ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP: బరితెగించిన వైసీపీ నేత... ఏకంగా ఉపాధ్యాయురాలిపై

ABN, Publish Date - Oct 30 , 2024 | 10:34 AM

Andhrapradesh: కదిరిలో వైసీపీ నేత బరితెగించి ప్రవర్తించాడు. ఏకంగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలినే చంపుతానంటూ బెదిరించాడు. ఉపాధ్యాయురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సదరు వైసీపీ నేతను అదుపులోకి తీసుకున్నారు.

YSRCP Leader

శ్రీ సత్యసాయి జిల్లా, అక్టోబర్ 30: అధికారంలో ఉన్నా లేకపోయినా మేమింతే అన్నట్లుగా ఉంది వైసీపీ నేతల (YSRCP Leader) తీరు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎంత విర్రవీగారో.. ఎంతటి బరితెగింపులకు పాల్పడ్డారో అందరికీ తెలిసిందే. తమకు ఎదురే లేదు అన్న చందంగా వైసీపీ నేతలు తెగించారు. కానీ అధికారం కోల్పోయినప్పటికీ వైసీపీ నేతల్లో మాత్రం అహంకారం కొంచెం కూడా తగ్గలేదు. ఇప్పటికీ పలు చోట్ల బరితెగింపులకు పాల్పడుతూనే ఉన్నారు. సామాన్య ప్రజలపై తమ దాష్టీకాన్ని చూపిస్తూనే ఉన్నారు. తాజాగా కదిరిలో ఓ వైసీపీ నేత చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఏకంగా ఓ ఉపాధ్యాయురాలినే చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు సదరు నేత.

నాకు బిర్యానీ పెట్టండి


కదిరిలో వైసీపీ నేత కృష్ణారెడ్డి అలియాస్ డిక్కీ బాబు దౌర్జన్యకాండకు తెగబడ్డాడు. తనకల్లు మండలంలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని చంపుతానంటూ కృష్ణారెడ్డి బెదిరించాడు. కృష్ణారెడ్డి మోసం చేసి... చంపుతానని బెదిరించారంటూ పోలీసులకు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు వైసీపీ నేతను అరెస్ట్ చేశారు. అయితే 2023లో నాడు- నేడు పనుల్లో అవినీతి జరిగిందంటూ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని విద్యాశాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సమాచారం తెలుసుకొన్న కృష్ణారెడ్డి తనకు వైసీపీ ప్రభుత్వంలో ప్రముఖ నాయకులు, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖలో బంధువులు ఉన్నారని, ఎలాంటి శిక్షలు లేకుండా తిరిగి ఉద్యోగం వచ్చేలా చేస్తానని తెలిపారు. అలాగే సస్పెన్షన్ ఎత్తివేయిస్తానంటూ ఉపాధ్యాయురాలి నుంచి రూ. 8 లక్షల వసూలు చేశాడు కృష్ణారెడ్డి. అయితే వైసీపీ పాలనలో సస్పెన్షన్ రద్దు చేయించకపోవడంతో ఎనిమిది లక్షలు వెనక్కి ఇవ్వాలంటూ వైసీపీ నేత కృష్ణారెడ్డిని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఒత్తిడి చేసింది. దీంతో అతడు ఐదు లక్షలను తిరిగి ఇచ్చేశాడు.

Viral Video: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. ఇతడి తెలివి ముందు ఎంతటి మేధావులైనా దిగదుడుపే..


ఇటీవలే సస్పెన్షన్ రద్దుతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు విధుల్లో చేరారు. తానే సస్పెన్షన్ ఎత్తివేయించాను అంటూ ఇటీవల తనకల్లులోని తన కార్యాలయానికి పిలిపించుకుని డబ్బులు ఇవ్వాలంటూ కత్తితో బెదిరింపులకు పాల్పడ్డాడు. బెదిరింపులకు భయపడిన ఉపాధ్యాయురాలు రూ.5 లక్షలు కృష్ణారెడ్డికి ఇచ్చింది. అంతే కాకుండా మరో రూ.2 లక్షలకు ప్రామిసరీ నోట్లు రాయించుకున్నాడు. ఆ డబ్బులు కూడా ఇవ్వాలంటూ ఉపాధ్యాయురాలిపై కృష్ణారెడ్డి ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో కృష్ణారెడ్డి బెదిరింపులు, దౌర్జన్యంపై పోలీసులకు ఉపాధ్యాయురాలు ఫిర్యాదు చేసింది. టీచర్ ఫిర్యాదుపై పలు సెక్షన్ల కింద కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసిన తనకల్లు పోలీసులు.. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే అతని వద్ద నుంచి రూ.2 లక్షల నగదుతో పాటు ప్రామిసరీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి...

‘భారతి’ కొంగు బంగారమే

Viral Video: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. ఇతడి తెలివి ముందు ఎంతటి మేధావులైనా దిగదుడుపే..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 30 , 2024 | 10:39 AM