ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP MINISTERS: జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

ABN, Publish Date - Sep 16 , 2024 | 11:53 PM

జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు వారధులని, వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని రాష్ట్ర మంత్రులు సత్యకుమార్‌, సవిత పేర్కొన్నారు. జిల్లాకేంద్రం లోని సాయిఆరామంలో సోమవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.

Speaking Minister Savita

పుట్టపర్తిరూరల్‌, సెప్టెంబరు 16: జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు వారధులని, వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని రాష్ట్ర మంత్రులు సత్యకుమార్‌, సవిత పేర్కొన్నారు. జిల్లాకేంద్రం లోని సాయిఆరామంలో సోమవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులతో పాటు ఎంపీ పార్థసారథి, మడకశిర ఎమ్మెల్యే రాజు, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి హాజరై ప్రసంగించారు. మంత్రి సత్యకుమార్‌ మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజల పక్షాన పోరాడాలని తెలిపారు. అర్హత కలిగిన ప్రతిజర్నలిస్టుకు అక్రిడిటేషన ఇస్తామన్నారు. హెల్త్‌కార్డులకు సంబంధించి సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి, ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహి స్తామన్నారు. పత్రికారంగంలో జవాబుదారి తనం ఉండాలన్నారు. ఏమాత్రం చిత్తశుద్ధి లేని జగన తన పాలనా కాలంలో వైద్య కళాశాల నిర్మాణాలను 25శాతం కూడా పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. ఏపీలో 17 వైద్య కళాశాల నిర్మాణాలలో హడావుడి తప్ప చేసిందేమి లేదన్నారు. ఫేజ్‌-2లో మదనపల్లి, ఆదోని, మార్కాపురం, పులివెందుల, పాడేరు వైద్యకళాశాలలను ప్రారంభించి పనుల పూర్తి చేయకపోవడంతో రాష్ట్రంలోని వైద్య విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. జాతీయ వైద్యకమిషన బృందం జూన 24న కళాశాలను తనిఖీచేసి కళాశాల పనుల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. అసుపత్రుల నిర్మాణంలో మౌలిక వసతులు పెండింగ్‌లో ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసింద న్నారు. నియామకాలు కూడా చేపట్టక పోవడంతో పులివెందులలో కూడా మెడికల్‌ కాలేజీలో బోధనా నసిబ్బంది కొరత ఉందని తెలిపారు. వైద్యకళాశాలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, జగనప్రభుత్వం వాటికి ఖర్చుచేసిన నిధులపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని, నీవు నీమంది మార్బలంతో చర్చకు రావాలని సవాల్‌ చేశారు. మరో మంత్రి సవిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతిఒక్కరికి తెలిసేలా జర్నలిస్టులు కృషి చేయాలన్నా రు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధితో పాటు లోటుపాట్లను కూడా తెలియచేయాలన్నారు. మడకశిర ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ గతప్రభుత్వం పాలనలో పలుచోట్ల జర్నలిస్టులపై దాడులు జరిగాయని, ఈప్రభుత్వంలో జర్నలిస్టుల రక్షణకు అన్నివిధాలా బాధ్యత తీసుకుంటామన్నారు. మాజీమంత్రి పల్లె మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజాభివృద్ధి కోసం పాటుపడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జర్నలిస్టు యూనియనప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 11:53 PM

Advertising
Advertising