, కౌంటింగ్ రూమ్‌లకు అవసరమైన విధంగా గదులను మార్చుకున్నారు. ఈ క్రమంలో కొన్ని గదుల అడ్డగోడలను కూల్చి.. విశాలంగా మార్చుకున్నారు. అవసరమైనచోట గోడలను నిర్మించుకున్నారు. తరగతి గదులు, ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, సెమినార్ హాల్ తదితరాలను ఎన్నికల అవసరాలకు అనుగుణంగా మార్చుకున్నారు. గదుల్లో ఉన్న ఫర్నిచర్, పరికరాలు, యంత్రాలను వేరేచోటుకు తరలించారు. కిటికీలు, వాకిళ్లకు అడ్డుగా గోడలు కట్టారు. మరుగు దొడ్లను మూసివేశారు. ఏసీలు, ఫ్యానలు, కంప్యూటర్లుకు విద్యుత సరఫరా లేకుండా వైర్లను కోసేశారు. ఇంటర్నెట్ వైర్లను ఎక్కడికక్కడ కోసేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసి మూడు నెలలు గడిచినా ఆ గదులను మునుపటి స్థితికి తీసుకురాలేదు. దీంతో విద్యార్థులకు నష్టం జరుగుతోంది.
కళాశాలకు భారం
ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మొత్తం రెవెన్యూ శాఖ అధ్వర్యంలో జరుగుతుంది. ఎన్నికల కోసం ఈసీ రూ.కోట్లు ఖర్చు చేస్తుంది. రెవెన్యూ శాఖ పెట్టిన ఖర్చులకు బిల్లులు చెల్లిస్తుంది. జేఎనటీయూ ఇంజినీరింగ్ కాలేజీలో ఎన్నికల ఏర్పాట్లకు భారీగా ఖర్చు చేశారు. కానీ తరగతి గదుల పునరుద్ధరణ గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. తోచిన పనులు చేసి మమ అనిపించారు. దీంతో తరగతి గదులు, హాళ్లు, మౌలిక వసతుల పునరుద్ధరణ ఖర్చులను కాలేజీ భరించాల్సిన దుస్థితి నెలకొంది.
త్వరితగతిన చేయిస్తాం...
ఎన్నికల కౌటింగ్‌కు అనుగుణంగా జేఎనటీయూ ఇంజనీరింగ్ కళాశాలలో కాంట్రాక్టర్ల చేత పనులు చేయించాం. తరగతి గదులు, ల్యాబ్‌లు, సెమినార్ హళ్లు.. ఇలా అవసరమైన భవనాలు, గదులను వినియోగించుకున్నాము. వాటిని పుర్వపుస్థితికి తీసుకువచ్చే పనులు పూర్తిచేయిస్తాం. ఇప్పటికే చాలా పనులు చేయించాము. కొద్దిశాతం పనులు ఆగిపోయాయి. వీటిని పూర్తిచేస్తేనే బోధన, ల్యాబ్‌ల నిర్వహణకు వీలవుతుందని కళాశాల అధికారులు మా దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్‌తో చర్చించి త్వరతగతిన పూర్తిచేయిస్తాం. - రామకృష్ణారెడ్డి, డీఆర్వో
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Sep 06 , 2024 | 12:12 AM