Share News

IQBAL : మైనార్టీలను మోసం చేసిన వైసీపీ

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:20 AM

నా మైనార్టీలు అంటూ వైసీపీ ప్రభు త్వం వారిని మోసం చేసిందని మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్‌ పేర్కొన్నారు. ఆయన ఆదివారం చిలమ త్తూరులో ఆయన పర్యటించి ముస్లిం మైనార్టీలను టీడీపీకి ఓటు వేయాలని అభ్యర్థిం చారు. చిలమత్తూరులో టీడీపీ నాయకులు నాగరాజుయాదవ్‌, లక్ష్మీనారాయణ యా దవ్‌, దేమకేతేపల్లి అంజినప్ప, రంగారెడ్డి, సోమశేఖర్‌, బయపరెడ్డి, బాలాజీ, చంద్ర మోహన, మాజీ ఎంపీటీసీ సూర్యనారాయణ, టేకులోడు బయపరెడ్డి తదితరలు మైనార్టీ నాయకులతో సమావేశాన్ని ఏర్పాటుచేశారు.

IQBAL : మైనార్టీలను మోసం చేసిన వైసీపీ
Iqbal invites Councilor Rahmatabi to join the party by wrapping a scarf

మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్‌

హిందూపురం/ చిలమత్తూరు, ఏప్రిల్‌ 28: నా మైనార్టీలు అంటూ వైసీపీ ప్రభు త్వం వారిని మోసం చేసిందని మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్‌ పేర్కొన్నారు. ఆయన ఆదివారం చిలమ త్తూరులో ఆయన పర్యటించి ముస్లిం మైనార్టీలను టీడీపీకి ఓటు వేయాలని అభ్యర్థిం చారు. చిలమత్తూరులో టీడీపీ నాయకులు నాగరాజుయాదవ్‌, లక్ష్మీనారాయణ యా దవ్‌, దేమకేతేపల్లి అంజినప్ప, రంగారెడ్డి, సోమశేఖర్‌, బయపరెడ్డి, బాలాజీ, చంద్ర మోహన, మాజీ ఎంపీటీసీ సూర్యనారాయణ, టేకులోడు బయపరెడ్డి తదితరలు మైనార్టీ నాయకులతో సమావేశాన్ని ఏర్పాటుచేశారు.


ఇక్బాల్‌ మాట్లాడుతూ వైసీపీ ఐదే ళ్ల పాలనలో ముస్లింలకు తీరని అన్యాయం చేసిందన్నారు. కేవలం ముస్లిం మైనా ర్టీల ను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప వారికి చేసిందేమీ లేదన్నారు. అయితే టీడీపీ అఽధినేత చంద్రబాబు మొదటి నుంచి మైనార్టీలపై ప్రత్యేక దృష్టి పెడుతూ వచ్చార న్నారు. ఆయన వెంట పురం మాజీ మున్సిపల్‌ చైర్మన అనిల్‌ ఉన్నారు. అలాగే ఆయన లేపాక్షిలో ఏర్పాటు చేసిన ముస్లీం మైనార్టీల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.


హిందూపురం అర్బన: వైసీపీకి పురంలో మరో షాక్‌ తగిలింది. 12వ వార్డు వైసీపీ కౌన్సిలర్‌ రహమతబి టీడీపీ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ ఆదివారం పట్టణ పరిధిలోని 12వ వార్డు మోడల్‌ కాలనీ 2లో రహమతబీని ఆమె స్వగృహంలో ఇక్బాల్‌ కలిశారు. వైసీపీలో తనకు జరిగిన అన్యా యం, ముస్లింలకు వైసీపీ చేసిన మోసం వివరించారు.


ఈ సందర్భంగా ఆమె టీడీపీలో చేరారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దీపిక ఆదివారం తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్న సమయంలో వైసీపీ కౌన్సిలర్‌ టీడీపీలోకి జంప్‌ కావడాన్ని వైసీపీ నా యకులు జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆ పార్టీలోని కొంద మాట్లాడుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ మాజీ చైర్మన అనిల్‌కుమార్‌, టీడీపీ మైనార్టీ సెల్‌ హిదాయత తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా టీడీపీ ప్రకటించిన పథకాలను తెలుసుకొని మరి కొంత మంది త్వరలో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 29 , 2024 | 12:20 AM