MLA DAGGUPATI : ప్రజలకు అన్నివిధాలా అండగా ఉంటాం
ABN, Publish Date - Oct 23 , 2024 | 12:13 AM
వరద ప్రభావిత ప్రాంతాల్లోని కాలనీల ప్రజలకు అన్నివిధాల అండగా ఉంటామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అర్బన నియోజకవర్గం పరిధి లోని అనంతపురం రూరల్ పంచాయతీ రామకృష్ణకాలనీ, నారా లోకేశ కాలనీ, సుశీలరెడ్డి కాలనీ, తిమ్మానాయుడు కాల నీ, అభ్యుదయ కాలనీల్లోకి వరదనీరు చేరింది.
ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
అనంతపురం రూరల్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): వరద ప్రభావిత ప్రాంతాల్లోని కాలనీల ప్రజలకు అన్నివిధాల అండగా ఉంటామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అర్బన నియోజకవర్గం పరిధి లోని అనంతపురం రూరల్ పంచాయతీ రామకృష్ణకాలనీ, నారా లోకేశ కాలనీ, సుశీలరెడ్డి కాలనీ, తిమ్మానాయుడు కాల నీ, అభ్యుదయ కాలనీల్లోకి వరదనీరు చేరింది. దీంతో ఆయా కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే స్థానిక నాయకులు, మండల అధికారులతో కలసి ఆయా కాలనీల్లో పర్యటించారు. బాధితులను పరామ ర్శించారు. ఇళ్లలోకి నీరు చేరి భారీగా నష్టపోయామని కాలనీ వాసులు ఆయనతో ఆవేదన వ్యక్తం చేశారు. అధైర్యపడ వద్దని ప్రభుత్వం అదుకుంటుందని భరో సా ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ..వరద ప్రభావిత ప్రాంతాలను ముందుగానే అప్రమత్తం చేయడంతో నష్ట తీవ్రత తగ్గింద న్నారు. మరోవైపు బాధితులకు పునరావసకేంద్రాలు ఏర్పాటు చేసి, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించినట్లు తెలిపారు. రెవెన్యూ, సచివాలయ సిబ్బంది వరద ప్రభావిత కాలనీల్లో ఉంటారని, స్థానికులకు ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందిస్తారన్నారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ హరికుమార్, టీడీపీ రాష్ట్ర నాయకులు జయరాంనాయుడు, సర్పంచు ఉదయశంకర్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Oct 23 , 2024 | 12:13 AM