JNTU : చంద్రబాబు అభివృద్ధికి వైసీపీ ముసుగు
ABN, Publish Date - Jul 28 , 2024 | 11:58 PM
వైసీపీ ప్రభుత్వంలో వర్సిటీల అభివృద్ధిని అటకెక్కించారు. మౌలిక సదుపాయాల కల్పనను విస్మరించారు. పైగా.. అంతకు మునుపు టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని తామే చేసినట్లుగా చూపించుకున్నారు. ఇందుకు నిదర్శనం.. అనంతపురం జేఎనటీయూలో అధునాతన భవనాల నిర్మాణం. 2014-19లో టీడీపీ ప్రభుత్వం అనంతపురం జేఎనటీయూలో రూ.120 కోట్లతో అధునాతన భవన నిర్మాణ పనులను చేపట్టింది. 2017 ఏప్రిల్ 20న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వర్చువల్‌గా...
జేఎనటీయూఏ భవనాలకు అప్పట్లో రూ.120 కోట్లు
పనులు మొదలైనా.. వైసీపీ హయాంలో నత్తనడక
గత ఏడాది ప్రారంభించిన వైసీపీ ప్రభుత్వం
చంద్రబాబు ఆవిష్కరించిన శిలాఫలకం తొలగింపు
కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో పునరుద్ధరించిన ఇనచార్జి వీసీ
అంతపురం సెంట్రల్, జూలై 28: వైసీపీ ప్రభుత్వంలో వర్సిటీల అభివృద్ధిని అటకెక్కించారు. మౌలిక సదుపాయాల కల్పనను విస్మరించారు. పైగా.. అంతకు మునుపు టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని తామే చేసినట్లుగా చూపించుకున్నారు. ఇందుకు నిదర్శనం.. అనంతపురం జేఎనటీయూలో అధునాతన భవనాల నిర్మాణం. 2014-19లో టీడీపీ ప్రభుత్వం అనంతపురం జేఎనటీయూలో రూ.120 కోట్లతో అధునాతన భవన నిర్మాణ పనులను చేపట్టింది. 2017 ఏప్రిల్ 20న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వర్చువల్‌గా శిలాఫలకాలను ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో కూడిన పరిపాలనా భవనం, లెక్చరర్ హాల్, ఫార్మసీ బిల్డింగ్, స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్, జిమ్ అండ్ యోగా సెంటర్ వంటి నూతన భవనాల నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులు కొనసాగుతున్న సమయంలో, 2019 సార్వత్రిక ఎన్నికలు
వచ్చాయి. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం కొలువు తీరింది. అక్కడి నుంచి నిర్మాణ పనులు నత్తనడకన సాగాయి. చివరికి గత సంవత్సరం పూర్తి అయ్యాయి. నూతన భవనాలను ప్రారంభించే క్రమంలో అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన శిలాఫలకాలను దాచేశారు. వాటి స్థానంలో కొత్త శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం, వర్సిటీ యాజమాన్యం మారడంతో అప్పట్లో దాచిన శిలాఫలకాన్ని ఇనచార్జ్ వీసీ ప్రొఫెసర్ సుదర్శనరావు బయటకు తీయించారు. శిలాఫలకాన్ని తిరిగి ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా 2014-19లో టీడీపీ ప్రభుత్వం జేఎనటీయూలో చేసిన అభివృద్ధిని గురించి వివరించారు.
జనవరి 6న నిర్వహించిన జేఎనటీయూ స్నాతకోవత్సవాలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. అదే సమయంలో అప్పటికే పూర్తి అయిన పరిపాలనా భవనాన్ని గవర్నర్ చేత ప్రారంభింపజేశారు. స్నాతకోత్సవం నిర్వహించిన ఎనటీఆర్ ఆడిటోరియానికి.. నూతన పరిపాలనా భవనానికి కొన్ని వందల అడుగులు మాత్రమే దూరం ఉంది. గవర్నర్ నేరుగా అక్కడికే వెళ్లి నూతన భవనాన్ని ప్రారంభించవచ్చు. కానీ స్నాతకోత్సవ వేదికమీదనే ఈ తతంగాన్ని పూర్తి చేయించారు. ఇనచార్జి వీసీ పాత శిలాఫలకాన్ని పునరుద్ధరించడంతో ‘వైసీపీ ప్రభుత్వం’ హైజాక్ గురించి వర్సిటీలో చర్చ జరిగింది.
జేఎనటీయూని భ్రష్టుపట్టించారు
మానవ వనరుల తయారీ కేంద్రంలాంటి జేఎనటీయూని గత వైసీపీ ప్రభుత్వంలో భ్రష్టు పట్టించింది. సాంకేతిక పరిజ్ఞానానికి, పారదర్శకతకు మారుపేరైన వర్సిటీ ప్రతిష్టను దేశస్థాయిలో దిగజార్చారు. ఈ ప్రభావం విద్యార్థులు, ప్రొఫెసర్‌లపై పడుతోంది. వేలాదిమంది విద్యార్థులు ప్రతియేటా జేఎనటీయూ అందజేసే పట్టాలను పుచ్చుకుని గ్రాడ్యుయేట్స్‌గా సమాజంలోకి అడుగుపెడుతున్నారు. వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో వర్సిటి అడ్మినిస్ర్టేషన, అకడమిక్, ఎగ్జామినేషన తదితర అనేక విభాగాలు పనిచేయాల్సి ఉంటుంది. ఈ అంశాల్లో రాజకీయాన్ని చొప్పించి ఫ్యాకల్టీ మధ్య విబేధాలు సృష్టించి అఽధోగతి పాలు చేశారు. ఇకనుంచి జేఎనటీయూ పరిపాలనను గాడినపెట్టి వర్సిటీకి పూర్వవైభవాన్ని తీసుకువస్తాం.
- సుదర్శన రావు, ఇనచార్జ్ వీసీ
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jul 28 , 2024 | 11:58 PM