ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఊరి బడికి ఉరి!

ABN, Publish Date - Jun 12 , 2024 | 11:52 PM

ఒకప్పుడు ‘మీ ఊరికి ఏం కావాలి’ అని ఏ మంత్రో, నాయకుడో అడిగితే... పిల్లోళ్ల్లు చదువుకోడానికి ‘ఊరిబడి’ కావాలని కోరేవారు. గుడి కన్నా బడే ముఖ్యమని నమ్మేవాళ్లు. ఊళ్లో బడి ఉంటే పిల్లలు బడిబాట పడతారని, చదువుకుని బాగుపడతారన్నది పెద్దల నమ్మకం. కిలోమీటర్ల దూరం నడవకుండా ఊరిలో ఉండే బడికి పిల్లలు ఆడుతూ పాడుతూ వెళ్తారని దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. అలాంటి ప్రాథమిక పాఠశాలలను 2019-2024 మధ్య ఉన్న జగనరెడ్డి ప్రభుత్వం ప్రశ్నార్థకంగా మార్చేసింది. 117 జీవో ...

The people of Kundurpi Mandal, who agitated with the students on the merger of Mayadarlapally, to the gate. Kampa Kotti Protest (File)

అశాస్త్రీయంగా 117 జీవో.. ఇష్టారాజ్యంగా విభజన

ప్రశ్నార్థకమైన ప్రాథమిక పాఠశాలల మనుగడ

జగన తీరుతో చిన్నారులకు నడక భారం

గురువులను వెంటాడి వేధించిన వైసీపీ ప్రభుత్వం

కొత్త ప్రభుత్వం రాకతో పూర్వవైభవంపై ఆశలు

అనంతపురం విద్య, జూన 12: ఒకప్పుడు ‘మీ ఊరికి ఏం కావాలి’ అని ఏ మంత్రో, నాయకుడో అడిగితే... పిల్లోళ్ల్లు చదువుకోడానికి ‘ఊరిబడి’ కావాలని కోరేవారు. గుడి కన్నా బడే ముఖ్యమని నమ్మేవాళ్లు. ఊళ్లో బడి ఉంటే పిల్లలు బడిబాట పడతారని, చదువుకుని బాగుపడతారన్నది పెద్దల నమ్మకం. కిలోమీటర్ల దూరం నడవకుండా ఊరిలో ఉండే బడికి పిల్లలు ఆడుతూ పాడుతూ వెళ్తారని దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. అలాంటి ప్రాథమిక పాఠశాలలను 2019-2024 మధ్య ఉన్న జగనరెడ్డి ప్రభుత్వం ప్రశ్నార్థకంగా మార్చేసింది. 117 జీవో తీసుకొచ్చి విలీనం పేరుతో ప్రాథమిక పాఠశాలలను విభజించి, విచ్ఛిన్నం చేయాలని చూసింది. ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను ఊరికి కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసింది. ఫలితంగా వేలాది మంది విద్యార్థుల కిలోమీటర్ల దూరం నడవలేక తీవ్ర


అవస్థలు పడ్డారు. విలీనం పేరుతో ముక్కలు చేశారు. బడిలో ఉండే 1,2 క్లాసులకు అందనంగా అంగన్వాడీ స్కూళ్ల పిల్లలు వచ్చి కలుస్తారని పేర్కొన్నారు. వాటికి వైఎస్‌ఆర్‌ ఫౌండేషన స్కూళ్లు అని పేరు పెట్టారు. పిల్లలు వచ్చి చేరకపోగా ఉన్నవారు బయటకు వెళ్లాల్సి వచ్చింది. పౌండేషన స్కూళ్లన్నీ పేపర్లకు పరిమితమయ్యాయి. క్షేత్రస్థాయిలో ఘోరంగా విఫలమయ్యాయి. విలీనం దెబ్బకు వందలాది బడులను మూసేశారు. దీంతో కొందరు డ్రాపౌట్లుగా మారితే..మరికొందరు ప్రైవేట్‌ పాఠశాలల బాట పట్టారు. ఉపాధ్యాయులు సైతం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది. దీంతో ఉపాధ్యాయుల్లో ఆశలు చిగురించాయి. ఊరిబడికి ఊపిరి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యమించిన పల్లెవాసులు

ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను దూరంగా ఉండే ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ఊరికి దూరంగా ఉండే పాఠశాలలకు వెళ్లే క్రమంలో కొన్ని చోట్ల వాగులు, వంకలు, రహదారులు పిల్లలు చాటాల్సి వచ్చింది. పైగా పసి పిల్లలను నడిచి పక్క ఊళ్లో ఉండే బడులకు వెళ్లడం చూసిన జనాలు మండిపోయారు. ఊళ్లో బడి ఉండి కూడా...పిల్లలకు పక్క ఊరికి ఎలా నడిపించి పంపగలం, ఇదేం విలీనం, మాకొద్దు అంటూ ఉద్యమించారు. పాఠశాలల గేట్లకు తాళాలు వేసి, వాకిళ్లకు కంపలు కొట్టి నిరసన వ్యక్తం చేశారు. రోజుల తరబడి బంద్‌ చేసి ఉపాధ్యాయులను వెనక్కు పంపారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో విలీనంపై జగన ప్రభుత్వం వెనక్కు తగ్గింది.


విద్యార్థులు, గురువులపై ప్రభావం

గత ప్రభుత్వం అటు విద్యార్థులకు, ఇటు గురువులకు తీరని నష్టాన్ని కలిగించింది. సర్దుబాటు పేరుతో ఉపాధ్యాయులతో ఆడుకుంది. 3,4,5 తరగతులను తరలించడంతో ఇతర ఊళ్ల్లకు వెళ్లేందుకు విద్యార్థులు విముఖత చూపారు. ప్రాథమిక పాఠశాల నుంచి వెళ్లిన 3,4,5 తరగతుల విద్యార్థులు ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఇమడలేక విపరీతంగా డ్రాపౌట్లు పెరిగాయి. వేలాది మంది విద్యార్థులు కార్పొరేట్‌, ప్రైవేట్‌ స్కూళ్లకు వెళ్లడంతో జగన పరోక్షంగా ఆయా సంస్థలకు లబ్ధి చేకూర్చారు. విలీనం పొందిన పాఠశాలల్లో తరగతి గదులు, సబ్జెక్ట్‌ టీచర్ల కొరత కూడా ఇబ్బందికరంగా మారింది. కొన్ని చోట్ల ప్రధానోపాధ్యాయుడు, వ్యాయామ టీచర్‌ పోస్టులు రద్దయ్యాయి. దీనిపై ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. అయినా... మొండి జగన.. అవేవీ పట్టవన్నట్టుగా ముందుకెళ్లాడు.

ప్రాథమిక పాఠశాలలకు పూర్వవైభవం వచ్చేనా...?

టీడీపీ అధినేత చంద్రబాబు సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుండటంతో ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీచర్ల పాలిట శాపంగా మారిన 117 జీవో రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇంగ్లీష్‌ మీడియంతోపాటు, తెలుగు మీడియం కూడా అమలు చేస్తారని ఆశిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఉన్నత పాఠశాలలకు హెచఎం, వ్యాయామ టీచర్‌ పోస్టులను ఇవ్వాలని కోరుతున్నారు. వందలాది ప్రాథమిక పాఠశాలలకు మళ్లీ జవసత్వాలు వస్తాయని ఆక్షాంక్షిస్తున్నారు.


