KSR High School: ఏమిటి.. ఇదంతా?
ABN, Publish Date - Dec 05 , 2024 | 12:51 AM
జిల్లా కేంద్రంలోని కేఎస్‌ఆర్ హైస్కూల్‌లో జరిగిన ఘటనపై లోతైన దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీఎంఓ అధికారులు ఆదేశించారు. కేఎ్‌సఆర్ హైస్కూల్‌లో పలువురు విద్యార్థులను ఓ టీచర్ లైంగికంగా వేధిస్తున్నట్లు ఆడియోలు బయటకు వచ్చాయి. ఓ మహిళా టీచరే ఈ వ్యవహారం అంతా నడిపించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై ‘బడిలో లైంగిక వేధింపులు?’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో బుధవారం కథనం ప్రచురితమైంది. దీంతో జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ ఫైర్ అయ్యారు. వెంటనే విచారించి నివేదిక ...
కేఎ్‌సఆర్ ఘటనపై లోతైన దర్యాప్తు చేయండి: కలెక్టర్
ఐసీడీఎస్ పీడీ, ఎంఈఓకు ఆదేశం
డీఈఓ, హెచఎంను పిలిపించిన
న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి
అనంతపురం విద్య, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని కేఎస్‌ఆర్ హైస్కూల్‌లో జరిగిన ఘటనపై లోతైన దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీఎంఓ అధికారులు ఆదేశించారు. కేఎ్‌సఆర్ హైస్కూల్‌లో పలువురు విద్యార్థులను ఓ టీచర్ లైంగికంగా వేధిస్తున్నట్లు ఆడియోలు బయటకు వచ్చాయి. ఓ మహిళా టీచరే ఈ వ్యవహారం అంతా నడిపించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై ‘బడిలో లైంగిక వేధింపులు?’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో బుధవారం కథనం ప్రచురితమైంది. దీంతో జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ ఫైర్ అయ్యారు. వెంటనే విచారించి నివేదిక
ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఐసీడీఎస్ పీడీ, బుక్కరాయసముద్రం ఎంఈఓను విచారణాధికారులుగా నియమించారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, బుక్కరాయసముద్రం ఎంఈఓ నవీద్ హైస్కూల్‌లో బుధవారం ఉదయం నుంచి విచారణ చేశారు. సుమారు 11 మంది విద్యార్థినులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు టీచర్లు, హెచఎంను వారు విచారించారు. వివరాలను వారి నుంచి లిఖితపూర్వకంగా రాయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక విచారణ తర్వాత అవసరమైతే గురువారం కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది.
డీఈఓ విచారణలో పెదవి విప్పని టీచర్లు
కేఎ్‌సఆర్ ఘటనపై డీఈఓ ప్రసాద్‌బాబు వెంటనే స్పందించారు. ఆయన మధ్యాహ్నం హైస్కూల్‌కు వెళ్లి.. టీచర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. లైంగిక వేధింపులు, వరుసగా జరుగుతున్న వ్యవహారాల గురించి ఆరా తీసినట్లు తెలిసింది. అయితే మహిళా టీచర్లు ఎవరూ పెదవి విప్పలేదని తెలిసింది. ఏం మాట్లాడితే తమకు ఏం సమస్య వస్తుందోనన్న భయంతో ఎవరూ మాట మాట్లాడలేదని సమాచారం. ఎవరు తప్పు చేసినా... చర్యలు కఠినంగా ఉంటాయని డీఈఓ వారిని హెచ్చరించినట్లు తెలిసింది. ప్రశాంతంగా ఉన్న పాఠశాలలో ఇలాంటి వ్యవహారాలను ఎవరు ప్రోత్సహించినా ఉపేక్షించేది లేదని, ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తర్వాత డీఈఓ ప్రసాద్‌బాబు హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. లైంగిక వేధింపుల ఘటనపై జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సైతం స్పందించారు. డీఈఓ ప్రసాద్ బాబు, కేఎ్‌సఆర్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు నారాయణను వెంటనే తన వద్దకు రావాలని బుధవారం మధ్యాహ్నం ఆదేశించారు. వారు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఆయన్ను కలిశారు. స్కూల్‌లో ఏం జరిగింది...?, ఎలా జరిగిందన్న అంశాలను ఆయన అధికారులతో ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, రెండు రోజుల్లో నివేదిక అందజేస్తామని అధికారులు ఆయనకు తెలియజేసినట్లు సమాచారం. ఈ ఘటనపై సీఎంఓ నుంచి కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది. కేఎ్‌సఆర్ హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులను ఆంధ్రజ్యోతి కథనం ఉక్కిరిబిక్కిరి చేసింది. విచారణాధికారులు కలెక్టర్‌కు గురువారం నివేదిక అందజేస్తారని సమాచారం.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Dec 05 , 2024 | 12:51 AM