ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

VAJPAYEE: వాజ్‌పేయి సేవలు చిరస్మరణీయం

ABN, Publish Date - Dec 26 , 2024 | 12:12 AM

మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని బీజేపీ నాయకులు అన్నాయి.

వాజ్‌పేయి చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న బీజేపీ నాయకులు

యాడికి, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని బీజేపీ నాయకులు అన్నాయి. వాజ్‌పేయి శతజయంతిని పురస్కరించుకొని బుధవారం ఆయన చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అసెంబ్లీ కో కన్వీనర్‌ గంగాధర్‌, నాయకులు చౌడయ్య, లక్ష్మిదేవి, వేణుగోపాల్‌, జగదీష్‌, వెంకట, రాజశేఖర్‌ పాల్గొన్నారు.

తాడిపత్రి: స్థానిక బీజేపీ కార్యాలయంలో బుధవారం వాజ్‌పేయి శత జయంతిని ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. లీగల్‌ సెల్‌ కన్వీనర్‌ ప్రతా్‌పరెడ్డి వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కన్వీనర్‌ రంగనాథరెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు.

కణేకల్లు: మాజీ ప్రధాని వాజ్‌పేయి 100వ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక చిక్కణ్ణేశ్వరస్వామి కళ్యాణమండపంలో బీజేపీ మండల అధ్యక్షుడు మల్లయ్యచౌదరి, కురుబ తిప్సేస్వామి, కే రవికుమార్‌, నాగభూషణం, క్రాంతికుమార్‌, హనుమంతరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

గుంతకల్లు టౌన: పట్టణంలోని గోపాలకృష్ణ భవనంలో బీజేపీ పట్టణ శాఖ ఆఽధ్వర్యంలో బుధవారం మాజీ ప్రధాని వాజ్‌పేయి 100వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ అధ్యక్షుడు వడ్డెరమేష్‌, రామాంజనేయులు, విశ్వనాథ్‌, పురంధర్‌, విజయలక్ష్మి, కొలమిశేకన్న, రంగన్న, దాసరి శ్రీనివాసులు, పద్మ, కేశవ, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

కళ్యాణదుర్గం రూరల్‌: మాజీ ప్రధాని వాజ్‌పేయి శత జయంతిని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వాస్పత్రిలో రోగులకు బ్రెడ్డు, పండ్లు, వితరణ చేశారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బంగారు మల్లారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్‌ దేవరాజులు మాట్లాడుతూ వాజ్‌పేయి దేశ సర్వతో ముఖాభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారని అన్నారు. జనసేన అసెంబ్లీ ఇనచార్జి రాజేష్‌, నరసయ్య, బీజేపీ ఆదినారాయణ, చక్కా సుబ్రహ్మణ్యం, నరసింహ మూర్తి యాదవ్‌, రామకృష్ణ, సుధాకర్‌, సునీల్‌, వన్నూరుస్వామి పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2024 | 12:12 AM