ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Transformers : ఎప్పుడు వస్తాయో..!

ABN, Publish Date - Oct 03 , 2024 | 12:00 AM

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది రైతుల పరిస్థితి. బోరు బావుల్లో పుష్కలంగా నీరుంది. ప్రభుత్వం విద్యుత సరఫరా చేస్తోంది. వ్యవసాయ కనెక్షన్లు మంజూరయ్యాయి. ట్రాన్సఫార్మర్లను కూడా ఇచ్చారు. కానీ కేబుల్‌, కండక్టర్ల సరఫరా లేకపోవడంతో మిగిలినవన్నీ వృథా అవుతున్నాయి. పంటల సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాకు ఆరు నెలలుగా కండక్టర్‌, కేబుల్‌ సరఫరా నిలిచిపోయింది. విద్యుత శాఖ అధికారులు రైతులకు సమాధానం ...

కేబుల్‌, కండక్టర్ల కొరత

మార్చి నుంచి ఆగిన సరఫరా

ట్రాన్సఫార్మర్లు వచ్చినా.. నిష్ప్రయోజనం

వ్యవసాయానికి విద్యుతలేక రైతుల అవస్థ

అనంతపురం రూరల్‌/ఆత్మకూరు, అక్టోబరు 2: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది రైతుల పరిస్థితి. బోరు బావుల్లో పుష్కలంగా నీరుంది. ప్రభుత్వం విద్యుత సరఫరా చేస్తోంది. వ్యవసాయ కనెక్షన్లు మంజూరయ్యాయి. ట్రాన్సఫార్మర్లను కూడా ఇచ్చారు. కానీ కేబుల్‌, కండక్టర్ల సరఫరా లేకపోవడంతో మిగిలినవన్నీ వృథా అవుతున్నాయి. పంటల సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాకు ఆరు నెలలుగా కండక్టర్‌, కేబుల్‌ సరఫరా నిలిచిపోయింది. విద్యుత శాఖ అధికారులు రైతులకు సమాధానం చెప్పలేకున్నారు. ఏ రైతు వెళ్లినా.. త్వరలోనే వస్తుందని సర్ది చెప్పి పంపుతున్నారు. విద్యుత శాఖ కార్పొరేట్‌ కార్యాలయం నుంచి మెటీరియల్‌


సరఫరా ఆగిపోయింది. మార్చి నుంచి ఈ పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాకు వేల కిలో మీటర్ల కండక్టర్‌, కేబుల్‌ అవసరమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లకు నాలుగు వేలకు పైగా ట్రాన్సఫార్మర్లు అవసరం. ఇప్పటికే మంజూరైన వ్యవసాయ కనెక్షన్లకు, కొత్తవాటికి 3,500 కిలో మీటర్ల కండక్టర్‌, 2,600 కిలోమీటర్లు కేబుల్‌ అవసరం.

అన్నదాతకు అవస్థలు

కండక్టర్‌, కేబుల్‌ లేనికారణంగా ఉమ్మడి జిల్లా రైతులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటసాగుకు అన్నీ ఏర్పాట్లు చేసుకుని.. విద్యుత సరఫరా కోసం నెలల తరబడి వేచి చూస్తున్నారు. వందల సంఖ్యలో రైతులు ట్రాన్సఫార్మర్లను పొలాల్లో దించుకున్నారు. కండక్టర్‌, కేబుల్‌ కోసం ఎదురుచూస్తున్నారు. మరికొందరు రైతులు ట్రాన్సఫార్మర్లు మంజూరైనా తీసుకోవడం లేదు. దీంతో సబ్‌స్టేషన్లలో ట్రాన్సఫార్మర్లు పేరుకుపోయాయి.

ఉన్నతాధికారుల దృష్టికి...

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం విద్యుత శాఖ ప్రధాన కార్యాలయం నుంచి కండక్టర్‌, కేబుల్‌ సరఫరా కావడం లేదు. జిల్లా పరిస్థితిని సంస్థ ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పది రోజుల్లో కండక్టర్‌, కేబుల్‌ వచ్చే అవకాశం ఉంది. రైతులకు సరఫరా చేసి సమస్యను పరిష్కరిస్తాం.

- సంపతకుమార్‌, ఎస్‌ఈ, విద్యుతశాఖ


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Oct 03 , 2024 | 12:00 AM