ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nimmala Ramanaidu : ప్రతి ఎకరాకు నీరిస్తాం

ABN, Publish Date - Sep 23 , 2024 | 12:55 AM

జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ఆదివారం ఆయన జిల్లాకు వచ్చారు. ముందుగా హంద్రీనీవా ప్రాజెక్టు పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్‌ను సందర్శించారు. అనంతరం అనంతపురానికి వచ్చిన మంత్రి రోడ్లు, భవనాల అతిథి గృహంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ర్టానికి జలవనరులే అత్యంత కీలకమని, ముఖ్య మంత్రి ...

Minister Nimmala Ramanaidu talking to the media

హంద్రీనీవా కాలువను వెడల్పు చేస్తాం

వచ్చే సీజనకు 3850 క్యూసెక్కుల నీటిని పారిస్తాం

జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు

అనంతపురం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ఆదివారం ఆయన జిల్లాకు వచ్చారు. ముందుగా హంద్రీనీవా ప్రాజెక్టు పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్‌ను సందర్శించారు. అనంతరం అనంతపురానికి వచ్చిన మంత్రి రోడ్లు, భవనాల అతిథి గృహంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ర్టానికి జలవనరులే అత్యంత కీలకమని, ముఖ్య మంత్రి చంద్రబాబు ఆదేశాలతో తాను ప్రాజెక్టుల సందర్శన చేపట్టినట్లు తెలిపారు. ప్రజలకు తాగు నీరు, రైతులకు ప్రతి ఎకరాకు సాగు నీరందించాలన్నదే తమ ప్రభుత్వ ప్రాధాన్యం అన్నారు. సీమను రతనాల సీమగా చేయాలన్న


సంకల్పంలో భాగంగానే నాడు నందమూరి తారక రామారావు తెలుగు గంగ, గాలేరు నగరి తదితర ప్రాజెక్టులు చేపట్టారన్నారు. కాగా ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన ప్రాజెక్టులన్నింటినీ భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. సీమ బిడ్డ అని చెప్పుకోవడమే గానీ రాయలసీమకు అత్యంత ద్రోహం చేసిన వ్యక్తి జగన అన్నారు. చంద్రబాబు తన గడిచిన ఐదేళ్ల పాలనలో హంద్రీనీవాకు రూ.4200 కోట్లు ఖర్చు పెడితే జగన కేవలం రూ.500 కోట్లు ఖర్చుపెట్టారన్నారు. ప్రాజెక్టులపై జగన నిర్లిప్తత, నిర్లక్ష్యం, దగా, ద్రోహానికి ఇదే పరాకాష్ట అన్నారు.

ఐదేళ్లూ జగన మొద్దునిద్ర

కృష్ణా జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. హంద్రీనీవా ద్వారా 3850 క్యూసెక్యుల నీటిని తెచ్చుకునేందుకు అవసరమైన పంపులున్నా జగన వాటిని ఉపయోగించలేదన్నారు. ప్రస్తుతం 1900 క్యూసెక్యులు మాత్రమే నీరువస్తోందన్నారు. ఫేజ్‌-2 ద్వారా 700 క్యూసెక్కులు నీరువస్తోంద న్నారు. ఇరిగేషన ప్రాజెక్టుల విషయంలో జగన ఐదేళ్లు మొద్దు నిద్ర పోయారని విమర్శించారు. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ వర్గాల సహకారంలో హంద్రీనీవా ప్రధాన కాలువ ద్వారా వచ్చే సీజనకు 3850 క్యూసెక్యుల నీటిని పారిస్తామని హామీ ఇచ్చారు. హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు చేపట్టి ఫేజ్‌ - 2 కింద కదిరి, పుట్టపర్తికి నీరు ఇస్తామన్నారు. నాడు గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీళ్లు ఇవ్వడం వల్లే జిల్లాకు కియ పరిశ్రమ వచ్చిందన్నారు. హంద్రీనీవా విస్తరణకు సంబంధించిన అంశంపై ఈనెలాఖరు లోపు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, ముందుకు సాగుతామన్నారు. కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌, అమిలినేని సురేంద్రబాబు, బండారు శ్రావణి శ్రీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ చౌదరి పాల్గొన్నారు.

వైసీపీ పాలనలో ఇరిగేషన నిర్వీర్యం

బెళుగుప్ప : జగన్మోహనరెడ్డి నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో ఇరిగేషన వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. వైసీపీ పాలన ఐదేళ్లలో ఇరిగేషన వ్యవస్థ 25 ఏళ్లు వెనక్కిపోయిందని పేర్కొన్నారు. జీడిపల్లి రిజర్వాయరును ఎమ్మెల్యేల కాలవ శ్రీనివాసులు సురేంద్రబాబుతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. నీటి సామర్థ్యం, ఇనఫ్లో, కాలువ ఆధునికీకరణ తదితర వివరాలను హెచఎనఎ్‌సఎ్‌స ఎస్‌ఈ దేసేనాయక్‌, డీఈ విశ్వనాథరెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పట్టించుకోనందున హంద్రీనీవా ఆయకట్టు రైతులకు అన్యాయం జరిగిందన్నారు. హంద్రీనీవా పథకం ద్వారా 60 టీఎంసీలు నీరు వాడుకోవాల్సి ఉండగా 25 టీఎంసీలు మాత్రమే వాడుతున్నామని తెలిపారు. భైరవానితిప్ప ప్రాజెక్టుకు నీరిచ్చి 114 చెరువులకు నీరందేలా చేస్తామని హామీ ఇచ్చారు. కరువు జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. కాగా రిజర్వాయరు ఊటనీటితో గ్రామానికి ప్రమాదం పొంచి ఉందని ఆదుకోవాలంటూ గ్రామ సర్పంచ వెంకటనాయుడు టీడీపీ నాయకులు మంత్రికి విన్నవించారు. సమస్య పరిష్కరిస్తామని, ఆందోళన చెందకండి అని మంత్రి వారికి హామీ ఇచ్చారు.

బీటీపీని పూర్తి చేయండి

మంత్రికి ఎమ్మెల్యే అమిలినేని వినతి

కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం ప్రాంతానికి జీవనాడైన బీటీపీ(భైరవానితిప్ప ప్రాజెక్టు)ని సమగ్రంగా పూర్తి చేసి, రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు.. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు విన్నవించారు. జీడిపల్లి రిజర్వాయర్‌ పరిశీలనకు ఆదివారం వచ్చిన మంత్రిని ఎమ్మెల్యేతోపాటు నియోజకవర్గంలోని వందలాది మంది రైతులు కలిసి సమస్యను విన్నవించారు. వెనుకబడిన ఈ ప్రాంతంలో చాలామంది రైతులు వ్యవసాయంపైనే ఆధారపడ్డారని, నియోజకవర్గంలోని 114 చెరువులను బీటీపీ ద్వారా నీటితో నింపాలని కోరారు. స్పందించిన మంత్రి మాల్యాల నుంచి జీడిపల్లి వరకు హంద్రీనీవా కాలువను వెడల్పు చేసి, కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 23 , 2024 | 12:55 AM