ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Valmiki : యువతకు వాల్మీకి స్ఫూర్తి

ABN, Publish Date - Oct 18 , 2024 | 12:12 AM

రామాయణాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి వాల్మీకి మహర్షి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. నేటితరం యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అనంతపురం నగరంలో గురువారం వాల్మీకి మహర్షి రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి పాతూరు పవర్‌ ఆఫీస్‌ సమీపంలోని వాల్మీకి విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గుత్తి ...

Minister Savitha, MP, MLAs, TDP leaders and officials paying tribute to Valmiki statue

రామాయణాన్ని ప్రపంచానికి తెలిపిన మహనీయుడు

వాల్మీకుల ‘ఎస్టీ’ పునరుద్ధరణకు చంద్రబాబు, లోకేశ కృషి

బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అనంతలో ఘనంగా రాష్ట్రస్థాయి వాల్మీకి జయంత్యుత్సవాలు

హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, అధికారులు

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): రామాయణాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి వాల్మీకి మహర్షి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. నేటితరం యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అనంతపురం నగరంలో గురువారం వాల్మీకి మహర్షి రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి పాతూరు పవర్‌ ఆఫీస్‌ సమీపంలోని వాల్మీకి విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గుత్తి రోడ్డులోని బల్లా కన్వెన్షన హాల్‌లో నిర్వహించిన వేడుకలలో పాల్గొన్నారు. వాల్మీకి జయంతి వేడుకలను రాష్ట్రస్థాయిలో నిర్వహించడం ద్వారా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై వారు గట్టిగా నిలబడ్డారని అన్నారు. దేవుళ్లు ఎలా


ఉంటారో ఎన్టీఆర్‌ చూపించారని, బడుగు, బలహీన వర్గాల కష్టనష్టాలను గుర్తించిన మహోన్నత నేత ఎన్టీఆర్‌ అని అన్నారు. బీసీలు, వాల్మీకులను గుర్తించడంలో సీఎం చంద్రబాబుకు ఎవరూ సాటి రారని అన్నారు. బడుగు, బలహీన వర్గాలు ఆనందంగా ఉన్నారంటే సీఎం చంద్రబాబు చలవేనని అన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో మళ్లీ ఎన్టీఆర్‌ విదేశీ విద్యను, అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. బీసీలకు బీసీ భవనలను ఏర్పాటు చేశారని అన్నారు. వైసీపీ బీసీ భవనలపై బండ వేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం బీసీ భవనాలను నిర్మించేందుకు సిద్ధమవుతోందని అన్నారు. వేడుకలలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ చాటిన విద్యార్థులకు మంత్రి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందించి అభినందించారు. బీసీ సంక్షేమ శాఖ అధికారులు మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలను సత్కరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్‌ మల్లికార్జున, డీడీ కుష్బూకొఠారీ, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర, టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు అంజినప్ప, అనంతపురం జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీధర్‌ చౌదరి, జడ్పీ మాజీ చైర్మన పూల నాగరాజు, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన తలారి ఆదినారాయణ, కాపు కార్పొరేషన మాజీ డైరెక్టర్‌ రాయల్‌ మురళి, మాజీ మేయర్‌ స్వరూప, మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, వాసంతి సాహిత్య, తెలుగు మహిళ నాయకురాలు సంగా తేజశ్విణి, బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు హరి, జనసేన నాయకుడు ఈశ్వర్‌, డీటీడబ్ల్యూఓ రామాంజనేయులు, బీసీ కార్పొరేషన ఈడీ సుబ్రహ్మణ్యం, ఏబీసీడబ్ల్యూఓలు రంగమ్మ, సుభాషిణి, గంగాద్రి, బీసీ వార్డెన్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మస్తాన, జిల్లా అధ్యక్షుడు మారుతీప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 18 , 2024 | 12:12 AM