నాడు-నేడు పాఠశాలలను నిరుపయోగం చేశారు

పాఠశాలల విలీనం వల్ల అన్నిరకాలుగా నష్టమే జరిగింది. అప్పటి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన నాడు-నేడు పాఠశాలలు సైతం నిరుపయోగంగా మారాయి. రేషనలైజేషన పేరుతో ఉపాధ్యాయులను అనేక రకాలు గా ఇబ్బందులకు గురిచేశారు. వెంటనే 117 జీవోను రద్దు చేయాలి. ప్రైమరీ స్కూళ్లకు ప్రాణం వచ్చేలా మళ్లీ వాటిని యథాతథంగా కొనసాగించాలి.

- అక్కులప్ప, ఏపీపీఈటీ అండ్‌ ఎస్‌ఏపీఈ అసోసియేషన జిల్లా అధ్యక్షుడు

వేలాది పోస్టులు రద్దు చేశారు

రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల విలీనం వల్ల ప్రాథమిక విద్యకు చాలా నష్టం వచ్చింది. ఆ పాఠశాలల విద్యార్థులు నడవలేక డ్రాప్‌ అవుట్లుగా మారారు. విద్యార్థుల సంఖ్య తగ్గడం వల్ల టీచర్‌ పోస్టులు కూడా రద్దు చేశారు. టీచర్‌ పోస్టులు భర్తీ లేక...బీఈడీ, డీఈడీ చేసిన వారు సైతం నిరుద్యోగులుగా రోడ్డున పడ్డారు. విద్యా రంగానికి ప్రాణ సమానమైన ప్రాథమిక పాఠశాలలు నిలబడాలంటే....117 జీవోను రద్దు చేయాలి. విద్యారంగానికి కొత్త ఊపిరులూదాలి.

- విజయ్‌భాస్కర్‌, ఏపీఎస్‌ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు


మాతృభాషలో బోధన సాగాలి

ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఇతర మేధావులు ఎవరితోనూ చర్చించకుండా ఏకపక్షంగా జీవో 117 తీసుకొచ్చారు. దీంతో విద్యారంగం నిర్వీర్యమైంది. వేలాది ఉపాధ్యాయ పోస్టులు రద్దయ్యాయి. ప్రైమరీలో 1,2 క్లాసులు మాత్రమే ఉంచి, ఒక టీచర్‌ను ఉంచడం చూసిన పేరెంట్స్‌ పిల్లలను పంపేందుకు అయిష్టత చూపారు. ఫలితంగా లక్షలాది మంది పిల్లలు ప్రైవేట్‌ స్కూళ్లకు తరలి వెళ్లారు. రానున్న ప్రభుత్వం జీవో 117ను రద్దు చేయాలి. మాతృభాషలో బోధన అందించేలా చర్యలు తీసుకోవాలి. సమాంతరంగా ఇంగ్లీష్‌ మీడియం కూడా నడపాలి

- అశోక్‌కుమార్‌, ఏపీటీఎఫ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు

ఆ జీవోను రద్దు చేయాలి

రాష్ట్రంలో జగన ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలను ప్రశ్నార్థకంగా మార్చింది. వెంటనే జీవో 117 రద్దు చేయాలి. తరగతి గదిలో విద్యార్థులు ప్రైమరీలో 30 మందికి మించితే, 6,7,8 క్లాసుల్లో విద్యార్థుల సంఖ్య 35కు మించితే, 9,10 క్లాసుల్లో విద్యార్థుల సంఖ్య 40కి మించితే అదనపు సెక్షన ఇవ్వాలి. ఉన్నత పాఠశాలల్లో ప్రతి 5 సెక్షన్లకూ ఏడుగురు స్కూల్‌ అసిస్టెంట్లు, ఒక వ్యాయామ టీచర్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలి. విద్యాహక్కు చట్టం మేరకు టీచర్‌ వారానికి 30 నుంచి 32 పిరియడ్లు బోధించేలా ఏర్పాటు చేయాలి.

- హరికృష్ణ, ఎన్టీఏ, రాష్ట్ర అధ్యక్షుడు


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 12 , 2024 | 11:52 PM

Advertising
Advertising