ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Postal Ballots: వైసీపీని వణికించిన ఓట్లు

ABN, Publish Date - Jun 06 , 2024 | 12:15 AM

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వణికించాయి. ఊహించినట్లుగానే ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటెత్తారు. వైసీపీ అభ్యర్థులు సైతం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను తగ్గించేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. ఓట్లను ఇనవ్యాలీడ్‌ చేయించేందుకు కోర్టులకు ఎక్కారు. అన్ని అడ్డంకులను దాటుకుని.. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లు రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయినా, ఇన వ్యాలీడ్‌ ఓట్లు భారీగానే నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 3,582 పోస్టల్‌ ఓట్లు చెల్లలేదు. ...

Employees and teachers explaining to District Election Officer Vinod Kumar about the difficulties of postal voting on May 4 in Anantapur.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల చుట్టూ కుట్రలు

రికార్డు స్థాయిలో ఓటెత్తిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు

పోలైన ఓట్లు.. 26,962చెల్లనివి 3,582

అనంతపురం టౌన, జూన 5: అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వణికించాయి. ఊహించినట్లుగానే ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటెత్తారు. వైసీపీ అభ్యర్థులు సైతం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను తగ్గించేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. ఓట్లను ఇనవ్యాలీడ్‌ చేయించేందుకు కోర్టులకు ఎక్కారు. అన్ని అడ్డంకులను దాటుకుని.. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లు రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయినా, ఇన వ్యాలీడ్‌ ఓట్లు భారీగానే నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 3,582 పోస్టల్‌ ఓట్లు చెల్లలేదు.


అడుగడుగునా అడ్డంకులు

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లకు ఈ ఎన్నికల్లో అనేక అవాంతరాయలు ఎదురయ్యాయి. వైసీపీ అభ్యర్థులు చాలాచోట్ల ప్రలోభాలకు దిగారు. కొన్నిచోట్ల బెదిరించారు. ఆర్వోలపైనా తీవ్రంగా ఒత్తిడి తెచ్చారనే ప్రచారం సాగింది. దీంతో టీడీపీ కూటమి నాయకులు, ఉపాధ్యాయులు అప్రమత్తమయ్యారు. ఎన్నికల కమిషనకు ఫిర్యాదు చేశారు. ఫెసిలిటీ కేంద్రాల్లో పేర్లు కనిపించకపోవడం, సరైన సమాచారం ఇవ్వకపోవడం వంటి అంశాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎన్నికల కమిషన స్పందించింది. ఎన్నికల విధులకు నియమితులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంతర్‌జిల్లా ఉద్యోగులు, అత్యవసర సేవలు అందించే ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించింది. దీంతో జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనన్ని పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలయ్యాయి. ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 26,962 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేశారు.


వేలాదిగా ఇనవ్యాలీడ్‌

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపులో 23,380 ఓట్లు మాత్రమే చెల్లాయి. 3,582 ఓట్లు ఇనవ్యాలీడ్‌ అయ్యాయి. గుంతకల్లు నియోజకవర్గంలో 3,612 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోల్‌ అయ్యాయి. ఇందులో 2,890 ఓట్లు లెక్కింపునకు అర్హత సాధించాయి. అత్యధికంగా 722 ఓట్లు ఇనవ్యాలీడ్‌ అయ్యాయి. శింగనమల నియోజకవర్గంలో 2,450 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోల్‌ కాగా.. 1,856 ఓట్లు చెల్లాయి. 594 ఓట్లు చెల్లలేదు. రాప్తాడు నియోజకవర్గంలో 4,338 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోల్‌ కాగా, 3,773 ఓట్లు చెల్లాయి. 565 ఓట్లు చెల్లలేదు. రాయదుర్గంలో 1,671 ఓట్లకుగాను 1,518 చెల్లాయి. 382 ఓట్లు ఇనవ్యాలీడ్‌ అయ్యాయి. తాడిపత్రిలో 2,702 ఓట్లకుగానూ 2,275 ఓట్లు చెల్లాయి. 487 చెల్లలేదు. ఉరవకొండలో 2,544 ఓట్లకుగానూ 2,162 ఓట్లు చెల్లాయి, 282 ఓట్లు చెల్లలేదు. అనంతపురం అర్బనలో అత్యధికంగా 6,971 ఓట్లు పోల్‌ అయ్యాయి. 6,557 ఓట్లు చెల్లాయి. 414 ఓట్లు మాత్రమే ఇనవ్యాలీడ్‌ అయ్యాయి. కళ్యాణదుర్గంలో 2,614 ఓట్లకుగాను 2,349 ఓట్లు చెల్లాయి. 265 ఓట్లు చెల్లలేదు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 06 , 2024 | 12:15 AM

Advertising
Advertising