MEDICO : క్రమశిక్షణతో మెలగండి
ABN, Publish Date - Oct 15 , 2024 | 12:13 AM
వైద్యవృత్తి ఎంతో విలు వైనదని, అందరూ క్రమశిక్షణతో ఉంటూ కళాశాలకు మంచిపేరు తీసుకు రావాలని మెడికల్ కలాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యాలరావు నూతన మెడికోలకు హితబోధ చేశారు. కళాశాల ఆడిటోరియంలో సోమవారం 2024-25 విద్యాసంవత్సరం నూతన ఎంబీబీఎస్ విద్యార్థులకు ఓరియెంటేష న సదస్సు నిర్వహించారు.
నూతన ఎంబీబీఎస్ విద్యార్థులకు ప్రిన్సిపాల్ హితబోధ
అనంతపురం టౌన, అక్టోబరు14( ఆంద్రజ్యోతి) : వైద్యవృత్తి ఎంతో విలు వైనదని, అందరూ క్రమశిక్షణతో ఉంటూ కళాశాలకు మంచిపేరు తీసుకు రావాలని మెడికల్ కలాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యాలరావు నూతన మెడికోలకు హితబోధ చేశారు. కళాశాల ఆడిటోరియంలో సోమవారం 2024-25 విద్యాసంవత్సరం నూతన ఎంబీబీఎస్ విద్యార్థులకు ఓరియెంటేష న సదస్సు నిర్వహించారు. ఈసందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ... అనంత వైద్య కళాశాలకు మంచిపేరు ఉందన్నారు. ఇక్కడ విద్యార్థులకు అవసరమైన వసతులు, సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదవడం, క్రమశిక్షణతో మెలగడం నేర్చుకోవాలన్నారు. తల్లిదం డ్రుల నమ్మకాన్ని వమ్ము చేయ కుండా ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపాల్ డాక్టర్ షారోనసోనియా, సీనియర్ ప్రొపెషర్లు డాక్టర్స్ నవీనకుమార్, షంషాద్‌బేగం, మదు,చలపతి, శ్యామ్‌ప్రసాద్, పద్మశ్రావణి తదితరలు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Oct 15 , 2024 | 12:13 AM